Baricitinib: కొవిడ్‌ చికిత్సకు మరో ఔషధం

కొవిడ్‌ రోగుల చికిత్సలో వాడేందుకు మరో ఔషధానికి అత్యవసర వినియోగ అనుమతి లభించింది. సోమవారం

Published : 03 May 2021 20:06 IST

హైదరాబాద్‌: కొవిడ్‌ రోగుల చికిత్సలో వాడేందుకు మరో ఔషధానికి అత్యవసర వినియోగ అనుమతి లభించింది. సోమవారం ఉదయం నాట్కో ఫార్మా, ‘బారిసిటినిబ్‌’ 1 మి.గ్రా., 2 మి.గ్రా., 4 మి.గ్రా., డోసుల టాబ్లెట్ల వినియోగానికి సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టాండర్డ్‌ కంట్రలోల్‌ ఆర్గనైజేన్‌ (సిడిఎస్‌సిఓ) అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చినట్టు తెలిపింది. ఇక మీదట కొవిడ్‌-19 పాజిటివ్‌ పేషెంట్ల చికిత్సలో రెమిడెసివిర్‌తో పాటు, బారిసిటినిబ్‌ను కూడా ఉపయోగిస్తారు. దేశమంతటా కరోనా పేషెంట్లకు ‘బారిసిటినిబ్‌’ను సరఫరా చేసేందుకు ఈ వారంలోనే ఉత్పత్తిని ప్రారంభిస్తామని నాట్కో ఫార్మా తెలిపింది.

దేశంలో రెమిడెసివిర్‌ ఔషధం కొరత ఉన్న నేపథ్యంలో దానిని అధిగమించేందుకు ‘బారిసిటినిబ్’ అత్యవసర వినియోగానికి నాట్కో పార్మాకు అనుమతులు లభించాయి. ‘బారిసిటినిబ్’ ఔషధానికి అనుమతి లభించడంతో నాట్కో ఫార్మా సంస్థల షేర్లు లాభాల బాటలో పయనిస్తున్నాయి. నాట్కో ఫార్మా జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లకు బ్రాండెడ్‌, జనరిక్‌ మందులు, బల్క్‌ యాక్టివ్స్‌, ఇంటర్మీడియేట్స్‌ను సరఫరా చేస్తోంది. ఇదిలా ఉండే రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 5,695 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవగా 49 మంది మరణించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు