Personal Loan: వ్యక్తిగత రుణమా?ఈ తప్పులు చేయకండి!
వ్యక్తిగత రుణాలు ఎటువంటి హామీ లేకుండా వస్తాయి కాబట్టి ఈ రుణాలతో బ్యాంకులకు నష్టభయం ఎక్కువగా ఉంటుంది.
అత్యవసరంగా డబ్బు కావాలి..ఎలా?అని ప్రశ్న వచ్చినప్పుడు చాలా మందికి గుర్తుకు వచ్చేది వ్యక్తిగత రుణం. బ్యాంకులు ముందస్తు ఆమోదంతో ఆఫర్ చేస్తుండడం, ఆన్లైన్ ద్వారా తక్కువ సమయంలోనే ఆమోదించడం, హామీ ఇవ్వాల్సిన అవసరం లేకపోవడం..ఇటువంటి అనుకూలతలు ఉండడం వల్ల చాలా మంది ఈ రుణాల వైపు మొగ్గుచూపుతున్నారు. అయితే, మనం చేసే ఒక చిన్న తప్పు..పెద్ద పెద్ద ఆర్థిక ఇబ్బందులకు దారి తీస్తుంది. వ్యక్తిగత రుణం కోసం దరఖాస్తు చేసేటప్పుడు అవగాహన లేకపోవడం, అజాగ్రత్తగా ఉండడం వంటివి..మిమ్మల్ని అప్పుల ఊబిలో పడేస్తుంది. మీతో పాటు కుటుంబ భవిష్యత్తు కూడా సమస్యల్లో పడుతుంది. అందువల్ల వ్యక్తిగత రుణం కోసం దరఖాస్తు చేసే వారు సాధారణంగా చేసే కొన్ని తప్పులను తెలుసుకోవడం ద్వారా ఈ తప్పులు జరగకుండా జాగ్రత్త పడవచ్చు.
1. చెల్లింపుల సామర్థ్యం తెలుసుకోకపోవడం..
వ్యక్తిగత రుణమే కాదు. మీరు ఏ రుణం తీసుకున్నా..ముందుగా మీ చెల్లింపుల సామర్థాన్ని తెలుసుకోవాలి. బ్యాంకు నుంచి డబ్బు అప్పుగా తీసుకున్నప్పుడు..ఆ మొత్తాన్ని నెలవారిగా వాయిదాల పద్ధతిలో చెల్లించే అవకాశాన్ని బ్యాంకులు వినియోగదారునికి అందిస్తాయి. పెద్ద మొత్తంలో అప్పు తీసుకున్నా..చిన్న చిన్న మొత్తాలతో తిరిగి చెల్లించవచ్చు. మీరు ప్రతీ నెల క్రమం తప్పకుండా ఈఎమ్ఐలు చెల్లించగలరా లేదా?ఎంత వరకు చెల్లించగలరు అని తెలుసుకోండి.
ఇందుకోసం ముందుగా మీకు ఎంత మొత్తం రుణం కావాలో ఒక అంచనాకు వచ్చి, ప్రస్తుతం మీకు పొదుపు ఖాతా ఉన్న బ్యాంకుతో పాటు, రెండు మూడు బ్యాంకులు వ్యక్తిగత రుణాల వడ్డీ రేట్లు తెలుసుకుని ఈఎమ్ఐని లెక్కించాలి. ప్రస్తుతం ఆన్లైన్లో కాలిక్యులేటర్లు అందుబాటులో ఉంటున్నాయి. వీటి సహాయంతో మీ రుణ ఈఎమ్ఐ లెక్కించి..ప్రతీ నెల ఎంత చెల్లించగలరు?సమయానికి చెల్లింపు చేయగలరా..లేదా?తెలుసుకోవాలి. చెల్లించగలను అనుకున్నప్పుడు రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
2. వేరు వేరు బ్యాంకులలో రుణం కోసం ప్రయత్నించడం..
డబ్బు అవసరమైతే రుణం కోసం బ్యాంకుకి దరఖాస్తు చేసుకుంటుంటాం. ఒకవేళ బ్యాంకు రుణ దరఖాస్తును తిరస్కరిస్తే..మరో బ్యాంకుకి..ఆ బ్యాంకు కూడా తిరస్కరిస్తే..ఇంకో బ్యాంక్ ఇలా అనేక బ్యాంకుల్లో రుణం కోసం ప్రయత్నిస్తుంటారు. ఇంకొందరు అయితే ఒకేసారి నాలుగు అయిదు బ్యాంకులకు రుణం కోసం దరఖాస్తు చేసుకుంటుంటారు. ఇలా చేయడం సరైన పనికాదు. దీని వల్ల మీ క్రెడిట్ స్కోరు గణనీయంగా తగ్గిపోతుంది. మీరు ఎన్ని సార్లు రుణం కోసం దరఖాస్తు చేశారు, అనే సమాచారం కూడా క్రెడిట్ బ్యూరోలు లెక్కించి, నివేదికలో ప్రతిబింబిస్తాయి. దీంతో భవిష్యత్తు రుణాలు భారం అవుతాయి.
మీ రుణ దరఖాస్తు ఒక్కసారి రిజక్ట్ అయ్యిందంటే..అందుకు గల కారణాలను ముందుగా విశ్లేషించాలి. తప్పులు, పొరపాట్లు ఏమైనా ఉంటే సరిచేసుకుని రుణం కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఒకవేళ క్రెడిట్ స్కోరు తగ్గడమే రుణ తిరస్కరణకు కారణమైతే పెంచుకునే ప్రయత్నం చేయాలి.
3. ఇతర రుణాలను తెలుపకపోవడం..
ఏదైనా బ్యాంకుకు రుణం కోసం దరఖాస్తు చేస్తే..ప్రస్తుతం ఉన్న రుణాలు, సంబంధిత ఈఎమ్ఐల గురించి బ్యాంకులు సమాచారం కోరుతుంటాయి. ఈ వివరాలను వెల్లడించాలి. దాచే ప్రయత్నం చేస్తే రుణ దరఖాస్తు తిరస్కరణకు గురికావచ్చు.
బ్యాంకులు మీ రుణదరఖాస్తు పరిశీలించేటప్పుడు మీ క్రెడిట్ నివేదికను చూస్తాయి. ఈ విషయాలు అన్ని అందులో తేటతెల్లమవుతాయి. కాబట్టి మీరు దాచే ప్రయత్నం చేసారన్న కారణంతో రుణ దరఖాస్తు తిరస్కరిస్తారు. ఇది మీ క్రెడిట్ స్కోరుపైనా ప్రభావం చూపుతుంది.
4. పేపర్ వర్క్ పూర్తి చేయకపోవడం..
రుణం కోసం దరఖాస్తు చేసేటప్పుడు కొంత మంది దరఖాస్తు ఫారంపై సంతకం చేసి ఇచ్చేస్తారు. మరేఇతర సమాచారం ఇవ్వడం గానీ, తెలుసుకోవడం గానీ చెయ్యరు. ఇది సరైన పనికాదు. ఇలా చేయడం వల్ల బ్యాంకులు విధించే ఇతర ఛార్జీలు తెలియవు. తర్వాత తెలిసినా లాభం ఉండదు. కాబట్టి, దరఖాస్తు ఫారం పూర్తిగా దరఖాస్తుదారుడే నింపాలి. బ్యాంకు అడిగిన ప్రతీ సమాచారం ఇవ్వాలి.
రుణం కోసం ఆఫ్‌లైన్/ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నా..సంబంధిత పూర్తి సమాచారం తెలుసుకోవాలి. బ్యాంకులు తమ అధికారిక వెబ్సైట్లో తాము అందించే రుణాల పూర్తి సమాచారాన్ని అందిస్తాయి. దీంతో వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజులు, ఈఎమ్ఐలు ఆలస్యం అయితే వర్తించే ఛార్జీలు, ఇతర సమాచారం మొత్తం అందుబాటులో ఉంటుంది. రుణం కోసం దరఖాస్తు చేసేవారు సంబంధిత పత్రాలను పూర్తిగా చదవాలి. ఒకవేళ ఏదైనా సందేహాలు ఉంటే బ్యాంకు అధికారులను నేరుగా సంప్రదించి తెలుసుకోవచ్చు.
5. వివిధ బ్యాంకుల వడ్డీ రేట్లు, ఇతర ఛార్జీలు తెలుసుకోకపోవడం..
రుణం కావాలనుకున్నప్పుడు, వ్యక్తులు తమకు పొదుపు ఖాతా ఉన్న బ్యాంకునే సంప్రదిస్తుంటారు. ఇది తప్పు కాదు. కానీ ఇతర బ్యాంకులు అందించే వడ్డీ రేట్లు, ప్రాసిసింగ్ ఫీజులు, ఇతర ఆప్షన్లు తెలుసుకోకపోవడం తప్పు. రుణం తీసుకోవాలనుకున్నప్పుడు ప్రస్తుత బ్యాంకుతో పాటు ఇతర బ్యాంకుల వడ్డీ రేట్లను పోల్చి చూడాలని నిపుణులు చెప్తుంటారు. వడ్డీ రేటు కొంచెం తగ్గినా బ్యాంకుకు మీరు చెల్లించే వడ్డీలో చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు పలు వెబ్సైట్లు ఈ సమాచారాన్ని అందిస్తున్నాయి.
ఉదాహరణకి..మీరు రూ. 5 లక్షల రుణం 3 ఏళ్ల కాలపరిమితితో తీసుకున్నారనుకుందాం. వడ్డీ రేటు 11 శాతం అయితే నెలవారిగా చెల్లించాల్సిన ఈఎమ్ఐ రూ. 16,369. రుణం పూర్తి అయ్యేసారికి బ్యాంకుకి చెల్లించే వడ్డీ రూ. 89,297.
అదే రూ. 5 లక్షల రుణం 3 ఏళ్ల కాలపరిమితితో తీసుకున్నారనుకుందాం. వడ్డీ రేటు 9 శాతం అయితే నెలవారిగా చెల్లించాల్సిన ఈఎమ్ఐ రూ. 15,900. రుణం పూర్తి అయ్యేసారికి బ్యాంకుకి చెల్లించే వడ్డీ రూ. 72,395
పై రెండు సందర్భాలను పరిశీలిస్తే వడ్డీ రేటులో 2 శాతం వ్యత్యాసం ఉండడం వల్ల చెల్లించే వడ్డీ రూ. 17 వేల వరకు తగ్గుతుంది. వ్యక్తిగత రుణాల వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వివిధ బ్యాంకులు అందించే వడ్డీ రేట్లు, ఇతర ఛార్జీలను పోల్చి చూడాలి.
6. తక్కువ ఈఎమ్ఐ, ఎక్కువ కాలపరిమితి..
ఈఎమ్ఐలు సులభంగా చెల్లించవచ్చని ఎక్కువ కాలపరిమితిని ఎంచుకుంటారు. ఇలా చేయడం వల్ల చెల్లించే వడ్డీ చాలా ఎక్కువ అవుతుంది. పై ఉదాహరణనే తీసుకుంటే..రూ. 5 లక్షల రుణం 9 శాతం వడ్డీతో 5 ఏళ్ల కాలపరిమితితో తీసుకంటే నెలవారిగా చెల్లించే ఈఎమ్ఐ రూ. 10,379కి తగ్గుతుంది. కానీ చివరికి చెల్లించే వడ్డీ రూ. 1,22,751 కి పెరిగిపోతుంది. కాలపరిమితి 2 సంవత్సరాలు ఎక్కువ పెట్టుకోవడం వల్ల రూ. 50,356 ఎక్కువ వడ్డీ చెల్లిస్తున్నాము.
7. క్రెడిట్ స్కోరు చెక్ చేయకుండా అప్లై చేయడం..
రుణం కోసం దరఖాస్తు చేసేటప్పుడు..రుణం, వడ్డీ రేటు గురించే కానీ క్రెడిట్ స్కోరు గురించి పట్టించుకోరు. కానీ వ్యక్తిగత రుణాలలో క్రెడిట్ స్కోరు ముఖ్య పాత్ర పోషిస్తుంది. వ్యక్తిగత రుణాలను బ్యాంకులు ఎటువంటి హామీ లేకుండానే ఇస్తుంటాయి. అందువల్ల క్రెడిట్ స్కోరు చాలా ముఖ్యం. మంచి క్రెడిట్ స్కోరు నిర్వహిస్తున్న వారికి బ్యాంకులు తొందరగా, తక్కువ వడ్డీ రేటుకే రుణాలను మంజూరు చేస్తుంటాయి. కాబట్టి, రుణం కోసం దరఖాస్తు చేసుకునే ముందే క్రెడిట్ స్కోరును తెలుసుకోవాలి. ఒకవేళ తక్కువగా ఉంటే ముందుగా పెంచుకునే ప్రయత్నం చేయాలి. ఆ తర్వాత రుణం కోసం దరఖాస్తు చేసుకోవడం మంచిది.
చివరిగా..
వ్యక్తిగత రుణాలు ఎటువంటి హామీ లేకుండా వస్తాయి కాబట్టి ఈ రుణాలతో బ్యాంకులకు నష్టభయం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, వడ్డీ రేటు ఎక్కువగా ఉంటుంది. అందువల్ల అత్యవసరం అయితే తప్ప ఇలాంటి రుణాలను తీసుకోకపోవడమే మంచిది. ఒకవేళ అత్యవసరంగా తీసుకోవాల్సి వచ్చినా అన్ని అంశాలను నిశితంగా పరిశీలించి రుణం తీసుకోవాలి. అలాగే వీలైనంత త్వరగా తిరిగి చెల్లించే ప్రయత్నం చేయాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బ్యాంకుల్లో లేటెస్ట్ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు ఇవే!
చాలా ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్లపై ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను అందజేస్తున్నాయి. -
డెబిట్ కార్డు ఛార్జీలను పెంచిన ఎస్బీఐ
డెబిట్ కార్డులపై నిర్వహణ ఛార్జీలను ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) సవరించింది. కొత్త ఛార్జీలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. -
అనధికారిక లావాదేవీలపై యూజర్ల ఆందోళన.. స్పందించిన యాక్సిస్ బ్యాంక్
యాక్సిస్ బ్యాంకు కస్టమర్లు కొందరు తమ క్రెడిట్ కార్డుల్లో అనధికారిక లావాదేవీలు జరుగుతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. దీనిపై బ్యాంక్ స్పందించింది. -
Flash Pay: కీ చైన్‌తో పేమెంట్స్.. ఫెడరల్ బ్యాంక్ నుంచి ఫ్లాష్ పే
Federal Bank flash pay: ఫెడరల్ బ్యాంక్ స్మార్ట్ కీ చైన్‌ను తీసుకొచ్చింది. కాంటాక్ట్ లెస్ పేమెంట్ల కోసం దీన్ని వినియోగించుకోవచ్చు. -
పిల్లల పేరిట ఎఫ్డీ
పెట్టుబడికి రక్షణ, రాబడికి హామీ ఉన్న పథకాల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు (ఎఫ్డీ) ముందుంటాయి. పిల్లల చదువులు, ఇతర అవసరాల కోసం పెట్టుబడి పెట్టాలనుకుంటున్న తల్లిదండ్రులు వీటికి ప్రాధాన్యం ఇస్తుంటారు -
సిబిల్ నివేదికలో తప్పులుంటే
రుణం తీసుకోవాలంటే.. బ్యాంకులు ముందుగా పరిశీలించేది క్రెడిట్ నివేదికనే. ఇందులో ఎలాంటి తప్పులూ దొర్లకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే మనకు అవసరం ఉన్నప్పుడు రుణం కోసం వెళ్తే దరఖాస్తును తిరస్కరించే అవకాశం ఉంది. -
Personal Loans: వ్యక్తిగత రుణాల వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయ్?
ప్రస్తుతం అన్ని బ్యాంకులు వ్యక్తిగత రుణాలను అందిస్తున్నాయి. వివిధ బ్యాంకులు వసూలు చేసే వడ్డీ రేట్లు ఎంతెంతో ఇక్కడ చూద్దాం... -
Home loan: జీరో ప్రాసెసింగ్ ఫీజు.. 8.3% వడ్డీకే హోమ్‌లోన్
Bank of India home loan offer: బ్యాంక్ ఆఫ్ ఇండియా గృహ రుణాలపై వడ్డీ తగ్గించింది. ప్రాసెసింగ్ ఫీజు సైతం రద్దు చేసింది. మార్చి 31 వరకు ఈ ఆఫర్ ప్రకటించింది. -
ప్రత్యేక ఎఫ్డీలను ప్రారంభించిన నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో ప్రత్యేక ఫిక్స్డ్ డిపాజిట్లపై గరిష్ఠంగా 9.25% వడ్డీ వరకు పొందొచ్చు. -
Credit Card: క్రెడిట్ కార్డును పరిమితికి మించి వాడుకోవచ్చా?
Credit Card: క్రెడిట్ వాడకంపై తరచూ ఎదురయ్యే కొన్ని కీలక సందేహాలకు ఇటీవల ఆర్బీఐ సమాధానాలు ఇచ్చింది. అవేంటో చూద్దాం..! -
వ్యక్తిగత రుణాలు మోసాల బారిన పడొద్దు
ఎలాంటి హామీ లేకుండా లభించే వ్యక్తిగత రుణాలు అవసరమైనప్పుడు ఎంతో ఉపయోగపడతాయి. మన అవసరాలను ఆసరాగా తీసుకొని, సైబర్ మోసగాళ్లు మన కష్టార్జితాన్ని కాజేసేందుకు సిద్ధంగా ఉంటారు. -
Gold Loans: బంగారు రుణాలపై వడ్డీ రేట్లు ఏ బ్యాంకులో ఎంతెంత?
సురక్షితమైన రుణం కాబట్టి బ్యాంకులు బంగారంపై సరసమైన వడ్డీ రేట్లకు వేగంగా రుణాలందిస్తున్నాయి. వివిధ బ్యాంకులు వసూలుచేసే వడ్డీ రేట్లు ఇక్కడ చూద్దాం.. -
FD Rates: సీనియర్ సిటిజన్ల ఎఫ్డీలపై వడ్డీ రేట్లు ఇవే..
చాలా ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు సీనియర్ సిటిజన్లకు అత్యధిక వడ్డీ రేటును అందిస్తున్నాయి. 1, 3, 5 ఏళ్ల ఎఫ్డీలపై వడ్డీ రేట్లను ఇక్కడ చూడండి. -
పొదుపు ఖాతాలో ఎంత డబ్బు ఉండాలి?
వ్యక్తిగత ఆర్థిక విషయాల్లో పొదుపు ఖాతాకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. మనం చేసే ఆదాయ-వ్యయాలన్నింటికీ ఆధారం ఇదే. బ్యాంకు, మీరు ఎంచుకున్న ఖాతా రకాన్ని బట్టి, ఇందులో కనీస నిల్వ ఎంత ఉండాలన్నది ఆధారపడి ఉంటుంది. వేతనం ఖాతాలో సున్నా నిల్వ ఉన్నా ఇబ్బందేమీ ఉండదు. -
Car Loans: కారు రుణాలపై ఏ బ్యాంకులో వడ్డీ రేట్లు ఎంతెంత?
దాదాపుగా అన్ని బ్యాంకులు వాహన రుణాలందిస్తున్నాయి. ఈ రుణాలకై వివిధ బ్యాంకులు వసూలు చేసే వడ్డీ రేట్లు ఇక్కడ చూద్దాం. -
Credit Cards: హెచ్డీఎఫ్సీ నుంచి ఐదు కొత్త బిజినెస్ క్రెడిట్ కార్డులు
Credit Cards: హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఇటీవల నాలుగు కొత్త బిజినెస్ క్రెడిట్ కార్డులను విడుదల చేసింది. వాటి ఫీచర్లు, జాయినింగ్ ఫీజు, అర్హతల వంటి వివరాలను చూద్దాం.. -
Two wheeler insurance: బైక్ ఇన్సూరెన్స్.. ఇవన్నీ తెలుసుకున్నాకే..!
Two wheeler insurance: మీ టూవీలర్‌కు బీమా చేయించాలని చూస్తున్నారా? మంచి పాలసీ తెలుసుకోలేకపోతున్నారా? ఈ కింది విషయాలపై ఓ లుక్కేయండి. -
గృహరుణం ఇప్పుడేం చేయాలి?
ఏడాది కాలంగా రెపో రేటు 6.50 శాతం వద్ద కొనసాగుతోంది. దీన్ని పెంచకపోవడం మంచి పరిణామమే. అదే సమయంలో ద్రవ్యోల్బణం స్థిరంగా ఉన్నప్పటికీ, వడ్డీ రేట్లను తగ్గించేంతగా సహకరించడం లేదు. -
కార్పొరేట్ బాండ్లు ఎంచుకోండి జాగ్రత్తగా
మన దేశంలో అత్యంత సురక్షితమైన, ప్రజాదరణ పొందిన పొదుపు పథకాల్లో బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లు (ఎఫ్డీ) ముందుంటాయి. నిర్ణీత కాలానికి, స్థిరమైన వడ్డీని అందించే వీటిని చాలామంది ఇష్టపడతారు. -
Saving Account: పొదుపు ఖాతా గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
బ్యాంకులో పొదుపు ఖాతా అనేది ఖాతాదారుడికి ఒక విభిన్నమైన ఆర్థిక సాధనం. ఇది ఖాతాదారుడికి అనేక విధాలుగా ప్రయోజనం చేకూరుస్తుంది. -
Fixed Deposits: ఎఫ్డీలపై వడ్డీ రేట్లను సవరించిన ఐసీఐసీఐ
ఐసీఐసీఐ బ్యాంకు ఎంపిక చేసిన కొన్ని కాలవ్యవధుల ఎఫ్డీలపై వడ్డీ రేట్లు పెంచింది. ఈ బ్యాంకులో సీనియర్ సిటిజన్లు గరిష్ఠంగా 7.75% వడ్డీని పొందుతారు.
తాజా వార్తలు (Latest News)
-
కేజ్రీవాల్‌కు సమయం లేదు.. అందుకే ఈ ప్రయత్నాలు! : పూరి
-
టెలికాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా..? అయితే జాగ్రత్త..!
-
రైలు ప్రయాణికుడి సెల్ఫీతో డెత్ మిస్టరీని ఛేదించిన పోలీసులు
-
బ్యాంకులు, ఎల్ఐసీ కార్యాలయాలు.. ఈ శని, ఆదివారాల్లో తెరిచే ఉంటాయ్!
-
కోహ్లీ Vs గంభీర్.. రస్సెల్ Vs సిరాజ్.. రింకు Vs యశ్.. ఆధిపత్యం ఎవరిదో?
-
ఎన్నికల బరిలో రఘురామ కృష్ణరాజు?.. ఎన్డీయే కూటమి నేతల మధ్య చర్చ