భారత్‌లో ఏసీ తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్న మిత్సుబిషి

జపాన్‌కు చెందిన మిత్సుబిషి ఎలక్ట్రిక్‌ ఇండియాలో తన మొట్టమొదటి ఎయిర్‌ ఎండిషనర్లు, కంప్రెసర్ల తయారీ కేంద్రాన్ని చెన్నైలో ఏర్పాటు చేయనుంది.

Published : 17 Apr 2023 18:12 IST

దిల్లీ: మిత్సుబిషి ఎలక్ట్రిక్‌ ఇండియా.. భారత్‌లో ఎయిర్‌ కండిషనర్లు, కంప్రెషర్ల తయారీ కేంద్రాన్ని నిర్మించడానికి 222 మిలియన్‌ యూఎస్‌ డాలర్ల పెట్టుబడి పెట్టనుంది. ఈ ఫ్యాక్టరీ చెన్నైలోని ‘మహీంద్రా వరల్డ్‌ సిటీ డెవలపర్స్‌ ఇండస్ట్రియల్‌ పార్కు’లో ఏర్పాటు కానుంది. ఇది ఏడాదికి 3 లక్షల యూనిట్ల రూమ్‌ ఎయిర్‌ ఎండిషనర్లు, 6.50 లక్షల యూనిట్ల కంప్రెషర్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ ఫ్యాక్టరీ దేశీయ మార్కెట్లో పెరుగుతున్న ఎయిర్‌ కండీషనర్‌ డిమాండ్‌ను తీర్చగలదని, అక్టోబర్‌ 2025 నాటికి కార్యకలాపాలు ప్రారంభించవచ్చని మహీంద్రా లైఫ్‌ స్పేస్‌ డెవలపర్స్‌ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. ఎలక్ట్రిక్‌, ఎలక్ట్రానిక్‌ పరికరాల తయారీలో ప్రపంచ అగ్రగామిగా గుర్తింపు పొందిన మిత్సుబిషి ఎలక్ట్రిక్‌, చెన్నైలోని మహీంద్రా ఆరిజిన్స్‌లో 52 ఎకరాలలో ఈ తయారీ కేంద్రం ఏర్పాటు కానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని