Life Insurance: ఫోన్ పేలో..మ్యాక్స్ లైఫ్ స్మార్ట్ సెక్యూర్ ప్లాన్‌

కొనుగోలు దారులు రూ. 10 కోట్ల వ‌ర‌కు హామీ మొత్తాన్ని ఎంచుకునే అవ‌కాశం ఉంది. 

Updated : 26 Mar 2022 17:14 IST

డిజిట‌ల్‌పై అవ‌గాహ‌న ఉండి, డిజిట‌ల్ లో కొనుగోళ్లు ఇష్ట‌ప‌డే వినియోగ‌దారుల కోసం మ్యాక్స్ లైఫ్ స్మార్ట్ సెక్యూర్ ప్ల‌స్ ప్లాన్‌ను.. ఫోన్‌-పే భాగ‌స్వామ్యంతో మ్యాక్స్ లైఫ్ ఇన్సురెన్స్ లాంచ్ చేసింది. ఇది నాన్-లింక్డ్, నాన్-పార్టిసిటింగ్ ఇండివిడ్యువ‌ల్‌ ప్యూర్‌ రిస్క్ ప్రీమియం లైఫ్ ఇన్సురెన్స్‌ ప్లాన్. 

ఈ ప్లాన్‌తో ఫోన్ పే వినియోగ‌దారులు వారి కుటుంబం మొత్తానికి స‌మ‌గ్ర ఆర్థిక క‌వ‌రేజ్‌ను అందించ‌వ‌చ్చు. వార్షిక ప్రారంభ ప్రీమియం రూ. 4,426. రూ. 10 కోట్ల వ‌ర‌కు హామీ మొత్తాన్ని ఎంపిక చేసుకునే అవ‌కాశం ఉంది. ఎంచుకున్న హామీ మొత్తం, ఇత‌ర అంశాల‌ ఆధారంగా ప్రీమియం మారుతుంటుంది. ఫోన్‌పే యాప్ ద్వారా బీమాను విక్ర‌యించేందుకు ఐఆర్‌డీఏఐ నుంచి లైసెన్స్ పొందింది. ఫోన్‌పే యాప్ ద్వారా చాలా త‌క్కువ పేప‌ర్ వ‌ర్క్‌తోనే సుల‌భంగా కొనుగోలు చేయ‌వ‌చ్చ‌ని బీమా సంస్థ తెలిపింది. ప్ర‌స్తుతం ఉన్న డిజిటల్ ప్ర‌పంచంలో వినియోగ‌దారుల‌కు జీవిత‌ బీమా కొనుగోలు, క్లెయిమ్ ప‌రిష్కార ప్ర‌క్రియ‌ను సర‌ళీకృతం చేయ‌డంతో పాటు, ట‌ర్మ్ ప్లాన్ అధిక మొత్తం లో వినియోగదారులకు అందించడమే లక్ష్యమని సంస్థ ప్ర‌తినిధులు వెల్ల‌డించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని