XUV 300: ఎక్స్‌యూవీ 300 విద్యుత్తు మోడల్‌పై మహీంద్రా కీలక ప్రకటన

ప్రముఖ దేశీయ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్‌ మహీంద్రా ఎక్స్‌యూవీ 300 ఎస్‌యూవీ విద్యుత్తు వాహనానికి సంబంధించి కీలక ప్రకటన చేసింది....

Updated : 23 Nov 2022 11:48 IST

ముంబయి: ప్రముఖ దేశీయ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్‌ మహీంద్రా ఎక్స్‌యూవీ 300 ఎస్‌యూవీ విద్యుత్తు వాహనానికి సంబంధించి కీలక ప్రకటన చేసింది. ఈ మోడల్‌ పూర్తిస్థాయి విద్యుత్తు వాహనాన్ని వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో విడుదల చేస్తామని సోమవారం వెల్లడించింది. అలాగే ఈ ఆగస్టులో తమ ‘విద్యుత్తు వాహన ప్రణాళిక’ను ఆవిష్కరించనున్నట్లు తెలిపింది.

మహీంద్రా ఇటీవలే ఫోక్స్‌వ్యాగన్‌ గ్రూపుతో చేతులు కలిపింది. విద్యుత్తు వాహన తయారీలో మహీంద్రాకు ఫోక్స్‌వ్యాగన్‌ సహకారం అందించనుంది. తాము ఇటీవల విడుదల చేసిన ఎక్స్‌యూవీ 700 కోసం 18-24 నెలలు వేచిచూడాల్సి వస్తోందని కంపెనీ తెలిపింది. అయినప్పటికీ బుకింగ్‌లలో 10-12 శాతం కంటే ఎక్కువ మంది రద్దు చేసుకోలేదని పేర్కొంది. ప్రతినెలా 5000 యూనిట్లను తయారు చేస్తున్నామని తెలిపింది. కానీ, బుకింగ్‌లు మాత్రం 9,000-10,000 వరకు ఉంటున్నాయని పేర్కొంది. సెమీకండక్టర్ల లభ్యత పెరిగిన కొద్దీ తయారీ యూనిట్లు కూడా పెరుగుతాయని వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని