Mukesh Ambani: అంబానీకి ఆ స్ట్రీట్‌ఫుడ్‌ బాగా ఇష్టమట..!

ప్రపంచసంపన్నుల్లో ఒకరైన ముకేశ్‌ అంబానీ ఇష్టాల గురించి ఆయన సతీమణి నీతా అంబానీ వెల్లడించారు. ఆయనకు ఇష్టమైన స్ట్రీట్‌ ఫుడ్‌ గురించి చెప్పారు. 

Published : 30 Mar 2023 18:48 IST

ముంబయి: ముకేశ్‌ అంబానీ(Mukesh Ambani).. ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. ప్రపంచకుబేరుల్లో ఒకరు. చిటికెస్తే క్షణాల్లో అన్నీ ఆయన ముందుంటాయి. ప్రపంచంలోని ఎక్కడి స్పెషల్ వంటకాన్నైనా రుచిచూడగలరు. కానీ ఒక భారతీయుడిగా, గుజరాతీ వాసిగా దేశ వంటకాలపై మమకారం చూపుతుంటారు. అలాగే ముకేశ్‌కు ఇష్టమైన స్ట్రీట్ ఫుడ్‌ గురించి ఆయన సతీమణి నీతా అంబానీ(Nita Ambani) ఓ సందర్భంలో వెల్లడించారు. భేల్‌, దహీ బటాటా పూరీ అంటే చాలా ఇష్టమట. ఈ రెండు వంటకాలు చాలా  ఇష్టంగా తింటారని నీతా చెప్పారు. 

ముకేశ్‌ తన కుటుంబంలో జరిగే ప్రతి వేడుకలో పాల్గొంటూ సరదాగా గడుపుతుంటారు. పిల్లలకోసం సమయం వెచ్చించే ఆయన.. ఇప్పటికీ ప్రత్యేకంగా తన సతీమణితోనే బయటకు వెళ్తుంటారు. అప్పుడు వీరిద్దరు స్ట్రీట్ ఫుడ్‌ను ఎంజాయ్‌ చేస్తారట. ‘మా ప్రేమ ఇప్పటికీ ఏ మాత్రం తరగలేదు. ఒకరిపైఒకరికి ఎంతో అభిమానం ఉంటుంది. మేం అప్పటికప్పుడే నిర్ణయాలు తీసుకుంటాం. టైంతో సంబంధం లేకుండా అర్ధరాత్రి పూట బయటకు వెళ్లి కాఫీ తాగుదామంటారాయన. అప్పుడు సీ వ్యూను ఎంచుకుంటాం. అదే రాత్రి వేళ కాకపోతే.. భేల్‌, దహీ బటాటా పూరీని రుచిచూస్తాం’ అని నీతా తెలిపారు.  

ఇదిలా ఉంటే.. ‘రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌’అధినేత ముకేశ్‌ అంబానీ (Mukesh Ambani) తన తండ్రి నుంచి వారసత్వాన్ని అందుకొని  20 ఏళ్లు పూర్తయింది. అప్పటి నుంచి కంపెనీ ఆదాయం ఎన్నో రెట్లు పెరిగింది. రిలయన్స్‌ ఫౌండేషన్‌ పేరిట 2010లో ముకేశ్‌ దాతృత్వ కార్యక్రమాలను ప్రారంభించారు. నీతా అంబానీ(Nita Ambani) దీని కార్యకలాపాలను చూసుకుంటున్నారు. గ్రామీణ సాధికారిత, పౌష్టికాహార భద్రత, విద్య, క్రీడలు, పర్యావరణ పరిరక్షణ రంగాల్లో ఈ ఫౌండేషన్‌ కృషి చేస్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని