Mukesh Ambani: రిలయన్స్‌ జియో బోర్డుకు ముకేశ్ అంబానీ రాజీనామా

ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ తమ కంపెనీ టెలికాం విభాగమైన జియో బాధ్యతలను తప్పుకున్నారు. రిలయన్స్‌ జియో బోర్డుకు రాజీనామా

Updated : 28 Jun 2022 17:11 IST

తనయుడు ఆకాశ్‌కు.. జియో ఛైర్మన్‌ బాధ్యతలు

ముంబయి: ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ తమ కంపెనీ టెలికాం విభాగమైన జియో బాధ్యతల నుంచి తప్పుకున్నారు. రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌ బోర్డుకు రాజీనామా చేశారు. ఈ కంపెనీ పగ్గాలను తనయుడు ఆకాశ్‌ అంబానీకి అప్పగించారు. ఈ మేరకు స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ ఫైలింగ్‌ సందర్భంగా రిలయన్స్‌ జియో వెల్లడించింది.

జూన్‌ 27న ముకేశ్ అంబానీ రిలయన్స్‌ జియో డైరెక్టర్‌ పదవికి రాజీనామా చేసినట్లు కంపెనీ తెలిపింది. దీంతో సోమవారం జరిగిన బోర్డు సమావేశంలో నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా ఉన్న ఆకాశ్ అంబానీని కంపెనీ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌ ఛైర్మన్‌ను నియమించినట్లు పేర్కొంది. ఇక మేనేజింగ్‌ డైరెక్టర్‌గా పంకజ్‌ మోహన్‌ పవార్‌, స్వతంత్ర డైరెక్టర్లుగా రమీందర్‌ సింగ్‌ గుజ్రాల్‌, కేవీ ఛౌదరీలను నియమించినట్లు తెలిపింది.

అయితే జియో ప్లాట్‌ఫామ్‌ లిమిటెడ్‌కు ముకేశ్‌ ఛైర్మన్‌గా కొనసాగనున్నారు. ముకేశ్‌ అంబానీ తన వ్యాపార బాధ్యతలను వారసులకు అప్పగించే ప్రణాళికలో భాగంగానే ఈ మార్పు జరిగినట్లు తెలుస్తోంది. ఆకాశ్‌ 2014లో జియో బోర్డులో చేరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని