ముత్తూట్‌ మినీ సీఓఓగా శ్రీజిల్‌ ముకుంద్‌

ప్రముఖ బ్యాంకింగేతర ఆర్థిక సేవల సంస్థ (NBFC) ముత్తూట్‌ మినీ ఫైనాన్షియర్స్‌ సంస్థ శ్రీజిల్‌ ముకుంద్‌ను కొత్త చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌గా నియమించింది.

Published : 04 May 2022 17:07 IST

దిల్లీ: ప్రముఖ బ్యాంకింగేతర ఆర్థిక సేవల సంస్థ (NBFC) ముత్తూట్‌ మినీ ఫైనాన్షియర్స్‌ సంస్థ శ్రీజిల్‌ ముకుంద్‌ను కొత్త చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌గా నియమించింది. సంస్థ దీర్ఘకాలిక లక్ష్యాలను చేరుకోవడానికి ఆయన విస్తృత బ్యాంకింగ్‌ అనుభవాన్ని వినియోగించుకోనున్నట్లు ఆ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. శ్రీజిల్‌ ముకుంద్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌లో గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేశారు. సర్టిఫైడ్‌ అసోసియేటెడ్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకర్స్‌ (CAIIB) వృత్తిపరమైన కోర్సుతో పాటు సౌత్‌ ఇండియన్‌ బ్యాంక్‌లో 25 ఏళ్ల పాటు పనిచేసిన అనుభవం ఉంది. ఆ బ్యాంకుకు రెండు రీజియన్లకు హెడ్‌గా పనిచేయడంతో పాటు బ్యాంక్‌ ఎన్‌ఆర్‌ఐ వ్యాపారానికి నేషనల్‌ హెడ్‌గానూ వ్యవహరించారు. నాలుగేళ్ల పాటు డిప్యుటేషన్‌పై దుబాయ్‌లో ఎక్స్ఛేంజ్ కంపెనీకి నాయకత్వం వహించారు. 2018లో దుబాయ్‌లో ఆ బ్యాంక్ మొదటి విదేశీ కార్యాలయాన్ని ప్రారంభించడంలో కూడా శ్రీజిల్‌ కీలక పాత్ర పోషించారు. మధ్యప్రాచ్యం మార్కెట్‌తో పాటు ఎన్‌ఆర్‌ఐల సారథ్యంలోని వ్యాపార రంగంలో శ్రీజిల్‌కు ఉన్న విశేష అనుభవాన్ని సంస్థ వృద్ధికి దోహదపడుతుందని ఆశిస్తున్నట్లు ముత్తూట్‌ మినీ పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని