ChatGPT: మస్క్‌ గురించి చాట్‌జీపీటీ సమాధానం ఇదే..!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖులపై చాట్‌జీపీటీ(ChatGPT) స్పందించింది. ఎలాన్‌ మస్క్‌, కిమ్‌, ట్రంప్‌ గురించి అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. 

Published : 20 Feb 2023 11:10 IST

శాన్‌ఫ్రాన్సిస్కో: సాంకేతిక ప్రపంచంలో సరికొత్త సంచలనం చాట్‌జీపీటీ(ChatGPT). ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (Artificial Intelligence) తో పనిచేసే ఈ టూల్‌.. యూజర్లకు తక్కువ సమయంలో కచ్చితమైన, అవసరమైన సమాచారం ఇస్తుందని ఆ టూల్‌ను కనిపెట్టిన ఓపెన్‌ ఏఐ (Open AI) చెబుతోంది. ఈ క్రమంలో చాట్‌జీపీటీ(ChatGPT)తో పలువురు సంభాషణలు జరిపి, సమాధానాలు రాబడుతున్నారు. ప్రముఖ వ్యాపారవేత్త ఎలాన్‌మస్క్( Elon Musk) గురించి చాట్‌జీపీటీ ఏం చెప్పిందో తెలుసా మరి..!

ఐజాక్ లాటెరెల్(Issac Latterell) అనే నెటిజన్.. ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ వ్యక్తుల గురించి చాట్‌జీపీటీ(ChatGPT) ఇచ్చిన సమాధానాలను షేర్ చేశారు. అందులో మస్క్‌( Elon Musk), అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, బోరిస్‌ జాన్సన్, నటి కిమ్‌ కర్దాషియన్, రష్యా అధ్యక్షుడు పుతిన్‌ వంటివారిని వివాదాస్పద వ్యక్తులుగా చాట్‌జీపీటీ పేర్కొంది. అలాగే వీరిని ప్రత్యేకంగా పరిగణించాలని కూడా చెప్పింది. ‘ప్రత్యేకంగా పరిగణించేందుకు మస్క్‌, ట్రంప్‌(Trump) అర్హులు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్‌ మాత్రం కాదు’ అంటూ ఐజాక్ ట్విటర్‌ ఖాతాలో రాసుకొచ్చారు.

పుతిన్‌(Putin), చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్(Xi Jinping), ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్‌(Kim) వంటి వారిని వివాదాస్పద వ్యక్తులుగా, ప్రత్యేకంగా పరిగణించాల్సిన వారిగా చాట్‌ జీపీటీ పేర్కొంది. దీనిపై మస్క్( Elon Musk) స్పందించారు. రెండు ఆశ్చర్యార్థకాలను(!!) పోస్టు చేశారు. ఇదిలా ఉంటే దీనిపై నెటిజన్లు స్పందించారు. ఈ వ్యక్తులపై మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా చాట్‌జీపీటీ(ChatGPT) ఈ విధంగా బదులిచ్చిఉంటుందని అభిప్రాయపడ్డారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు