Motorola Edge 40: e-SIM సపోర్ట్‌తో మోటోరోలా ఎడ్జ్‌ 40.. ధర, ఫీచర్లివే..!

Motorola Edge 40: మోటోరోలా ఎడ్జ్‌ 30 స్మార్ట్‌ఫోన్‌కు కొనసాగింపుగా ఎడ్జ్‌ 40 (Motorola Edge 40)ని తీసుకొచ్చారు. 8జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ మాత్రమే ప్రస్తుతానికి భారత్‌లో అందుబాటులో ఉంది.

Updated : 23 May 2023 16:19 IST

Motorola Edge 40 | ఇంటర్నెట్‌ డెస్క్‌: మోటోరోలా ఎడ్జ్‌ 40 స్మార్ట్‌ఫోన్‌ భారత్‌లో మంగళవారం విడుదలైంది. గత నెలలోనే ఈ ఫోన్‌ (Motorola Edge 40)ను ఐరోపా, పశ్చిమాసియా, లాటిన్ అమెరికా, ఏసియా- పసిఫిక్‌లోని కొన్ని మార్కెట్లలో ఆవిష్కరించారు. ప్రస్తుతం ఇండియాలో బేస్‌ వేరియంట్‌ను మాత్రమే ప్రవేశపెట్టారు.

మోటోరోలా ఎడ్జ్‌40 ధర.. (Motorola Edge 40 price)

మోటోరోలా ఎడ్జ్‌ 30 స్మార్ట్‌ఫోన్‌కు కొనసాగింపుగా ఎడ్జ్‌ 40 (Motorola Edge 40)ని తీసుకొచ్చారు. 8జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ మాత్రమే ప్రస్తుతానికి భారత్‌లో అందుబాటులో ఉంది. దీని ధర రూ.29,999. మే 23 నుంచి ప్రీ-ఆర్డర్లు మొదలయ్యాయి. మే 30 నుంచి విక్రయాలు ప్రారంభమవుతాయి. ఎంపిక చేసిన కస్టమర్లకు ఈఎంఐ సదుపాయం కూడా ఇస్తున్నారు. ఎక్స్‌ఛేంజ్‌ ఆఫర్‌ కింద కొంత రాయితీ కూడా లభించనుంది. ఎక్లిప్స్‌ బ్లాక్‌, ల్యూనార్‌ బ్లూ, నెబ్యులా గ్రీన్‌ రంగుల్లో ఈ ఫోన్‌ అందుబాటులో ఉంది.
Also Read: ఈ-సిమ్‌ అంటే ఏమిటి? దాన్ని ఎలా పొందాలి?

మోటోరోలా ఎడ్జ్‌40 స్పెసిఫికేషన్లు..(Motorola Edge 40 specifications)

మోటోరోలా ఎడ్జ్‌ 40 (Motorola Edge 40).. 144Hz రీఫ్రెష్‌ రేట్‌, 1200 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌తో కూడిన 6.5 అంగుళాల హెచ్‌డీ+ (2400 x 1080 pixels) తెరతో వస్తోంది. ఆక్టాకోర్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 8020 5జీ ప్రాసెసర్‌ ఉంది. డ్యుయల్‌ సిమ్‌ ఆప్షన్‌తో వస్తున్న ఈ ఫోన్‌ e-SIMను కూడా సపోర్ట్‌ చేస్తుంది. ఆండ్రాయిడ్‌ 13 ఓఎస్‌ను ఇస్తున్నారు. రెండేళ్ల పాటు ఓఎస్‌ అప్‌డేట్లు, మూడు సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్లను ఇవ్వనున్నట్లు కంపెనీ తెలిపింది. వెనుక భాగంలో 50 ఎంపీ, ముందు 32 ఎంపీ కెమెరాను ఇస్తున్నారు. 68వాట్‌ టర్బోపవర్‌ వైర్డ్‌ ఛార్జింగ్‌, 15వాట్‌ వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో 4,400mAh బ్యాటరీ వస్తోంది. వైఫై 6, బ్లూటూత్‌ వీ5.2, జీపీఎస్‌ కనెక్టివిటీని ఇస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని