మార్కెట్లోకి మోటో ఎడ్జ్‌ 50 అల్ట్రా.. ప్రీమియం ఫోన్‌ విశేషాలివీ..

Motorola Edge 50 Ultra: మోటోరొలా ఎడ్జ్‌ 50 అల్ట్రా పేరిట కొత్త ప్రీమియం ఫోన్‌ను మార్కెట్లో లాంచ్‌ చేసింది.

Updated : 18 Jun 2024 13:43 IST

Motorola Edge 50 Ultra | ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ మొబైల్‌ తయారీ కంపెనీ మోటోరొలా (Motorola) ప్రీమియం ఫోన్‌ను భారత మార్కెట్లోకి లాంచ్ చేసింది. ఎడ్జ్‌ 50 సిరీస్‌లో ఎడ్జ్‌ 50 అల్ట్రా 5జీ (Motorola Edge 50 Ultra) ఫోన్‌ను తీసుకొచ్చింది. 1.5K రిజల్యూషన్‌, 125W ఫాస్ట్‌ ఛార్జింగ్‌, 64 ఎంపీ కెమెరా వంటి ప్రధాన ఫీచర్లతో ఈ ఫోన్‌ను మోటో కంపెనీ తీసుకొచ్చింది. ప్రీమియం సెగ్మెంట్‌లో తీసుకొచ్చిన ఈ ఫోన్‌ విశేషాలు ఇప్పుడు చూద్దాం.

మోటో ఎడ్జ్‌ 50 అల్ట్రా సింగిల్‌ వేరియంట్లో లభిస్తుంది. 12జీబీ+ 512జీబీ మోడల్‌ ధరను కంపెనీ రూ.59,999గా నిర్ణయించింది. ఎర్లీ బర్డ్‌ ఆఫర్‌, బ్యాంక్‌ ఆఫర్‌ అనంతరం రూ.49,999కే అందించనున్నట్లు తెలిపింది. ఇది పరిమిత కాలపు ఆఫర్‌గా కంపెనీ పేర్కొంది. జూన్‌ 24 నుంచి ఫ్లిప్‌కార్ట్, మోటోరొలా వెబ్‌సైట్లతో పాటు ప్రముఖ రిటైల్‌ స్టోర్లలో కొనుగోలు చేయొచ్చని కంపెనీ పేర్కొంది. మూడు రంగుల్లో లభిస్తుంది.

ఇక ఫీచర్ల విషయానికొస్తే.. 6.7 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+ ఓఎల్‌ఈడీ 1.5కె డిస్‌ప్లేతో ఈ ఫోన్‌ వస్తోంది. 144Hz రిఫ్రెష్‌ రేటు ఉంది. 2500 పీక్‌ బ్రైట్‌నెస్‌తో వస్తోంది. గొరిల్లా గ్లాస్‌ విక్టస్‌ ప్రొటెక్షన్‌ ఇచ్చారు. స్నాప్‌డ్రాగన్‌ 8ఎస్‌ జనరేషన్‌ 3తో పనిచేయనున్న ఈ ఫోన్‌.. అవుటాఫ్‌ ది బాక్స్‌ ఆండ్రాయిడ్‌ 14తో పని చేస్తుంది. వెనకవైపు 50 ఎంపీ ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌ సెన్సర్‌, 64 ఎంపీ టెలిఫొటో లెన్స్‌, 50 ఎంపీ ప్రధాన కెమెరా ఇచ్చారు. ముందువైపు సెల్ఫీల కోసం 50 ఎంపీ కెమెరా ఇస్తున్నారు. ఐపీ 68 రేటింగ్‌ ఇచ్చారు. 4500 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 125W ఫాస్ట్‌ ఛార్జింగ్‌, NFC, ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్ సెన్సర్ వంటివి ఇందులో ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని