Maruti Tour H1: రూ.4.80 లక్షలకే మారుతీ సుజుకీ టూర్‌ హెచ్‌1

Maruti Tour H1: ఆల్టో కే10ను ఆధారంగా చేసుకొని మారుతీ సుజుకీ టూర్‌ హెచ్‌1 కమర్షియల్‌ హ్యాచ్‌బ్యాక్‌ను తీసుకొచ్చింది.

Published : 09 Jun 2023 23:38 IST

దిల్లీ: మారుతీ సుజుకీ (Maruti Suzuki) ఇండియా.. ఎంట్రీలెవెల్‌ కమర్షియల్‌ హ్యాచ్‌బ్యాక్‌ను శుక్రవారం విడుదల చేసింది. టూర్‌ హెచ్‌1 (Tour H1) పేరిట తీసుకొస్తున్న ఈ కారును ఆల్టో కే10ను ఆధారం చేసుకొని రూపొందించారు. పెట్రోల్‌ వేరియంట్‌ ధర రూ.4.8 లక్షలు (ఎక్స్‌షోరూం). సీఎన్‌జీ ట్రిమ్‌ ధర రూ.5.7 లక్షలు. ఈ కారు 1-లీటర్‌ నెక్ట్స్‌ జనరేషన్‌ కే 10సీ ఇంజిన్‌తో వస్తోంది. పెట్రోల్‌ వెర్షన్‌ లీటర్‌కు 24.60 కి.మీ, సీఎన్‌జీ వెర్షన్‌ ఒక కిలోకు 34.46 కి.మీ మైలేజీ ఇస్తుందని కంపెనీ తెలిపింది.

స్పీడ్ లిమిటింగ్‌ ఫంక్షన్‌, ఎక్స్‌స్ట్రా డ్రైవింగ్‌ కంఫర్ట్‌, ఏబీఎస్‌, రివర్స్‌ పార్కింగ్‌ సెన్సార్స్, డ్రైవర్‌- కో డ్రైవర్‌ సైడ్‌ ఎయిర్‌బ్యాగ్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. 796 సీసీ సామర్థ్యం ఉన్న ఇంజిన్‌ 35.3kW గరిష్ఠ శక్తిని, 69Nm టార్క్‌ను విడుదల చేస్తుంది. 5 స్పీడ్‌ మాన్యువల్‌ ట్రాన్స్‌మిషన్‌ సిస్టంను అనుసంధానించారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని