Maruti Suzuki: మారుతీ సుజుకీ 17,362 కార్ల రీకాల్‌

Maruti Suzuki recalls: కొన్ని కార్ల ఎయిర్‌బ్యాగుల్లో చిన్న లోపం ఉండే అవకాశం ఉందని గుర్తించినట్లు మారుతీ సుజుకీ తెలిపింది. ఎలాంటి రుసుము లేకుండా వాటిని సరిచేస్తామని పేర్కొంది.

Published : 18 Jan 2023 13:30 IST

దిల్లీ: మారుతీ సుజుకీ (Maruti Suzuki) ఇండియా 17,362 కార్లను రీకాల్‌ చేయనున్నట్లు బుధవారం ప్రకటించింది. ఆల్టో కే10, బ్రెజా, బ్యాలెనో, ఎస్‌-ప్రెసో, ఈకో, గ్రాండ్‌ విటారా మోడళ్లలో కొన్నింటిలో ఎయిర్‌బ్యాగ్‌ (Airbag) కంట్రోలర్‌లో లోపం ఉండే అవకాశం ఉన్నట్లు గుర్తించామని తెలిపింది. లోపం ఉన్న కార్లలో తగు మార్పులు చేసి తిరిగి కస్టమర్లకు అప్పగిస్తామని పేర్కొంది.

2022 డిసెంబరు 8 నుంచి 2023 జనవరి 12 మధ్య తయారైన కార్ల ఎయిర్‌బ్యాగ్‌ కంట్రోలర్‌లలో లోపం ఉండే అవకాశం ఉందని గుర్తించినట్లు మారుతీ సుజుకీ (Maruti Suzuki) బుధవారం ప్రకటించింది. ఎలాంటి రుసుములు తీసుకోకుండానే తనిఖీ, మరమ్మతు ప్రక్రియను పూర్తి చేస్తామని తెలిపింది. ఒకవేళ ఈ లోపాన్ని సవరించకపోతే.. ప్రమాదం జరిగినప్పుడు అరుదుగా ఎయిర్‌బ్యాగ్‌లు, సీట్‌బెల్ట్‌లు పనిచేయకపోవచ్చునని పేర్కొంది. ఈ నేపథ్యంలో పైన తెలిపిన తేదీల మధ్య తయారైన కార్లను కొనుగోలు చేసిన వారికి కంపెనీ నుంచి పిలుపు వస్తుందని తెలిపింది. తనిఖీ చేసి లోపం ఉంటే.. వాటిని సవరించే వరకు కార్లను నడపొద్దని అప్రమత్తం చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని