మ్యూచువ‌ల్ ఫండ్లలో మ‌దుపు మరింత వేగంగా

మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో పెట్టుబ‌డికి సంబంధించిన లావాదేవీలు వేగంగా చేసేందుకు యూపీఐ విధానం స‌హ‌క‌రిస్తుంది.​​​​​​....​

Published : 21 Dec 2020 13:12 IST

మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో పెట్టుబ‌డికి సంబంధించిన లావాదేవీలు వేగంగా చేసేందుకు యూపీఐ విధానం స‌హ‌క‌రిస్తుంది.​​​​​​​

30 మే 2018 మధ్యాహ్నం 2:40

ప్ర‌స్తుతం మ్యూచువ‌ల్ ఫండ్లలో పెట్టుబ‌డి నెఫ్ట్, ఆర్టీజీఎస్ ఆన్లైన్ బ్యాంకింగ్, డెబిట్ కార్డుల తోపాటుగా యూపీఐ విధానంలో కూడా చేయ‌వ‌చ్చు. అయితే అన్ని మ్యూచువ‌ల్ ఫండ్ సంస్థ‌లు యూపీఐ ద్వారా పెట్టుబ‌డుల‌ను చేసే వీలుక‌ల్పించ‌డం లేదు. త్వ‌ర‌లోనే ఈ స‌దుపాయాన్ని అన్ని ఏఎమ్‌సీలు అందుబాటులోకి తెస్తాయ‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు.

యూపీఐ విధానంతో:

యూపీఐ ద్వారా క‌లిగే లాభ‌మేంటంటే, మ‌దుప‌రి పెట్టుబ‌డి చేసిన 24 గంట‌ల్లోగా పెట్టుబ‌డి మ్యూచువ‌ల్ ఫండ్ సంస్థ‌కి చేరుతుంది.పెట్టుబ‌డి చేసే విధానాన్ని మ‌రింత సుల‌భ‌త‌రం చేసేందుకు ఇది స‌హ‌క‌రిస్తుంది. రిజ‌ర్వు బ్యాంకు తాజాగా విడుద‌ల చేసిన గ‌ణాంకాల ప్ర‌కారం యూపీఐ లావాదేవీలు 2013-14 ఆర్థిక సంవ‌త్స‌రంలో రూ. 66.34 కోట్లు ఉండ‌గా 2017-18 ఆర్థిక సంవ‌త్స‌రానికి రూ. 207.98 కోట్ల‌కు చేరిన‌ట్లు తెలుస్తోంది.

యూపీఐ గురించి:

ఈ చెల్లింపుల విధానం ఐఎంపీఎస్ వేదికపై అభివృద్ధి చేసిందే కాబ‌ట్టి ఇది కూడా 24 x 7 అందుబాటులో ఉంటుంది. ఐఎంపీఎస్ కంటే ఇది సుల‌భం ఎందుకంటే దీని ద్వారా డబ్బును బదిలీ చేయడానికి ముందు లబ్ధిదారుడిని నమోదు చేయవలసిన అవసరం లేదు. గ్ర‌హీత బ్యాంకు ఖాతాకు లింక్ చేసిన మొబైల్ నంబ‌రు ఆధారంగా నిధులను బదిలీ చేయవచ్చు. గ్ర‌హీత‌లు యూపీఐతో రిజిస్టర్ చేసుకునే అవ‌స‌రంలేన‌ప్ప‌టికీ రిజిస్ట‌ర్ అయిన వారికి బ్యాంకు ఖాతా సంఖ్య, ఐఎఫ్ఎస్సీ కోడ్ త‌దిత‌ర వివ‌రాలు న‌గ‌దు పంపేవారికి వెల్లడించాల్సిన అవసరం లేదు. యూపీఐ విధానంలో రిజిస్టర్ మొబైల్ నుంచి ఎస్ఎమ్ఎస్ పంపడం ద్వారా డబ్బును బదిలీ చేయవ‌చ్చు. మొబైల్ యాప్ ను వినియ‌గించి లావాదేవీలు పూర్తి చేయ‌వ‌చ్చు. ఒక యూపీఐ లావాదేవీకి గ‌రిష్ఠ పరిమితి రూ .1 లక్ష నిర్ణ‌యించారు. ప్రస్తుతానికి ఎటువంటి ఛార్జీలు లేవు.

24 గంట‌ల్లో:

ఐడీఎఎఫ్‌సీ, ఎల్ఐసీ ఏఎఎమ్‌సీ లు గ‌త ఏడాది యూపీఐ ద్వారా పెట్టుబ‌డులు చేసేందుకు మ‌దుప‌ర్ల‌కు అవ‌కాశం క‌ల్పించ‌గా త‌రువాత‌ చాలా ఏఎమ్‌సీలు ఈ స‌దుపాయాన్ని మ‌దుప‌ర్ల‌కు అందుబాటులోకి తెచ్చాయి. ప్ర‌స్తుతం ఇంట‌ర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ప్ర‌స్తుతం లావాదేవీ జ‌రిగేందుకు 2-3 రోజులు స‌మయం
ప‌డుతుంది. యూపీఐ విధానంలో ఇది 24 గంట‌ల్లో పూర్త‌వుతుంది.

2 ల‌క్ష‌ల‌కు మించితే:

ప్ర‌స్తుతం మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో పెట్టుబ‌డులు రూ. 2 ల‌క్ష‌ల‌కు మించి ఉంటే పూర్తిగా న‌గ‌దు బ‌దిలీ అయిన త‌ర్వాత మాత్ర‌మే యూనిట్ల‌ను జారీ చేస్తున్నారు. రూ. 2 ల‌క్ష‌ల కంటే త‌క్కువ మొత్తంలో పెట్టుబ‌డి ఉంటే వారికి న‌గ‌దు వారి ఖాతాలోకి రాక‌ముందే యూనిట్ల‌ను బ‌దిలీ చేస్తున్నారు. లిక్విడ్ ఫండ్ల‌లో అయితే మీరు ఎంత పెట్టుబ‌డి చేస్తున్నారు అనే విష‌యం తో ప‌ని లేకుండా మొత్తం యూనిట్ల‌ను పూర్తిగా ఫండ్ హౌస్ కి న‌గ‌దు బ‌దిలీ అయిన త‌ర్వాత మాత్ర‌మే చేస్తున్నారు.

ఉదాహ‌ర‌ణ‌కు మీరు శుక్ర‌వారం ఇంట‌ర్నెట్ బ్యాంకింగ్ ద్వారా లిక్విడ్ ఫండ్లో మ‌దుపు చేశారు. ఆమొత్తం సోమ‌వారానికి ఏఎమ్‌సీకి చేరింది. లిక్విడ్ ఫండ్ల‌లో ముందు రోజు ఎన్ఏవీ లెక్క ప్ర‌కారం మ‌దుప‌రికి యూనిట్లు బ‌దిలీ చేస్తారు. యూపీఐ ద్వారా పెట్టుబ‌డి చేస్తే వెంట‌నే అవుతుంది. ఆ మ‌దుప‌రి గురువారం నాడు ఎన్ఏవీకి యూనిట్ల‌ను పొందుతారు. లేకుంటే ఆదివారం ఉన్న ఎన్ఏవీకి పొందుతారు. ఎన్‌పీసీఐ ప్ర‌స్తుతం గ‌రిష్ట ప‌రిమితిని రూ.1 ల‌క్ష‌కు చేసింది అయితే ఎన్ని లావాదేవీలైనా చేసేందుకు వీలు ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు