Knight Frank report: ఇళ్ల ధరల వృద్ధిలో ప్రపంచ అగ్రగామి 5 నగరాల్లో ముంబయి, దిల్లీ

అంతర్జాతీయంగా ఇళ్ల ధరల్లో వృద్ధి అధికంగా ఉన్న 44 నగరాల జాబితాను స్థిరాస్తి కన్సల్టెంట్‌ నైట్‌ ఫ్రాంక్‌ విడుదల చేసింది.

Published : 14 Jun 2024 02:11 IST

 నైట్‌ ఫ్రాంక్‌ నివేదిక  

దిల్లీ: అంతర్జాతీయంగా ఇళ్ల ధరల్లో వృద్ధి అధికంగా ఉన్న 44 నగరాల జాబితాను స్థిరాస్తి కన్సల్టెంట్‌ నైట్‌ ఫ్రాంక్‌ విడుదల చేసింది. ఈ నగరాల్లో ఇళ్ల ధరల సగటు వార్షిక పెరుగుదల 12 నెలల్లో 4.1 శాతంగా ఉందని నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా సీఎండీ శిశిర్‌ బైజాల్‌ వెల్లడించారు. ఈ జాబితాలో మన దేశం నుంచి ముంబయి మూడో స్థానంలో,  దిల్లీ అయిదో స్థానంలో నిలిచాయి. 2024 జనవరి-మార్చి మధ్య ఇళ్ల ధరల పెరుగుదల ఆధారంగా ‘ప్రైమ్‌ గ్లోబల్‌ సిటీస్‌ ఇండెక్స్‌ క్యూ1 2024’ నివేదికను నైట్‌ ఫ్రాంక్‌ రూపొందించింది. ఏడాది క్రితం ఇదే సమయంలో ముంబయికి 6వ ర్యాంకు, దిల్లీకి 17వ ర్యాంకు లభించాయి. 

  •  ముంబయిలో వార్షిక ప్రాతిపదికన ఈ ఏడాది జనవరి-మార్చిలో ఇళ్ల ధరలు 11.5% పెరిగితే, దిల్లీలో 10.5% అధికమయ్యాయి.
  •  జాబితాలో బెంగళూరు గతేడాది 16వ స్థానంలో ఉండగా, ఈసారి 17వ ర్యాంకుకు పడింది. ఇక్కడ ఇళ్ల ధరలు 4.8% పెరిగాయి.  
  • మనీలా నగరం ఈ జాబితాలో తొలి స్థానంలో నిలిచింది. ఇక్కడ ఇళ్ల ధరల వార్షిక వృద్ధి  26.2 శాతంగా నమోదైంది. దీని తర్వాత టోక్యో   12.5% వృద్ధితో రెండో స్థానంలో నిలిచింది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు