Maruti Suzuki: జనవరి నుంచి మారుతీ సుజుకీ వాహనాలు ప్రియం

దేశీయ అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ జనవరి నుంచి అన్ని మోడళ్లపై ధరలను పెంచనుంది.

Published : 02 Dec 2022 16:34 IST

దిల్లీ: దేశీయ అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ (Maruti Suzuki) వాహన ధరలను పెంచనుంది. జనవరి నుంచి అన్ని మోడళ్లపై ధరలు పెంచనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. ద్రవ్యోల్బణం, నియంత్రణ ప్రమాణాలను అందుకోవడం వంటి కారణాల వల్ల ధరలు పెంచడం అనివార్యంగా మారిందని కంపెనీ తెలిపింది.

వాహన ధరలు పెంచకుండా ఉండేందుకు కంపెనీ చేయాల్సినదంతా చేసిందని, తప్పనిసరి పరిస్థితుల్లో పెంపు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని మారుతీ సుజుకీ తెలిపింది. 2023 జనవరి నుంచి మోడళ్ల వారీగా పెంపు ఉండబోతోందని కంపెనీ తెలిపింది. అయితే, ఎంత మొత్తం పెంచేదీ మాత్రం కంపెనీ పేర్కొనలేదు. చివరి సారిగా ఈ ఏడాది ఏప్రిల్‌లో ఎక్స్‌షోరూమ్‌ ధరపై 1.3 శాతం మేర ధరలను మారుతీ సవరించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని