Meta: ఏ పనీ చేయకున్నా.. మెటా ఉద్యోగికి కోటిన్నర జీతం..!
లేఆఫ్‌ల (Layoffs) కారణంగా ఉద్యోగాలు కోల్పోయినవారు తమ ఆవేదన వ్యక్తం చేస్తూ సామాజిక మాధ్యమాల్లో (Social Media) పోస్టులు పెడుతున్నారు. తాజాగా, మెటా (Meta) మాజీ ఉద్యోగి ఒకరు కంపెనీలో పనితీరు, జీతభత్యాల గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
కాలిఫోర్నియా: ఆర్థిక మాంద్యం భయాలతో టెక్ కంపెనీలు ఉద్యోగులకు లేఆఫ్‌లు (Layoffs) విధిస్తున్నాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా వేల మంది టెకీలు ఉద్యోగాలు కోల్పోవాల్సి వచ్చింది. కొత్త ఉద్యోగాన్వేషణలో భాగంగా చాలా మంది తమ ఆవేదనను వ్యక్తం చేస్తూ సామాజిక మాధ్యమాల్లో (Social Media) పోస్టులు పెడుతున్నారు. కారణం చెప్పకుండా కంపెనీ తొలగించిందని కొందరు వాపోతే.. కష్టపడి పనిచేసినందుకు తగిన ఫలితం దక్కిందంటూ మరికొందరు తమ పోస్ట్‌లలో వాపోయారు. తాజాగా మెటా (Meta)లో మానవనరుల విభాగంలో మేనేజర్ స్థాయిలో పనిచేసిన మాడెలిన్ మచాదో (Madelyn Machado) ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
మెటాలో ఆరు నెలలపాటు ఎలాంటి పనిచేయకుండానే 1,90,000 డాలర్లు (రూ. 1.5 కోట్లు) జీతం అందుకున్నట్లు ఆమె తెలిపారు. ‘‘కంపెనీ ఉద్యోగులు పనిచేయాలని అనుకుంటున్నా.. వారికి కేటాయించేందుకు ఎలాంటి పని లేదు అనేందుకు ఇదే ఉదాహరణ’’ అని మాడెలిన్ ఓ అంతర్జాతీయ వార్తా సంస్థతో చెప్పారు.
బ్రిట్నీ లెవీ (Britney Levy) అనే మరో మెటా మాజీ ఉద్యోగి మాట్లాడుతూ.. ‘‘కంపెనీలో చేసేందుకు సరైన పని ఉండేది కాదు. మెటా వంటి సంస్థలు ఎలాంటి ప్రణాళిక లేకుండా ఉద్యోగ నియామకాలు చేపడతాయి. ఉద్యోగి నియామకం చేపట్టిన తర్వాత వారికి సరైన పనిని కేటాయించరు. చాలా కాలంపాటు నేను చేయాల్సిన పని వెతుక్కునేందుకు కష్టపడాల్సి వచ్చింది. కరోనా సమయంలో టెక్నాలజీకి ఆదరణ పెరగడంతో కంపెనీలు ఎక్కువ మంది ఉద్యోగులను నియమించుకున్నాయి. తాజాగా ఆర్థిక మాంద్యం భయాలతో వారిని తొలగిస్తున్నాయి’’ అని చెప్పారు.
మెటా సంస్థ ఇప్పటి వరకు ప్రపంవ్యాప్తంగా 20 వేల మంది ఉద్యోగులకు లేఆఫ్‌లు ప్రకటించింది. గతేడాది నవంబరు మొదటి విడత లేఆఫ్‌లు విధించగా, ఈ ఏడాది మార్చి నెలలో రెండోసారి లేఆఫ్‌లు ప్రకటించింది. తొలగించిన ఉద్యోగులకు 16 వారాల జీతం చెల్లించడంతోపాటు, వారు పనిచేసిన సంవత్సరాల ఆధారంగా ఏడాదికి రెండు వారాల జీతం అదనంగా ఇస్తామని మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ (Mark Zuckerberg) ఉద్యోగులకు పంపిన మెయిల్‌లో పేర్కొన్నారు. దాంతోపాటు ఆరునెలలు ఉచిత ఆరోగ్యబీమా అందిస్తామని తెలిపారు. మెటాతోపాటు అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్, ట్విటర్ వంటి దిగ్గజ సంస్థలు సైతం లేఆఫ్‌లు ప్రకటించిన సంగతి తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
ChatGPT: చాట్‌జీపీటీ నుంచి బిగ్ అప్డేట్.. ఇక రియల్‌టైమ్ సమాచారం
-
Cricket: చైనాకు బయల్దేరిన టీమ్ఇండియా.. ఆ రెండు మ్యాచ్‌లకు బావుమా దూరం
-
MS Swaminathan: ఆకలి తీర్చిన మహనీయుడా.. ఈ దేశం మిమ్మల్ని ఎప్పటికీ మరిచిపోదు!
-
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Viral video: సిబ్బందిని మందలించిందని.. వ్యాపార భాగస్వామిని చితకబాదాడు.. వీడియో వైరల్
-
Electric One: ఎలక్ట్రిక్ వన్ నుంచి రెండు విద్యుత్ స్కూటర్లు.. సింగిల్ ఛార్జింగ్‌తో 200KM