శాంసంగ్‌లో చేరనున్న మెటా ఇండియా పబ్లిక్‌ పాలసీ మాజీ చీఫ్‌?

మెటా ఇటీవలే 11 వేల మంది ఉద్యోగుల్ని తొలగించిన విషయం తెలిసిందే. సరిగ్గా ఈ తరుణంలో భారత్‌లో తమ కంపెనీ నుంచి ఇద్దరు కీలక వ్యక్తుల రాజీనామా చేసినట్లు కంపెనీ తెలిపింది. వీరిలో ఒకరైన మెటా ఇండియా పబ్లిక్‌ పాలసీ హెడ్‌ రాజీవ్‌ అగర్వాల్‌ త్వరలో శాంసంగ్‌లో చేరనున్నట్లు సమాచారం.

Updated : 16 Nov 2022 16:24 IST

దిల్లీ: ఫేస్‌బుక్‌ మాతృ సంస్థ మెటా పబ్లిక్‌ పాలసీ విభాగాధిపతి పదవికి మంగళవారం రాజీనామా చేసిన రాజీవ్‌ అగర్వాల్‌.. త్వరలో శాంసంగ్‌లో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. అందులోనూ పబ్లిక్‌ పాలసీ విభాగానికే నేతృత్వం వహించనున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఇద్దరు కీలక వ్యక్తులను ఉటంకిస్తూ బ్లూమ్‌బెర్గ్‌ కథనం ప్రచురించింది.

శాంసంగ్‌ ఇండియా పబ్లిక్‌ పాలసీ విధానాలకు సంబంధించి ఎప్పటికప్పుడు ప్రభుత్వ వర్గాలతో చర్చించి నిర్ణయాలు తీసుకోడమే రాజీవ్‌ ప్రధాన బాధ్యత అని సమాచారం. డిసెంబరులో కంపెనీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఈ విషయాన్ని ఇటు రాజీవ్‌గానీ, అటు శాంసంగ్‌గానీ అధికారికంగా ప్రకటించలేదు. మెటాలో చేరడానికి ముందు ఆయన ఉబర్‌ టెక్‌లో దక్షిణాసియా పాలసీ హెడ్‌గా పనిచేశారు.

మెటా ఆధ్వర్యంలోని మరో సంస్థ వాట్సప్‌ ఇండియా అధిపతి అభిజిత్‌ బోస్‌ సైతం తన పదకి రాజీనామా చేసినట్లు కంపెనీ మంగళవారం వెల్లడించిన విషయం తెలిసిందే. మెటాలో అంతర్జాతీయంగా 11,000 మంది ఉద్యోగులకు లే-ఆఫ్‌ ప్రకటించిన వారం తర్వాత ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని