Twitter: అయ్యో.. తప్పు దొర్లింది.. తిరిగి ఆఫీసుకి రండి!
Twitter: ట్విటర్‌లో ఇటీవల ఎలాన్ మస్క్ చాలా మంది ఉద్యోగుల్ని తొలగించిన విషయం తెలిసిందే. అయితే, వీరిలో కొంతమందిని పొరపాటున తొలగించినట్లు తర్వాత గుర్తించారట. వారిని తిరిగి ఆఫీసుకు రమ్మని తాజాగా సందేశం పంపుతున్నట్లు తెలుస్తోంది.
శాన్‌ఫ్రాన్సిస్కో: తొలగించిన ఉద్యోగుల్లో కొంతమందిని తిరిగి ఆఫీసుకు రమ్మంటూ ట్విటర్ (Twitter) సందేశాలు పంపిస్తోందట! జాబితాలో కొన్ని తప్పులు దొర్లాయని దీంతో పొరపాటున కొంతమందిని ఇంటికి పంపించాల్సి వచ్చిందని విశ్వసనీయ వర్గాలు చెప్పినట్లు బ్లూమ్‌బెర్గ్ పేర్కొంది. అలాగే మరికొంత మంది నైపుణ్యాన్ని, అనుభవాన్ని గుర్తించడంలోనూ విఫలమైనట్లు ట్విటర్ (Twitter) భావిస్తున్నట్లు సదరు వ్యక్తులు తెలిపారు.
ట్విటర్ (Twitter)లో మస్క్ (Elon Musk) లక్ష్యాలకు అనుగుణంగా మార్పులు చేస్తున్న విషయం తెలిసిందే. అందుకోసం తొలగించిన ఉద్యోగుల్లో కొంతమంది సేవలు తప్పనిసరని సంస్థ భావిస్తున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపారు. అందుకే వారిని తిరిగి ఆఫీసుకు రావాలని కోరిందట. దీనిపై ట్విటర్ (Twitter) యాజమాన్యంగానీ, అధిపతి ఎలాన్ మస్క్ (Elon Musk)గానీ ఇప్పటి వరకు స్పందించలేదు.
ట్విటర్‌ను 44 బి.డాలర్లతో కొనుగోలు చేసిన ఎలాన్ మస్క్ (Elon Musk).. కంపెనీని ఆర్థికంగా బలోపేతం చేసేందుకంటూ, ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ కోతలు మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. సగానికి పైగా ఉద్యోగుల్ని తొలగిస్తూ ఇటీవల నిర్ణయం తీసుకున్నారు. కంపెనీకి ఒక రోజులో మిలియన్ డాలర్ల కొద్దీ నష్టాలు వస్తున్నప్పుడు.. ఉద్యోగులను తొలగించడం మినహా తమకు వేరే దారి లేదని మస్క్ తన నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. ఇంటికి పంపించేసిన ఉద్యోగులందరికీ మూడు నెలల వేతన పరిహారాన్ని ఇస్తున్నామన్నారు.
నకిలీ ఖాతాల మాటేంటి?
ట్విటర్‌లో నకిలీ ఖాతాల సంఖ్య ఎక్కువనే కారణం చెప్పి కొనుగోలు ఒప్పందాన్ని రద్దు చేసుంటున్నట్లు ఎలాన్ మస్క్ గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ట్విటర్ ఆయన సొంతమైంది. ఇటీవల ఏకంగా ఆయన పేరిటే చాలా నకిలీ ఖాతాలు పుట్టుకొచ్చాయి. దీంతో మరి వాటి సంగతేంటని చాలా మంది యూజర్లు ట్విటర్ వేదికగా ప్రశ్నిస్తున్నారు. దీనిపై మస్క్ తమ విధానాన్ని ప్రకటించారు.
ఎలాంటి హెచ్చరిక కూడా జారీ చేయకుండానే నకిలీ ఖాతాల్ని శాశ్వతంగా రద్దు చేస్తామని ఎలాన్ మస్క్ స్పష్టం చేశారు. అయితే, నకిలీ ఖాతా అని సూచించేలా ప్రత్యేకంగా ‘పేరడీ’ అని పేర్కొన్న ఖాతాల్ని మాత్రం వదిలేస్తామని తెలిపారు. నకిలీ ఖాతాలకు సైతం బ్లూ టిక్ ఉండడంపై స్పందిస్తూ.. ఇప్పటి నుంచి పక్కా వెరిఫికేషన్ తర్వాతే బ్లూ చెక్ మార్క్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ట్విటర్ బ్లూ కింద ఈ సేవల్ని అందించనున్న విషయాన్ని గుర్తుచేశారు. దీనికి నెలకు 8 డాలర్లు చెల్లించాల్సిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్విటర్ బ్లూకి లాగిన్ కావాలంటే కచ్చితంగా బ్లూ టిక్ అవసరమని.. అది పక్కా వెరిఫికేషన్ తర్వాతే ఇస్తామని వివరించారు. ఫలితంగా నకిలీ ఖాతాలకు బ్లూ చెక్ మార్క్ ఉండే అవకాశం లేదని పరోక్షంగా తెలిపారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Gauhati HC: ‘జీన్స్’తో కోర్టు విచారణకు.. సీనియర్ న్యాయవాదికి ఊహించని అనుభవం!
-
Politics News
Andhra News: కార్పొరేట్ కంపెనీలా వైకాపా వ్యవహరం: సోము వీర్రాజు
-
Sports News
Gill - Pant: భవిష్యత్తులో కెప్టెన్సీకి వారిద్దరూ అర్హులు: ఆకాశ్ చోప్రా
-
General News
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
World News
Australia: కనిపించకుండాపోయిన ‘రేడియోధార్మిక’ క్యాప్సూల్.. 1400 కి.మీల మేర వెతుకులాట!
-
India News
PM Modi: అదే మా నినాదం.. అభివృద్ధి మంత్రం: మోదీ