
Metaverse: మెటావర్స్‌తో 20 రెట్లు పెరగనున్న డేటా వినియోగం
దిల్లీ: మనుషుల్ని వర్చువల్ ప్రపంచంలోకి తీసుకెళ్లే మెటావర్స్ (Metaverse) సాంకేతికత అందుబాటులోకి వస్తే డేటా వినియోగం భారీగా పెరిగే అవకాశం ఉందని ఓ ప్రముఖ నివేదిక వెల్లడించింది. దీనివల్ల భారత్‌లో ఉన్న కీలక టెలికాం (Telecom) సంస్థలకు భారీ ఎత్తున ప్రయోజనం చేకూరనుందని పేర్కొంది.
మెటావర్స్ వల్ల 2032 నాటికి డేటా వినియోగం 20 రెట్లు పెరగనుందని క్రెడిట్ సూయిజ్ నివేదిక తెలిపింది. అలాగే వినియోగదారులు తెరపై గడిపే సమయమూ (screen time) పెరుగుతుందని పేర్కొంది. ఇంటర్నెట్ ట్రాఫిక్‌లో 80 శాతం వీడియోలకే ఉందని తెలిపింది. ఇది ఏటా 30 శాతం వృద్ధిరేటు నమోదు చేస్తోందని వెల్లడించింది. సాధారణ మెటావర్స్‌ను వినియోగించినా.. మరో 37 శాతం వృద్ధిరేటు అదనంగా రికార్డు అవుతుందని తెలిపింది. మెటావర్స్కు కావాల్సిన ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ సాంకేతికతలు భారీ ఎత్తున పుంజుకోనున్నాయని వివరించింది.
5జీ (5G) మెటావర్స్ వినియోగానికి నాంది పలికితే.. 6జీ వల్ల దాని ఉపయోగాలు విస్తరిస్తాయని నివేదిక స్పష్టం చేసింది. తొలుత గేమింగ్ విభాగంలో మెటావర్స్ ఉపయోగం ఉంటుందని తెలిపింది. 4జీ, స్మార్ట్ఫోన్ల వల్ల ఇప్పటికే భారత్ గేమింగ్‌కు భారీ ఆదరణ లభిస్తోందని పేర్కొంది. దీంతో మెటావర్స్‌ను తొలుత గేమింగ్ ఇండస్ట్రీయే వాడుకోనుందని తెలిపింది. ప్రపంచంలో భారత్‌లోనే అత్యధికంగా మొబైల్‌పై ఎక్కువ సమయం గడుపుతున్నారని పేర్కొంది. కానీ, మెటావర్స్కు కావాల్సిన ఫిక్స్డ్ బ్రాడ్‌బ్యాండ్ విస్తరణ మాత్రం తక్కువగానే ఉందని తెలిపింది.
భారత టెలికాం కంపెనీల ఆదాయాలపై మెటావర్స్ ప్రభావం ఎలా ఉండనుందనేది ఇప్పుడే అంచనా వేయలేమని క్రెడిట్ సూయిజ్ నివేదిక తెలిపింది. గణనీయ ఫిక్స్డ్ బ్రాడ్‌బ్యాండ్ నెట్వర్క్ కలిగిన భారతీ ఎయిర్టెల్ (Bharti Airtel), జియో (Reliance Jio) మెటావర్స్ రాక వల్ల ఎక్కువ లబ్ధిపొందే అవకాశం ఉందని పేర్కొంది. 2020 ఆర్థిక సంవత్సరంలో 6.8 శాతంగా ఉన్న ఫిక్స్డ్ బ్రాడ్‌బ్యాండ్ నెట్వర్క్ విస్తరణ 9 శాతానికి పెరిగిందని తెలిపింది. 2025 నాటికి ఇది 12.6 శాతానికి ఎగబాకుతుందని పేర్కొంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
ENG vs IND: ఆ ‘తుపాన్’ మన మీదకొస్తే..!
-
Crime News
Prayagraj: కుమార్తె మృతదేహంతో ఐదు రోజులుగా ఇంట్లోనే.. బతికించేందుకు క్షుద్రపూజలు
-
General News
Health: యోగా చేయండి.. జ్ఞాపక శక్తి పెంచుకోండి
-
Movies News
Shivani Rajasekhar: ‘మిస్ ఇండియా’ పోటీ నుంచి తప్పుకున్న శివానీ రాజశేఖర్.. కారణమిదే
-
Politics News
బిహార్‌లో మజ్లిస్‌కు షాక్.. నలుగురు ఎమ్మెల్యేలు జంప్!
-
India News
GST: గబ్బర్ సింగ్ ట్యాక్స్ ఇకనుంచి ‘కుటుంబ సర్వనాశన ట్యాక్స్’
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Maharashtra crisis: మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా.. గవర్నర్ ఆమోదం
- Allu Arjun: ‘పుష్ప’తో మక్కల్ సెల్వన్ ఢీ.. లెక్కల మాస్టారి స్కెచ్ అదేనా?
- బీచ్‌లో కాలక్షేపం కోసం ₹5 లక్షల కోట్ల కంపెనీకి సీఈఓ రాజీనామా!
- Rajamouli: అలా చేస్తేనే థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య పెరుగుతుంది: రాజమౌళి
- Viral Video: గోల్డ్ స్మగ్లింగ్‌కు పాల్పడిన చీమలు.. ఏ కేసు పెట్టాలని నెటిజన్లకు అధికారి ప్రశ్న!
- Udaipur Murder: ‘నన్ను చంపడానికి ప్లాన్.. రక్షించండి’.. హత్యకు ముందు పోలీసులకు దర్జీ ఫిర్యాదు!
- Mahesh babu: బిల్ గేట్స్‌తో మహేశ్‌బాబు.. పిక్ వైరల్.. ఎక్కడ కలిశారంటే?
- Karnataka: అప్పు తిరిగి చెల్లించలేదని.. అక్కాచెల్లెళ్లను వివస్త్రలను చేసి దాడి!
- WhiteHat Jr: 300 మంది ఉద్యోగుల్ని తొలగించిన వైట్‌హ్యాట్
- Shivani Rajasekhar: ‘మిస్ ఇండియా’ పోటీ నుంచి తప్పుకున్న శివానీ రాజశేఖర్.. కారణమిదే