Mukesh Ambani: మనవడితో కలిసి ముకేశ్‌ అంబానీ స్వాతంత్ర్య వేడుకలు

దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నేడు యావత్ భారతావని ఆజాది కా అమృత్‌ మహోత్సవ్‌ను అట్టహాసంగా జరుపుకుంటోంది. ప్రముఖుల నుంచి సామాన్యుల వరకు సగర్వంగా మువ్వన్నెల

Updated : 16 Aug 2022 12:53 IST

ముంబయి: దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నేడు యావత్ భారతావని ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ను అట్టహాసంగా జరుపుకొంటోంది. ప్రముఖుల నుంచి సామాన్యుల వరకూ సగర్వంగా మువ్వన్నెల జెండాను ఎగురవేసి.. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటున్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్‌ అధినేత ముకేశ్ అంబానీ తన కుటుంబంతో కలిసి ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

ముంబయిలోని తన నివాసం ఆంటిలియాలో సతీమణి నీతా అంబానీ, మనవడు పృథ్వీ ఆకాశ్‌ అంబానీతో కలిసి స్వతంత్ర వేడుకలను జరుపుకొన్నారు. ముకేశ్ మనవడిని ఎత్తుకోగా.. నీతా అంబానీ చేతిలో త్రివర్ణ పతాకాన్ని పట్టుకుని ‘మా తుఝే సలాం’ అంటూ స్వతంత్ర భారతావనికి వందనం చేశారు. ఇక, కేంద్రం పిలుపునిచ్చిన హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమంలో భాగంగా అంబానీ నివాసం ఆంటిలియా తిరంగా వెలుగుల్లో కళకళలాడింది.


Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts