ప్రత్యామ్నాయ పెట్టుబడి మార్గాలు మీ కోసం..

రూ.1 కోటి అంతకంటే ఎక్కువ మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టేవారిని అవగాహన పెట్టుబడిదారులుగా నిర్వచిస్తారు....

Published : 18 Dec 2020 13:20 IST

రూ.1 కోటి అంతకంటే ఎక్కువ మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టేవారిని అవగాహన పెట్టుబడిదారులుగా నిర్వచిస్తారు.

పెట్టుబడుల గురించి చ‌ర్చించిన‌పుడు ఈక్విటీ, డెట్ ల చుట్టూ చర్చలు కేంద్రీకృతం అవుతాయి. దానికి కారణం, ప్రత్యామ్నాయ పెట్టుబడులు ఇప్పటికీ ప్రత్యామ్నాయంగానే ఉన్నాయి. వాటిని ఇంకా ప్రధానమైనవిగా పరిగణించడం లేదు. వీటిని ప్రధానమైనవిగా పరిగణించకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. వీటిలో విస్తృత పెట్టుబడిదారుల అవ‌గాహ‌న‌ లేకపోవడం, సెకండ‌రీ మార్కెట్ లోలిక్విడిటీ లేకపోవడం, పెట్టుబ‌డులు ఎక్కువ మొత్తంలో అవసరమవడం, ఈ ప‌థ‌కాలు తక్కువగా అందుబాటులో ఉండడం.

ప్రత్యామ్నాయ పెట్టుబడి మార్గాలు:

  1. ప్రత్యామ్నాయ పెట్టుబడుల ఫండ్ (ఏఐఎఫ్)

సెబీ ఏఐఎఫ్ రెగ్యులేషన్స్ 2012 కింద ఏర్పాటు చేసిన వివిధ రకాల ప్రత్యామ్నాయ పెట్టుబడుల ఫండ్లు ఉన్నాయి. ఈ పెట్టుబడులు ఈక్విటీ , డెట్, రియల్ ఎస్టేట్ వంటి అసెట్ త‌ర‌గ‌తుల‌కు చెందిన‌వై ఉంటాయి. అయితే రిటైల్ పెట్టుబడిదారులకు అందుబాటులో ఉండ‌వ‌ని చెప్పేందుకు
కార‌ణం వీటిలో కనీస పెట్టుబడి పరిమాణం రూ.1 కోటి ఉంటుంది.

  1. ఏఐఎఫ్ లు ఎవ‌రికంటే

పెట్టుబ‌డులపై అవగాహన క‌లిగిన మ‌దుప‌ర్ల‌ను దృష్టిలో ఉంచుకుని ఏఐఎఫ్ నిబంధనలను రూపకల్పన చేశారు. రూ.1 కోటి అంతకంటే ఎక్కువ మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టేవారిని అవగాహన క‌లిగిన పెట్టుబడిదారులుగా నిర్వచిస్తారు.రూ.1 కోటి కలిగి ఉంటే, పెట్టుబడి పెట్టడానికి కేటగిరీ II ఏఐఎఫ్ లను ఎంపిక చేసుకోవచ్చు.

ఏఐఎఫ్ లలో మూడు రకాలు ఉన్నాయి, వాటిలో కేటగిరీ I - ఇన్ఫ్రా స్ట్రక్చర్ లేదా సామాజిక వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టడం, కేటగిరీ II - ఈక్విటీ, డెట్ ల కోసం, కేటగిరీ III - క్లిష్టమైన నిర్మాణాలలో పెట్టుబడి పెట్టడం.

  1. కమోడిటీల్లో పెట్టుబ‌డి

కమోడిటీలు అంటే లోహాలు, అలోహాలు, వ్యవసాయ వస్తువులు మొదలైనవి ఏవైనా కావచ్చు. ఎంసీఎక్స్, ఇతర వస్తువుల ఎక్స్చేంజ్ లలో అందుబాటులో ఉన్న ఫ్యూచర్స్ ఒప్పందాల ద్వారా పాల్గొనడానికి మార్గం ఉంటుంది. ఏఐఎఫ్ లలో పెద్ద టికెట్ పరిమాణమంత పెట్టుబడి దీనికి అవసరం లేదు. ఇందులో మదుపరులకి కమోడిటీస్ ధర నిర్ణయ, కదలిక పై అవగాహన కలిగి ఉండాలి. ఒకవేళ మీకు ఒక నిర్దిష్ట కమోడిటీపై, ఇతర సంబంధిత అంశాలను తెలుసుకోవడానికి బ్యాండ్ విడ్త్ ఆసక్తి కలిగి ఉంటే, దానిని గుర్తించడానికి అవకాశం ఉంది.

  1. రియల్ ఎస్టేట్ పెట్టుబ‌డులు

రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు ఎక్కువగా భౌతిక రూపంలో జరుగుతాయి. పెట్టుబ‌డుల‌లో భాగంగా చే రెండవ ఇళ్లు కొనుగోలు చేయ‌డం లాంటివి చేస్తుంటారు. వివిధ పెట్టుబ‌డి సాధనాల ద్వారా ఇందులో పెట్టుబడి చేయ‌డం కుదురుతుంది. గ‌తంలో సెబీ వెంచర్ ఫండ్ నిబంధ‌న‌ల ప్ర‌కారం నిబంధనల కింద రూపొందించిన వెంచర్ ఫండ్లు రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెట్టాయి. ప్ర‌స్తుతం అది ఏఐఎఫ్ నిబంధనలతో విలీనం అయింది. సెబీ ఏఐఎఫ్ నిబంధనల ప్రకారం, కనీసం రూ. 1 కోటి పరిమాణంతో ఏదైనా నూతన వెంచర్ ను ఆవిష్కరించాల్సి ఉంటుంది.

కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలు డిబెంచర్లు (ఎన్‌సీడీలు) జారీ చేస్తుంటాయి. వీటిలో రాబ‌డి వాటి క్రెడిట్ రేటింగ్ ఆధారంగా ఉంటుంది. క్రెడిట్ రేటింగు త‌క్కువ ఉండే డిబెంచ‌ర్లు ఎక్కువ వడ్డీ రేటును కలిగి ఉంటాయి. అయితే ఈ డిబెంచర్స్ ను పబ్లిక్ ఇష్యూ ద్వారా కాకుండా ప్రైవేటు ప్లేస్ మెంట్స్ జారీ చేస్తుంటాయి. హెచ్ఎన్ఐ ల‌కు సంప‌ద‌లు నిర్వ‌హించే మేనేజ‌ర్లు ఎక్కువగా వీటిలో పెట్టుబడి పెడుతున్నారు.

  1. బంగారం

రిటైల్ పెట్టుబడిదారులకు బంగారంపై పెట్టుబడి సులువుగా లభించే ఒక ప్రత్యామ్నాయం. బంగారంలో పెట్టుబడి పెట్టడానికి వివిధ రకాల మార్గాలు ఉన్నాయి. వాటిలో సార్వ‌భౌమ బంగారు బాండ్లు ఎస్‌జీబీ ఒకటి. వీటి ద్వారా భ‌ద్ర‌త‌ బంగారానికి మార్కెట్ ధర, అలాగే కూపన్ ను పొందవచ్చు. అయితే, వీటికి లిక్విడిటీ ఉండదు. కనీసం ఐదు సంవత్సరాల పాటు పెట్టుబ‌డి చేయాలి.ఐదు నుంచి ఎనిమిది సంవత్సరాల డిపాజిట్ మాదిరిగా ఉంటుంది.రెండవది గోల్డ్ ఈటీఎఫ్. వీటిలో పెట్టుబ‌డి మ్యూచ్యువల్ ఫండ్ లో చేసిన విధంగానే ఉంటుంది. వీటి నిర్వ‌హ‌ణ రుసుం మ్యూచువ‌ల్ ఫండ్ల కంటే త‌క్కువ‌గా ఉంటుంది. గోల్డు బాండ్లులా వీటిపై పై కూపన్ లను పొందలేరు. ఈటీఎఫ్ లు లిక్విడిటీని క‌లిగి ఉంటాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని