మీ పోర్ట్‌ఫోలియోలో మ్యూచువల్ ఫండ్లను ఒక భాగం చేసుకోండి.. ఎందుకంటే?
మీ పోర్ట్‌ఫోలియోలో మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులను ఒక భాగం చేసుకుంటే ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఉండవు....
మీ పోర్ట్‌ఫోలియోలో మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులను ఒక భాగం చేసుకుంటే ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఉండవు.
భవిష్యత్తు లక్ష్యాలను సాధించాలంటే మనం సంపాదిస్తున్న సొమ్మును క్రమానుగతంగా, క్రమశిక్షణతో మదుపు చేయాలి. దీనికి మార్కెట్లో మీ తరఫున మదుపు చేసే మ్యూచువల్ ఫండ్లు సహాయం చేస్తాయి. మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు పెట్టేముందు రాబడి, రిస్క్, పెట్టుబడుల మొత్తం కాలపరిమితి, పెట్టుబడులు విధానం వంటివి తెలుసుకోవాలి.
మ్యూచువల్ ఫండ్లు ఎందుకు?
మీ ఆర్థిక లక్ష్యాలను అనుకున్న సమయానికి చేరుకునేందుకు మ్యూచువల్ ఫండ్ల పెట్టుబడులు ఉపకరిస్తాయి. ఫండ్లలో మదుపు చేయడానికి పెద్ద మొత్తంలో సొమ్ము కూడా అక్కర్లేదు. రూ.1,000తోనూ మదుపరులు వీటిలో పెట్టుబడి పెట్టవచ్చు. వీటిని మార్కెట్ లావాదేవీల్లో ఎంతో నైపుణ్యం ఉన్న నిపుణులు నిర్వహిస్తారు. వీరికి మార్కెట్ పరిస్థితులను బట్టి, ఎక్కడ మదుపు చేయాలి? ఏ సంస్థలను ఎంచుకోవాలి? వేటికి దూరంగా ఉండాలి అనే విషయాల్లో పూర్తి అవగాహన ఉంటుంది. వీరి వెనుక అనేక మంది మార్కెట్ నిపుణులు ఎప్పటికప్పుడు మార్కెట్‌ను, కంపెనీల పరిస్థితులను విశ్లేషిస్తుంటారు. ఫండ్లను ఎంచుకునే ముందు కొన్ని జాగ్రత్తలను తీసుకోవాలి. రిస్క్, రాబడి, కాలపరిమితి, ఫండ్ గత చరిత్ర పెట్టుబడి మార్గాలు తెలుసుకోవాలి. మీకు అనుకూలంగా ఉన్నవాటినే ఎంచుకోవాలి.
ఎక్కువ ఫండ్లు వద్దు:
మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు పెట్టేముందు ఎక్కువ ఫండ్లను ఎంచుకోకపోవడమే మంచిది. ఒక ఫండ్ అనేక రంగాలు, కంపెనీల షేర్లలో మదుపు చేస్తుంది. కొన్ని సార్లు ఒకే రంగానికి సంబంధించిన కంపెనీలలో పెట్టుబడులు వెళ్లవచ్చు. కొన్ని ఫండ్లను ఎంచుకొని అవి ఎక్కువ వాటిలో పెట్టుబడులు పెట్టేవిధంగా ఉండాలి. ఎక్కువ ఫండ్లను కొనుగోలు చేయడం కాకుండా ఎక్కువ లాభాలను ఇచ్చే కంపెనీల్లో పెట్టుబడులు చేస్తే ఫలితం ఉంటుంది
పోర్ట్‌ఫోలియోను పరిశీలించండి:
మ్యూచువల్ ఫండ్ పోర్ట్‌ఫోలియోను ఎప్పుడూ గమనిస్తుండాలి. అనేది చాలా ముఖ్యం. పెట్టుబడులు ఎల్లప్పుడూ చేస్తుండటంతో మంచి లాభాలు పొందవచ్చు. మార్కెట్లలో కొంత ఒడుదొడుకులు రాగానే కొంతమంది ఫండ్లను విక్రయించేందుకు మొగ్గుచూపుతారు. కానీ ఇలాంటి నిర్ణయాలు తీసుకునే ముందు ఫండ్ల తీరును తెలుసుకునేందుకు ఇతర వాటితో, గత చరిత్రను పోల్చి చూసుకోవాలి. దీర్ఘకాలీకంగా పెట్టుబడులు కొనసాగిస్తే మంచి రాబడులు పొందవచ్చన్నది మ్యూచువల్ ఫండ్ గత చరిత్ర చూస్తే ఇప్పటికే అర్థమవుతుంది.
మ్యూచువల్ ఫండ్లలో ఈక్విటీ పథకాలే కాకుండా… వైవిధ్యమైన ఫండ్లు అందుబాటులో ఉంటాయి. వీటిలో మన అవసరానికి తగిన ఫండ్లను ఎంచుకోవచ్చు. పైగా నెలనెలా నిర్ణీత మొత్తాన్ని వీటిల్లో మదుపు చేయడానికి కేటాయించవచ్చు. ఈ పద్ధతి షేర్లలో అంతగా కుదరకపోవచ్చు. ఫండ్ యూనిట్లను విక్రయించి, పెట్టుబడిని చాలా సులభంగా వెనక్కి తీసుకునే వీలుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఆ మాజీ సీఎం తనయుడి ఆస్తి ₹700 కోట్లు.. సొంత వాహనం లేదు!
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
పరిశ్రమలు తేవడం తెదేపా బ్రాండ్.. తరిమికొట్టడం జగన్ బ్రాండ్: చంద్రబాబు
-
ప్రెగ్నెన్సీపై స్పందించిన పరిణీతి చోప్రా.. ఏమన్నారంటే!