Moto G85 5G: మోటో నుంచి మిడ్‌ రేంజ్ 5జీ ఫోన్‌.. జీ85 వివరాలు ఇవీ..

Moto G85 5G: మోటోరొలా కంపెనీ జీ 85 స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. దీని ధర రూ.17,999 నుంచి ప్రారంభం అవుతుంది.

Published : 10 Jul 2024 13:56 IST

Moto G85 5G | ఇంటర్నెట్ డెస్క్‌: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ మోటోరొలా (Motorola) దూకుడు మీద ఉంది. వరుస పెట్టి ఫోన్లను విడుదల చేస్తోంది. ఎడ్జ్‌ సిరీస్‌లో ఇటీవల కాలంలో ఫోన్లను తీసుకొచ్చిన ఆ కంపెనీ.. దేశీయ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లో జీ సిరీస్‌లో జీ85 పేరిట మరో 5జీ ఫోన్‌ను (Moto G85 5G) లాంచ్‌ చేసింది. 50 ఎంపీ కెమెరా, 33W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ వంటి ప్రధాన సదుపాయాలతో     ఈ ఫోన్‌ వస్తోంది.

మోటో జీ85 రెండు వేరియంట్లలో లభిస్తుంది. 8జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.17,999గా నిర్ణయించింది. 12జీబీ+256జీబీ వేరియంట్‌ ధర రూ.19,999గా పేర్కొంది. ఆలివ్‌ గ్రీన్‌, కోబాల్ట్‌ బ్లూ, అర్బన్‌ గ్రే రంగుల్లో లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్‌, మోటోరొలా వెబ్‌సైట్లతో పాటు ఇతర రిటైల్‌ స్టోర్లలో కూడా ఈ ఫోన్‌ లభిస్తుంది. జులై 16 మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ ఫోన్‌ విక్రయాలు ప్రారంభం కానున్నాయి. ఇన్‌స్టంట్‌ బ్యాంక్‌ డిస్కౌంట్ లేదా ఎక్స్ఛేంజీ బోనస్‌ కింద రూ.1000 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. దీంతో ప్రారంభ ధర రూ.16,999కు తగ్గనుంది. 

రైళ్లలో 3A, 2A గురించి తెలుసు.. మరి ఈ 3E, EA మాటేంటి?

ఇక స్పెసిఫికేషన్స్‌ విషయానికొస్తే.. ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత హెలోయూఐతో ఈ ఫోన్‌ వస్తోంది. 6.67 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+ 3డీ కర్వ్‌డ్‌ పీఓఎల్‌ఈడీ స్క్రీన్‌ ఇచ్చారు. 120Hz రిఫ్రెష్‌ రేటుతో పాటు 1600 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌తో ఈ ఫోన్‌ వస్తోంది. కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ 5 ప్రొటెక్షన్‌ ఉంది. క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 6ఎస్‌ జనరేషన్‌ 3 ప్రాసెసర్‌ ఇచ్చారు. వెనకవైపు 50 ఎంపీ కెమెరా ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌తో వస్తోంది. 8 ఎంపీ అల్ట్రా వైడ్‌ యాంగిల్‌ కెమెరా ఉంది. ముందువైపు 32 ఎంపీ కెమెరా ఇచ్చారు. ఐపీ 52 రేటింగ్‌ ఉంది. 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 33W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సదుపాయం ఉంది. రెండేళ్ల పాటు ఓఎస్‌ అప్‌డేట్లు, నాలుగేళ్ల పాటు సెక్యూరిటీ అప్‌డేట్లు ఇస్తామని కంపెనీ హామీ ఇస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని