Elon Musk: మరోసారి మస్క్‌ వింత ప్రశ్న.. నెటిజన్ల స్పందన ఇదే!

ఎలాన్‌ మస్క్‌ మరోసారి ట్విటర్‌ గురించి యూజర్ల అభిప్రాయం తెలుసుకునేందుకు ప్రయత్నించారు. ఇందుకోసం ఆయన ట్విటర్‌లో ఓ ప్రశ్నను పోస్ట్‌ చేశారు. దీనికి యూజర్ల నుంచి అనూహ్య స్పందన వస్తోంది.  

Published : 16 Jan 2023 21:40 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రస్తుత సాంకేతిక యుగంలో సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడంలో సామాజిక మాధ్యమాలు (Social Media) కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఆనందం, బాధ వంటి భావోద్వేగాలను పంచుకోవడంతోపాటు.. ప్రపంచంలో జరిగే సమస్త విషయాలను క్షణాల్లో యూజర్లకు చేరవేస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్‌ ( Smartphone) అందుబాటులోకి వచ్చాక ఫేస్‌బుక్‌ (Facebook), ఇన్‌స్టాగ్రామ్‌ (Instagram), ట్విటర్‌ (Twitter) ఉపయోగించే వారి సంఖ్య పెరిగింది. మరోవైపు ఎంటర్‌టైన్‌మెంట్‌ కోసం రీల్స్‌, షార్ట్స్‌ వంటి ఫీచర్లు కూడా యూజర్లకు అందుబాటులో ఉన్నాయి. దీంతో సోషల్‌ మీడియాలో ఎక్కువ సమయం గడిపే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ట్విటర్‌ కొత్త బాస్‌ ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) నెటిజన్లను ఒక ఆసక్తికర ప్రశ్న అడిగారు.

ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌ గురించి మస్క్‌ అడిగిన ఈ ప్రశ్నకు నెటిజన్ల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. ‘‘ఇన్‌స్టాగ్రామ్ యూజర్లను డిప్రెషన్‌లోకి పంపితే.. ట్విటర్‌ కోపాన్ని తెప్పిస్తుంది. ఈ రెండింటిలో ఏది  మంచిది?’’ అని ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్‌ చూసిన నెటిజన్లు తమ స్పందన తెలియజేస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఎక్కువ మంది ట్విటర్‌కు ఓటేయడం గమనార్హం. ‘‘ట్విటర్‌ ఎప్పటికప్పుడు నాకు సమాచారాన్ని అందిస్తుంది. ఇన్‌స్టాగ్రామ్‌ కేవలం నాకు తెలిసిన వ్యక్తుల ఫొటోలను చూపిస్తుంది. వాటి గురించి నాకు అవసరంలేదు. టిక్‌టాక్‌లా మారిపోయేందుకు ఇన్‌స్టాగ్రామ్‌ ప్రయత్నిస్తోంది. నా ఎంపిక ట్విటర్‌’’ అంటూ అమెరికన్‌  ఫుట్‌బాలర్‌ టీజే మోయి ట్వీట్ చేశారు. బెకర్‌ న్యూస్‌ సీఈవో కైలే బెకర్‌ స్పందిస్తూ.. ‘‘ఇన్‌స్టాగ్రామ్‌తో ఎలాంటి ఉపయోగంలేదు. ఎప్పటికప్పుడు తాజా సమాచారం తెలుసుకునేందుకు ట్విటర్‌ సరైన వేదిక’’ అని కామెంట్ చేశారు. మస్క్‌ చేసిన ఈ ట్వీట్‌కు  సుమారు నాలుగు కోట్ల వ్యూస్‌ వచ్చాయి. లక్ష మంది కామెంట్లు చేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని