Meta: మెటా ఇండియాకు లేడీ బాస్‌.. కొత్త సంవత్సరంలో బాధ్యతలు!

మెటా ఇండియా హెడ్‌గా సంధ్య దేవనాథన్‌ను సంస్థ నియమించింది. ప్రస్తుతం మెటా ఆసియా-పసిఫిక్‌ డివిజన్‌ గేమింగ్ విభాగం వైస్‌ ప్రెసిడెంట్‌గా ఉన్న ఆమె కొత్త సంవత్సరంలో మెటా ఇండియా బాధ్యతలు చేపట్టనున్నట్లు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. 

Published : 17 Nov 2022 18:02 IST

దిల్లీ: ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సాప్‌ మాతృసంస్థ మెటా ఇండియా హెడ్‌గా సంధ్య దేవనాథన్‌ను నియమించింది. జనవరి 1,2023 నుంచి ఆమె బాధ్యతలు చేపడతారని మెటా ఒక ప్రకటనలో తెలిపింది. సంధ్య దేవనాథన్‌, ప్రస్తుతం మెటా ఆసియా-పసిఫిక్‌ డివిజన్‌ గేమింగ్ విభాగం వైస్‌ ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్నారు. అంతకుముందు ఆమె మెటా సింగపూర్‌ ఎండీ, మెటా వియత్నాం బిజినెస్‌ హెడ్‌గా బాధ్యతలు నిర్వహించారు.

సంధ్య 2000 సంవత్సరంలో దిల్లీ యూనివర్శిటీ నుంచి ఫ్యాకల్టీ మేనేజ్‌మెంట్‌లో ఎంబీఏ పట్టా అందుకున్నారు. 2016లో ఆమె సింగపూర్‌, వియత్నాంలలో మెటా బిజినెస్‌ అభివృద్ధి బాధ్యతలు చేపట్టారు. బ్యాంకింగ్‌, పేమెంట్స్‌, టెక్నాలజీ వంటి విభాగాల్లో ఆమెకు 22 ఏళ్ల అనుభవం ఉన్నట్లు లింక్డ్‌ఇన్‌ ప్రొఫైల్‌లో పేర్కొన్నారు. వ్యాపార నిర్వహణ, టీమ్‌ మేనేజ్‌మెంట్, కొత్త ఉత్పత్తుల ఆవిష్కరణలలో సంధ్య దేవనాథన్‌కు ఉన్న అనుభవం మెటా సంస్థ భారత్‌లో బలపడేందుకు మరింత తోడ్పడుతుందని మెటా చీఫ్‌ బిజినెస్‌ ఆఫీసర్‌ మార్నే లెవిన్‌ అన్నారు.

ఇటీవలే మెటా ఇండియా పబ్లిక్‌  పాలసీ హెడ్‌గా శివనాథ్‌ తుక్రాల్‌ను కంపెనీ నియమించింది. గతంలో ఈయన వాట్సాప్ ఇండియా పబ్లిక్‌ పాలసీ డైరెక్టర్‌గా వ్యవహరించారు. కొద్దిరోజుల క్రితం మెటా ఇండియా హెడ్‌గా ఉన్న అజిత్ మోహన్‌ తన పదవి నుంచి వైదొలిగారు. తర్వాత మెటా పబ్లిక్ పాలసీ విభాగాధిపతి రాజీవ్‌ అగర్వాల్‌, వాట్సాప్‌ ఇండియా హెడ్‌ అభిజిత్‌ బోస్‌ సైతం తమ పదవులకు రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో వారి స్థానంలో మెటా సంస్థ కొత్తవారిని నియమించింది. 

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts