Maruti Suzuki: కొత్త ఉద్గార ప్రమాణాలతో మారుతీ సుజుకీ వాహనాలు

Maruti Suzuki: ప్రముఖ వాహన తయారీ సంస్థ మారుతీ సుజుకీ (Maruti Suzuki) కఠిన ఉద్గార నిబంధనలకు అనుగుణంగా తన శ్రేణిలోని అన్ని వాహనాలను నవీకరించినట్లు పేర్కొంది.

Published : 25 Apr 2023 20:05 IST

దిల్లీ: ప్రముఖ వాహన తయారీ సంస్థ మారుతీ సుజుకీ (Maruti Suzuki) తన వాహనాలన్నింటినీ అప్‌గ్రేడ్‌ చేసినట్లు మంగళవారం తెలిపింది. బీఎస్‌-6 (BS-VI) కఠినమైన ఉద్గారాల నిబంధనలకు అనుగుణంగా తన శ్రేణిలోని అన్ని వాహనాలను నవీకరించినట్లు పేర్కొంది. కంపెనీ హ్యాచ్‌బ్యాక్‌లు, సెడాన్లు, ఎంపీవీలు, ఎస్‌యూవీలతో పాటు వాణిజ్య వాహనాలు  బీఎస్‌-6 ఫేజ్‌ -2 (BSVI Phase-II) రియల్‌  డ్రైవింగ్‌ ఎమిషన్స్‌కు (RDE) అనుగుణంగా మార్పు చేసినట్లు తెలిపింది. ఇవి ఈ-20 ఇంధనంతో నడుస్తాయని పేర్కొంది.

కొత్త ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా అన్ని వాహనాల్లోనూ ఆన్ బోర్డ్ డయాగ్నస్టిక్స్‌ (OBD) వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు మారుతీ సుజుకీ తెలిపింది. వాహనంలో ఎటువంటి అంతరాయం తలెత్తినా ఇది వెంటనే తెలియజేస్తుందని పేర్కొంది. ‘మా వాహనాల నుంచి కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు వినూత్న మార్గాలను ఎల్లప్పుడూ కనుగొంటూనే ఉంటాం. వాహన తయారీ సంస్థలు బీఎస్‌-6 రెండో దశ ఉద్గార ప్రమాణాలను అమలు చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కర్బన ఉద్గారాలను తగ్గించటంలో సహాయపడుతుంది’ అని మారుతీ సుజుకీ చీఫ్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌ సీవీ రామన్‌ పేర్కొన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 15 మోడల్‌ కార్లను మారుతీ సుజుకీ విక్రయిస్తోంది.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని