Electric vehicles: దేశంలో 18 లక్షల ఈవీలు.. విక్రయాల్లో ఆ రాష్ట్రమే టాప్‌

EVs in India: దేశంలో మొత్తం 18 లక్షల విద్యుత్‌ వాహనాలు (Electric vehicles) రిజిస్టర్‌ అయ్యాయని కేంద్రం పార్లమెంట్‌కు తెలిపింది. ఉత్తర్‌ ప్రదేశ్‌ ఈ విషయంలో ముందు వరుసలో నిలిచినట్లు పేర్కొంది.

Published : 07 Dec 2022 22:27 IST

దిల్లీ: దేశంలో మొత్తం 18 లక్షల విద్యుత్‌ వాహనాలు (Electric vehicles) రిజిస్టర్‌ అయ్యాయని కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ (Nitin Gadkari) పార్లమెంట్‌కు తెలియజేశారు. విద్యుత్‌ వాహనాల విక్రయాల్లో ఉత్తర్‌ప్రదేశ్‌, దిల్లీ, మహారాష్ట్ర ముందు వరుసలో నిలిచాయని చెప్పారు. ఈ మేరకు రాజ్యసభలో ఓ ప్రశ్నకు బుధవారం ఆయన లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

ఉత్తర్‌ప్రదేశ్‌లో అత్యధికంగా 4,14,978, దిల్లీలో 1,83,74, మహారాష్ట్రలో 1,79,087 వాహనాలు రిజిస్టర్‌ అయ్యాయని నితిన్‌ గడ్కరీ తెలిపారు. మహారాష్ట్రలో అత్యధికంగా 660 పబ్లిక్‌ ఈవీ ఛార్జింగ్‌ స్టేషన్లు ఉండగా.. దిల్లీ (539), తమిళనాడు (439) ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 5,151 స్టేషన్లు ఉన్నాయని తెలిపారు. ఎలక్ట్రానిక్‌ ఫీజు కలెక్షన్‌ సిస్టమ్‌ వినియోగం వల్ల జాతీయ రహదారులపై టోల్‌ ఫీజు వసూలు సమయం గణనీయంగా తగ్గనుందని తెలిపారు. ఎన్‌హెచ్‌ఏఐ నియమించిన ఏజెన్సీ ప్రస్తుతం ఆటోమేటిక్‌ నంబర్‌ రికగ్నిషన్‌ టెక్నాలజీపై పనిచేస్తోందని చెప్పారు.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు