Meta Layoffs: మెటాలో మరో 10,000 మంది ఉద్యోగుల తొలగింపు?
Meta Layoffs: గత నవంబరులో 11 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపిన మెటా.. తాజాగా మరింత మందిని తీసివేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
వాషింగ్టన్: టెక్ కంపెనీల్లో ఉద్యోగాల కోత కొనసాగుతూనే ఉంది. ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా (Meta Layoffs) మరింత మంది ఉద్యోగులను తీసివేయనున్నట్లు సమాచారం. అమెరికా కాలమానం ప్రకారం బుధవారం అధికారికంగా దీనిపై ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వ్యయ నియంత్రణలో భాగంగా దాదాపు మరో 10,000 మందిని తొలగించాలని మెటా (Meta Layoffs) నిర్ణయించినట్లు సమాచారం.
మెటా పరిధిలో ఉన్న ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, వర్చువల్ రియాలిటీపై పనిచేస్తున్న రియాలిటీ ల్యాబ్.. ఇలా అన్ని వ్యాపారాల్లో ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే మేనేజర్లకు అంతర్గతంగా సమాచారం పంపినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. మార్చిలోనే సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ (Mark Zuckerberg) దీనిపై సంకేతాలిచ్చారు. అన్ని విభాగాల్లో సిబ్బంది కూర్పును పునఃసమీక్షించి కంపెనీ సామర్థ్యాన్ని మరింత పెంచాలనుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. అందుకనుగుణంగానే తాజాగా లేఆఫ్‌లకు (Meta Layoffs) సిద్ధమైనట్లు స్పష్టమవుతోంది. మే నెలలో మరికొంత మందిని కూడా తీసివేసే అవకాశం ఉందని సమాచారం.
గత ఏడాది నవంబరులోనే కంపెనీ సిబ్బందిలో 13 శాతానికి సమానమైన 11,000 మందిని మెటా (Meta Layoffs) తొలగించింది. అలాగే కొత్త నియామకాలనూ నిలిపివేసింది. తాజాగా మేనేజర్లకు పంపిన సమాచారంలో కంపెనీలోని ఉద్యోగుల బృందాలన్నింటినీ పునఃనిర్మించనున్నట్లు జుకర్‌బర్గ్ తెలిపారు. లేఆఫ్‌ల (Meta Layoffs) తర్వాత కొంతమంది కొత్త ప్రాజెక్టులపై పనిచేయాల్సి రావొచ్చని స్పష్టం చేశారు.
డిస్నీలో మరోసారి..!
అమెరికాకు చెందిన ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ వాల్ట్ డిస్నీ సైతం వేలాదిమంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. ఎంటర్‌టైన్‌మెంట్ విభాగంలో దాదాపు 15 శాతం మంది ఉద్యోగులను వచ్చే వారం కోత విధించనుంది. టీవీ, ఫిల్మ్, థీమ్ పార్క్, కార్పొరేట్ విభాగాల్లో ఈ కోతలు ఉండబోతున్నాయి. ఏప్రిల్ 24 నాటికి తొలగింపుల సమాచారం ఉద్యోగులకు అందబోతోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో 7 వేలమంది ఉద్యోగులను సంస్థ తీసివేసింది. ఇప్పుడు మరో విడతలో వేలాది ఉద్యోగులను తొలగించనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
యూపీలో రోడ్డుపై మహిళను ఈడ్చుకెళ్లిన లేడీ కానిస్టేబుళ్లు
-
భారత్‌కు తిరిగి రానున్న శివాజీ ‘పులి గోళ్లు’!
-
‘సీఎం ఇంటికి కూతవేటు దూరంలోనే స్కిల్ డెవలప్మెంట్ కేంద్రం’
-
కన్నవారి నడుమ కుదరని ఏకాభిప్రాయం.. మూడేళ్ల చిన్నారికి పేరు పెట్టిన హైకోర్టు
-
Chandrababu: జైలులో నేడు చంద్రబాబు దీక్ష
-
తిరుమలలో బ్రేక్ దర్శనం, గదుల బుకింగ్‌కు ‘పే లింక్’ సందేశాలతో నగదు చెల్లింపు!