న్యూఇయర్‌ వేళ.. 140కోట్ల వాట్సాప్‌ కాల్స్‌

కొత్త సంవత్సరం అంటే వేడుకలతో పాటు విషెస్‌ కూడా. డిసెంబరు 31 అర్ధరాత్రి 12 గంట కొట్టగానే ‘హ్యాపీ న్యూ ఇయర్‌’ పదాలతో యావత్‌ ప్రపంచం మార్మోగుతుంది. మామూలుగా అయితే బంధుమిత్రులను నేరుగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకునేవాళ్లం. కానీ, ఈసారి కరోనా భయం, ప్రభుత్వ ఆంక్షల నేపథ్యంలో...

Published : 02 Jan 2021 18:29 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కొత్త సంవత్సరం అంటే వేడుకలతో పాటు విషెస్‌ కూడా. డిసెంబరు 31 అర్ధరాత్రి 12 గంట కొట్టగానే ‘హ్యాపీ న్యూ ఇయర్‌’ పదాలతో యావత్‌ ప్రపంచం మార్మోగుతుంది. మామూలుగా అయితే బంధుమిత్రులను నేరుగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకునేవాళ్లం. కానీ, ఈసారి కరోనా భయం, ప్రభుత్వ ఆంక్షల నేపథ్యంలో చాలా మంది ఇళ్లకే పరిమితమవ్వాల్సి వచ్చింది. దీంతో శుభాకాంక్షలు చెప్పుకునేందుకు ఇంటర్నెట్‌ను ఆశ్రయించక తప్పలేదు. అలా ఈ ఏడాది న్యూఇయర్‌ వేళ ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌లో 100 కోట్ల మందికి పైగా కాల్స్‌ చేసుకున్నారట. ఈ మేరకు సోషల్‌మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ వెల్లడించింది. 

కొత్త సంవత్సరం ప్రారంభం రోజున వాట్సాప్‌లో 140 కోట్ల వాయిస్‌, వీడియో కాల్స్‌ జరిగినట్లు ఫేస్‌బుక్‌ తెలిపింది. ఒక రోజులో ఇంత ఎక్కువ కాల్స్‌ రికార్డ్‌ అవడం ఇప్పుడేనట. 2020 కొత్త సంవత్సరంతో పోలిస్తే ఈసారి 50శాతం ఎక్కువగా ఆన్‌లైన్‌ కాలింగ్‌ నమోదైనట్లు వెల్లడించింది. ఇక ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లలోనూ నిన్న 55 మిలియన్లకు పైగా లైవ్‌ బ్రాడ్‌కాస్ట్‌లు జరిగినట్లు పేర్కొంది. 

కొవిడ్‌ కారణంగా 2020లో అనేక రంగాలు సంక్షోభానికి గురైనప్పటికీ.. సాంకేతిక రంగం మాత్రం వృద్ధి చెందిందనే చెప్పాలి. లాక్‌డౌన్‌ నిబంధనలతో నెలల తరబడి ఇళ్లకే పరిమితమవడంతో ప్రజలు తప్పనిసరిగా టెక్నాలజీకి మారాల్సి వచ్చింది. ముఖ్యంగా అటు విద్యార్థులకు ఆన్‌లైన్‌ క్లాసులు.. ఇటు ఉద్యోగులకు వీడియో కాన్ఫరెన్స్‌లు తప్పనిసరయ్యాయి. ఇక నూతన సంవత్సరం వేడుకలపైనా ప్రభుత్వాలు ఆంక్షలు తీసుకురావడంతో నెటింట్ట మెసేజ్‌లు, కాల్స్‌ మోత మోగింది. 

ఇవీ చదవండి..

‘కొత్త’ ఆనందం.. పక్షులకు శాపం

ఇంటికే హోటల్ భోజనం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని