Mercedes-Benz: మెర్సిడెస్ బెంజ్‌లో సూపర్ కంప్యూటర్ తరహా పెర్ఫార్మెన్స్
తమ కార్లలో నావిగేషన్ సహా సూపర్ కంప్యూటర్ తరహా పెర్ఫార్మెన్స్‌ను అందించేందుకు గూగుల్ (Google)తో చేతులు కలిపినట్లు మెర్సిడెస్ బెంజ్ గురువారం ప్రకటించింది.
ఇంటర్నెట్ డెస్క్: రోజురోజుకీ కార్లలో వస్తున్న సాంకేతికత డ్రైవింగ్‌ను సులభతరం చేస్తోంది. పెద్ద ఎత్తున సమాచారాన్ని విశ్లేషించి ప్రమాదాలను అరికట్టేందుకు దోహదం చేస్తోంది. మానవ ప్రమేయాన్ని తగ్గించి ఆటోమేటిక్ డ్రైవింగ్ దశకు చేరుస్తోంది. ఈ ప్రయాణంలో బిలియనీర్ ఎలాన్ మస్క్‌కు చెందిన టెస్లా ముందు వరుసలో ఉంది. చైనాకు చెందిన పలు కంపెనీలు కూడా ఇటీవలి కాలంలో ఎంతో పురోగతి సాధించాయి. తాజాగా మెర్సిడెస్ బెంజ్ (Mercedes-Benz) వీటికి పోటీనిచ్చేందుకు సిద్ధమవుతోంది.
తమ కార్లలో నావిగేషన్ సహా సూపర్ కంప్యూటర్ తరహా పనితీరును అందించేందుకు గూగుల్ (Google)తో చేతులు కలిపినట్లు మెర్సిడెస్ బెంజ్ గురువారం ప్రకటించింది. ఆటోమేటెడ్ డ్రైవింగ్ సెన్సర్లను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది. మరోవైపు ఖరీదైన, అత్యంత శక్తిమంతమైన సెమీకండక్టర్ల కొనుగోలు కోసం ఎన్విడియా (Nvidia) కంపెనీతో భాగస్వామ్యం కుదుర్చుకొంది. ఖర్చును తగ్గించుకునేందుకు కార్ల విక్రయాల ద్వారా వచ్చే ఆదాయంలో కొంత వాటాను ఆ సంస్థకు ఇచ్చేలా ఒప్పందం చేసుకుంది. 2020 నుంచి ఈ కంపెనీ మెర్సిడెస్ బెంజ్‌కు ఆటోమేటెడ్ డ్రైవింగ్ సాఫ్ట్‌వేర్ పార్ట్‌నర్‌గా వ్యవహరిస్తోంది.
లెవెల్ 3 ఆటోమేటెడ్ డ్రైవింగ్‌కు కావాల్సిన లైడార్ సెన్సర్ టెక్నాలజీ కావాల్సిన కస్టమర్లు అధికంగా చెల్లించాల్సి ఉంటుందని మెర్సిడెస్ బెంజ్ సీఈఓ ఓలా క్యాలెనియస్ తెలిపారు. మరోవైపు సెల్ఫ్ డ్రైవింగ్‌కు కావాల్సిన సెన్సర్లను తయారు చేసే ల్యూమినార్ టెక్‌లో మెర్సిడెస్‌కు వాటాలున్నాయి. తాజాగా బెంజ్ కార్లలో సెన్సర్ల అనుసంధానానికి సంబంధించి మల్టీ- బిలియన్ డాలర్ల ఒప్పందం కుదిరినట్లు ల్యూమినస్ ప్రకటించింది.
గూగుల్‌తో చేతులు కలపడం వల్ల ట్రాఫిక్ సమాచారం, ఆటోమేటిక్ రీరూటింగ్ వంటి సాంకేతికత తమ కార్లకు అందుతుందని మెర్సిడెస్ తెలిపింది. లెవెల్ 3 అటానమస్ డ్రైవింగ్ మోడ్‌లో ఉన్నప్పుడు డ్రైవర్లు యూట్యూబ్ ద్వారా ఎంటర్‌టైన్‌మెంట్‌ని కూడా పొందొచ్చని పేర్కొంది. జనరల్ మోటార్స్, రెనో, నిస్సాన్, ఫోర్డ్ వంటి సంస్థలు ఇప్పటికే తమ కార్లలో గూగుల్ సర్వీసెస్‌ను పొందుపర్చాయి. గూగుల్ మ్యాప్స్, గూగుల్ అసిస్టెంట్ సహా ఇతర అప్లికేషన్లు అందుబాటులో ఉంచాయి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Adivi Sesh: ‘కర్మ’పై అడివి శేష్ ఆసక్తికర ట్వీట్.. ఆయనతో పనిచేయడం గర్వంగా ఉందంటూ..
-
General News
Odisha Train Accident: రేపు, ఎల్లుండి పలు రైళ్లు రద్దు
-
India News
Odisha train tragedy: నెత్తుటి పట్టాలపై.. నలిగిపోయిన ‘ప్రేమ గీతాలు’!
-
India News
Odisha Train Accident: ఆ చిన్నారులను ఆదుకుంటాం.. అదానీ, సెహ్వాగ్‌ల చొరవ!
-
Movies News
Social Look: శ్రీలంకలో మృణాళిని రవి సెల్ఫీ.. విష్ణుప్రియ ‘ఎల్లో’ డ్రెస్సు
-
India News
Bridge Collapse: నిర్మాణంలో ఉండగానే కుప్పకూలిన వంతెన.. వీడియో వైరల్