న్పీఎస్ ఖాతా తెరవడం వలన కలిగే ప్రయోజనాలు..

18 నుంచి 65 సంవత్సరాల వయస్సు గల ఎవరైనా ఎన్‌పీఎస్‌లో చేరవచ్చు....

Published : 23 Dec 2020 11:44 IST

18 నుంచి 65 సంవత్సరాల వయస్సు గల ఎవరైనా ఎన్‌పీఎస్‌లో చేరవచ్చు

పెట్టుబడిదారులు ఎక్కువగా ఇష్టపడే పెట్టుబడి సాధనాల్లో నేషనల్ పెన్షన్ సిస్టం (ఎన్‌పీఎస్) ఒకటి. ఎందుకంటే అది పన్ను ప్రయోజనాలను అందించడంతో పాటు, తక్కువ పెట్టుబడి, మంచి రాబడిని అందిస్తుంది. 18 నుంచి 65 సంవత్సరాల వయస్సు గల ఎవరైనా ఎన్‌పీఎస్‌లో చేరవచ్చు. అలాగే 70 సంవత్సరాలు వచ్చే వరకు పెట్టుబడి పెట్టవచ్చు.

ఇటీవల, COVID-19 సంక్షోభం కారణంగా మార్చి 30, 2020 నుంచి జూన్ 30, 2020 వరకు ఎన్‌పీఎస్ టైర్ 1 ఖాతాలకు కాంట్రిబ్యూషన్ అందించడానికి ప్రభుత్వం గడువును పొడిగించింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను పన్ను ప్రయోజనం పొందాలనుకునే చందాదారులకు ఈ పొడిగింపు సహాయపడుతుంది. చందాదారులు జూన్ 30, 2020 వరకు ఎన్‌పీఎస్‌లో పెట్టుబడులు పెట్టడం ద్వారా అలా చేయగలరు.

కేవలం పన్ను ప్రయోజనాలను పొందడానికి మాత్రమే కాకుండా, ఎన్‌పీఎస్‌లో పెట్టుబడులు విస్తృతంగా ప్రాచుర్యం పొందాయి. పీపీఎఫ్ పై వడ్డీ రేట్లు స్థిరంగా ఉంటాయి, వీటిని క్రమంగా ప్రభుత్వం తగ్గిస్తోంది. అదే ఎన్‌పీఎస్‌లో రాబడికి హామీ ఇవ్వనప్పటికీ, ఇవి ఈక్విటీకి లోబడి ఉండడం వలన దీర్ఘకాలంలో మంచి రాబడిని అందిస్తుందని ఎన్‌ఎస్‌డీఎల్ ఈ-గవర్నెన్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అమిత్ సిన్హా తెలిపారు. ఒకవేళ మీరు కూడా ఎన్‌పీఎస్‌లో పెట్టుబడులు పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే, ఈ పదవీ విరమణ పథకానికి సంబంధించిన కొన్ని ఫీచర్స్, ప్రయోజనాలను కింద చూడండి.

నేషనల్ పెన్షన్ సిస్టం ఫీచర్స్, ప్రయోజనాలు:

స్వచ్ఛందంగా - ఇది స్వచ్ఛంద పెట్టుబడి ఆప్షన్, దీనిలో పెట్టుబడిదారులు ఏ సమయంలోనైనా కాంట్రిబ్యూట్ చేయవచ్చు. అలాగే ప్రతి సంవత్సరం ఎన్‌పీఎస్ కోసం ఆదా చేయాలనుకుంటున్న మొత్తాన్ని కూడా మార్చుకోవచ్చు.

సులువుగా యాక్సెస్ - ఎన్‌సీఎస్ ఖాతాను తెరవడం, నిర్వహించడం చాలా సులభం. చందాదారుడు ఆన్‌లైన్ ద్వారా ఈఎన్‌పీఎస్ (ఈఎన్‌పీఎస్ - నేషనల్ పెన్షన్ సిస్టమ్) ద్వారా లేదా ఏదైనా పీఓపీ (పాయింట్స్ ఆఫ్ ప్రెజెన్స్) ను సంప్రదించడం ద్వారా ఎన్‌పీఎస్ ఖాతాను తెరవవచ్చు. చందాదారుల వివరాలలో మార్పులు, కాంట్రిబ్యూషన్ మొదలైన ఎన్‌పీఎస్ ఖాతాల తదుపరి కార్యకలాపాలు చందాదారుల లాగిన్ ఆధారాలను ఉపయోగించి ఆన్‌లైన్‌లో కూడా చేయవచ్చు.

పన్ను ప్రయోజనాలు - చందాదారులు రూ. 1.5 లక్షల పన్ను ప్రయోజనాలను పొందుతారు, ఇందులో వారి సొంత కాంట్రిబ్యూషన్ తో పాటు వారి యజమాని కాంట్రిబ్యూషన్ కూడా వర్తిస్తుంది. ఈ పన్ను ప్రయోజనాలను ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80 సీసీడీ (1), 80 సీసీడీ (2) కింద క్లెయిమ్ చేయవచ్చు. అలా కాకుండా, పన్ను చెల్లింపుదారుడు ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రూ. 50 వేలకు సెక్షన్ 80సీసీడీ (1బీ) కింద అదనపు పన్ను మినహాయింపు పొందవచ్చు. సెక్షన్ 80సీసీడీ (1), 80 సీసీడీ (2) కింద అదనపు పన్ను ప్రయోజనం పన్ను మినహాయింపు కంటే ఎక్కువ.

ఫ్లెక్సిబిలిటీ - చందాదారుడు తన సొంత పెట్టుబడి ఆప్షన్లను (యాక్టివ్ లేదా ఆటో ఎంపిక) ఎంచుకోవడం, అలాగే మార్చుకోవడం చేయవచ్చు, అతని / ఆమె పెట్టుబడులను నిర్వహించే పెన్షన్ ఫండ్‌ను ఎంచుకోవచ్చు.

పోర్టబిలిటీ - ఈ పెన్షన్ పథకంలోని ప్రధాన లక్షణాలలో ఇది ఒకటి. ఉద్యోగాలు, లొకేషన్స్ లో PRAN ఖాతా సున్నితమైన పోర్టబిలిటీని ఎన్పీఎస్ అందిస్తుంది.

తక్కువ పెట్టుబడి - ఈ పెన్షన్ పథకం తక్కువ ఖర్చుతో కూడిన పెన్షన్ పథకాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. అడ్మినిస్ట్రేటివ్ చార్జీలు, ఫండ్ మేనేజ్‌మెంట్ ఫీజులు కూడా అతి తక్కువ అని నిపుణులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని