Elon Musk: వారం రోజులు ఆమ్లెట్ మానేస్తా: మీడియా కథనంపై మస్క్‌ సెటైర్‌

ఓ వార్తాపత్రికలో వచ్చిన కథనంపై ఎలాన్‌ మస్క్ (Elon Musk) స్పందిస్తూ.. ఒక వారం పాటు ఆమ్లెట్‌కు దూరంగా ఉంటానని వెల్లడించారు. 

Published : 10 Jul 2024 16:54 IST

ఇంటర్నెట్‌ డెస్క్: ఒకవారం పాటు ఆమ్లెట్ తినకూడదని అనుకుంటున్నట్లు ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) వెల్లడించారు. తన స్పేస్‌ఎక్స్‌ సంస్థకు సంబంధించి ఓ ప్రముఖ వార్తా పత్రికలో వచ్చిన కథనాన్ని ఉద్దేశించి వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ఇంతకీ ఏం జరిగిందంటే..?

అమెరికాకు చెందిన ప్రముఖ వార్తా పత్రిక ది న్యూయార్క్‌ టైమ్స్‌ మొదటి పేజ్‌లో స్పేస్‌ఎక్స్‌ గురించి వచ్చిన కథనాన్ని ఎక్స్(ట్విటర్) వేదికగా ఓ నెటిజన్ షేర్ చేశారు. ఆ సందర్భంగా వార్తా పత్రిక లేఅవుట్‌కున్న ప్రాముఖ్యతను వివరించారు. ‘‘ఆ సంస్థ మొదటి పేజీ లేఅవుట్‌ గురించి మీకో చిన్న వివరణ. ఆ పేజ్‌లో కుడివైపు పైభాగంలో ఉండేది లీడ్‌ స్టోరీ. ఎడమవైపున వేసేది సబ్‌ లీడ్‌. మొత్తంగా పేపర్‌ ఫోల్డింగ్‌ పైభాగంలో ఆ రోజుకు సంబంధించి ముఖ్యమైన వార్తలు ఉంటాయి. 2024 అధ్యక్ష రేసు నుంచి అమెరికా అధ్యక్షుడు బైడెన్ వైదొలగాలంటూ కొందరు డెమోక్రాట్‌ నేతల నుంచి ఒత్తిడి వస్తుందంటూ ఎడమవైపు వార్త వచ్చింది. ఫ్రాన్స్‌ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలనేది మరో వార్త ఉంది. స్పేస్‌ఎక్స్ ప్రయోగానికి సంబంధించిన వార్త   అత్యంత ముఖ్యమైన కథనంగా ఉంది’’ అని వివరించారు. ఆ ప్రయోగం వల్ల తొమ్మిది పక్షి గూళ్లు ధ్వంసమయ్యాయని ఆ వార్తలో పేర్కొన్నారు. ఇలా న్యూయార్క్‌ టైమ్స్ వార్తల ఎంపికను ఆ నెటిజన్ ప్రశ్నించారు.

దీనిపై మస్క్‌ వ్యంగ్యంగా స్పందించారు. తాను చేసిన ఈ ఘోరాన్ని సరిదిద్దుకునేందుకు వారం రోజులపాటు ఆమ్లెట్లకు దూరంగా ఉంటానని చెప్పారు. దీనిపై నెటిజన్లు స్పందించారు. ‘‘ఎక్స్‌(గతంలో ట్విటర్‌ లోగో పక్షిని ఉద్దేశించి) యజమాని అయిన మీరు పక్షులను ఎలా బాధపెడతారు’’, ‘‘మరి బ్రేక్‌ఫాస్ట్‌లో ఏం తింటారు’’ అని ఫన్నీ కామెంట్లు పెట్టారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు