Gloster BLACKSTORM: ఎంజీ మోటార్ నుంచి గ్లోస్టర్ బ్లాక్‌స్టోర్మ్ @ రూ.40.29 లక్షలు
Gloster BLACKSTORM: డ్యుయల్ పానోరమిక్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, 12-వే పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ వంటి అత్యాధునిక ఫీచర్లతో ఎంజీ మోటార్ గ్లోస్టర్‌లో అత్యాధునిక వెర్షన్‌ను తీసుకొచ్చింది.
దిల్లీ: ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఎంజీ మోటార్ ఇండియా తమ ఎస్‌యూవీ గ్లోస్టర్‌లో కొత్త ఎడిషన్‌ను తీసుకొచ్చింది. దీని ప్రారంభ ధర రూ.40.29 లక్షలు (ఎక్స్‌షోరూం). బ్లాక్‌స్టోర్మ్ (Gloster BLACKSTORM) పేరిట తీసుకొస్తున్న ఈ అడ్వాన్స్‌డ్ గ్లోస్టర్‌లో లెవెల్-1 ‘అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS)’ అందుబాటులో ఉంది. 2-లీటర్ డీజిల్ ఇంజిన్‌తో వస్తోన్న ఈ కారులో 30కి పైగా భద్రతా ఫీచర్లు ఉన్నాయి.
డ్యుయల్ పానోరమిక్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, 12-వే పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ వంటి అత్యాధునిక ఫీచర్లు కూడా ఉన్నాయి. స్నో, మడ్, ఎకో, స్పోర్ట్, నార్మల్, రాక్, శాండ్ అనే ఏడు డ్రైవింగ్ మోడ్‌లు అందుబాటులో ఉన్నాయి. ఆరు, ఏడు సీట్ల సామర్థ్యంతో వస్తోంది. ఇంటీరియర్‌ను అత్యంత లగ్జరీగా తీర్చిదిద్దినట్లు కంపెనీ తెలిపింది. ఈ కారును కొనుగోలు చేసేవారికి ‘మై ఎంజీ షీల్డ్’ అనే ప్రత్యేక ప్రోగ్రాం కింద 180 రకాల సేవలను అందించనున్నట్లు పేర్కొంది. అలాగే మూడేళ్ల వరకు వారెంటీ, రోడ్‌సైడ్ అసిస్టెన్స్, మూడు లేబర్ ఫ్రీ పీరియాడిక్ సర్వీసులనూ ఇస్తున్నట్లు తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Intresting News today: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
Damini bhatla: ఊహించని ట్విస్ట్.. బిగ్‌బాస్ నుంచి సింగర్ దామిని ఎలిమినేట్
-
Sudhamurthy: నా పేరును దుర్వినియోగం చేస్తున్నారు.. పోలీసులకు సుధామూర్తి ఫిర్యాదు
-
Raghava Lawrence: ఆయన లేకపోతే ఈ వేదికపై ఉండేవాణ్ని కాదు: లారెన్స్
-
Mla Rajaiah: కాలం నిర్ణయిస్తే బరిలో ఉంటా: ఎమ్మెల్యే రాజయ్య
-
Khammam: ఇంటర్ విద్యార్థిని అనుమానాస్పద మృతి.. కళాశాల వద్ద ఉద్రిక్తత