ఆరోగ్య బీమా ఏ వ్యాధుల‌కు వ‌ర్తించ‌దు?

ఆరోగ్య బీమా పాల‌సీ కొన్ని వ్యాదుల చికిత్స‌కు హామీ అందించ‌దు. అవేంటో తెలుసుకుందాం

Published : 22 Dec 2020 12:53 IST

 

ఆరోగ్య బీమాలో ఏ ర‌క‌మైన వ్యాదుల‌కు బీమా వ‌ర్తిస్తుంది. ఎలాంటి వాటితో బీమా కంపెనీకి సంబంధం ఉండ‌దో తెలుసుకుందాం. బీమా కంపెనీల చాలా ర‌కాల వ్యాధుల‌కు క‌వ‌రేజ్ అందించ‌వు. అయితే బీమా నియంత్ర‌ణ సంస్థ ఐఆర్‌డీఏఐ, బీమా క‌వ‌రేజ్‌ వ‌ర్తించ‌ని వ్యాధుల‌ను జాబితా నుంచి త‌గ్గించే విధంగా చ‌ర్య‌లు ప్రారంభించింది.

సాధార‌ణంగా బీమా వ‌ర్తించ‌ని వ్యాధులు:

బీమా పాల‌సీ తీసుకోక‌ముందు ముందే ఉన్న కొన్ని వ్యాదుల‌కు సాధ‌ర‌ణంగా 24 నుంచి 48 నెల‌ల త‌ర్వాత చికిత్స‌కు హామీ అందిస్తుంది. వ అంత‌కుముందు మీకు చికిత్స అవ‌స‌ర‌మైతే సొంత డ‌బ్బు ఖ‌ర్చు చేసుకోవాల్సి ఉంటుంది. చాలావ‌ర‌కు బీమా పాల‌సీలు తీసుకున్న 30 రోజుల వ‌ర‌కు ఎలాంటి బీమా హామీనివ్వ‌వు. త‌ర్వాత కూడా మీ ఖ‌ర్చుల‌న్నింటినీ భ‌రిస్తుంద‌న్న హామీ ఉండ‌దు. చాలా ర‌కాల ఖ‌ర్చుల‌కు బీమా పాల‌సీ క‌వ‌రేజ్ ఉండ‌దు. దీనికోసం ఏయే ఖ‌ర్చుల‌కు బీమా పాల‌సీ వ‌ర్తించ‌దో ముందే తెలుసుకోవాలి.

బీమా సంస్థ‌లు క‌ళ్ల‌ద్దాలు, కాంటాక్ట్ లెన్స్, వినికిడి యంత్రాలు, వాక‌ర్స్‌, డెంట‌ల్ చికిత్స వంటి వాటికి క‌వ‌రేజ్ అందించ‌వు. సీనియ‌ర్ సిటిజ‌న్ ఆరోగ్య బీమా పాల‌సీలు ఈఎన్‌టీ సంబంధిత వ్యాధుల‌కు, హెర్నియా, వృద్ధ వ‌య‌సులో వ‌చ్చే వ్యాధుల‌కు బీమా హామీనందించ‌వు. వంశ‌పారం ప‌ర్యంగా వ‌చ్చ వ్యాధులు, జ‌న్యు ప‌ర‌మైన వ్యాధులు కూడా ఇందులోకి వ‌స్తాయి. అల్స‌ర్‌, సైన‌సైటీస్ వంటి వాటికి కూడా వ‌ర్తించ‌వు. పోష‌కాహార లోపం వ‌ల‌న క‌లిగే వ్యాధులు, మాన‌సిక వ్యాదులు ఇలాంటి కొన్నింటిని బీమా సంస్థలు మిన‌హాయిస్తాయి.

పాల‌సీ తీసుకున్న‌వారికి ఏ వ్యాధుల‌కు బీమా వ‌ర్తించ‌దో తెలియ‌క క్లెయిమ్ చేస్తుంటే అవి తిర‌స్క‌రిస్తున్నారు. ముఖ్యంగా సాధారణ ప్ర‌జ‌లు బీమా సంస్థ‌ల‌కు ఉప‌యోగించే పేర్ల‌ను అర్థం చేసుకోలేక‌పోతున్నారు. బీమా సంస్థ‌లు ఎందుకు ఇలాంటి కొన్ని వ్యాదుల‌కు క‌వ‌రేజ్ అందించ‌వంటే…కొన్ని వ్యాధుల‌ను బీమా హామీ నుంచి మిన‌హాయించ‌డం ద్వారా సంస్థ‌కు రిస్క్ నుంచి త‌ప్పించుకుంటాయి. మ‌దుమేహం, బీపీ వంటి ముంద‌స్తు రోగాల‌కు చికిత్స‌కు హామీ 3-4 సంవ‌త్స‌రాల త‌ర్వాత ఉంటుంది. కొన్ని ర‌కాల శస్ర్త చికిత్స‌ల‌కు హామీ రెండేళ్ల త‌ర్వాత ఉంటుంది. హెచ్ఐవీ వంటి న‌యంకానీ రోగాల‌కు బీమా పాల‌సీ ఉండ‌దు, డెంట‌ల్ స‌ర్జ‌రీలు (ప్ర‌మాద‌వ‌శాత్తు సంభ‌వించిన‌వి కాకుండా), కాస్మ‌టిక్ స‌ర్జరీలు కూడా క‌వ‌రేజ్ అందించ‌వు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని