ఏ ప‌థ‌కాలు ఎంత అవసరం..

అందువలన ఆర్ధిక లక్ష్యాలను నిర్దేశించుకుని , తగిన రీతిలో మదుపు చేయాలి. దీనికి క్రమశిక్షణ, పట్టుదల ఉండాలి. స్వల్పకాలిక అవసరాలకోసం డబ్బు ఖర్చు పెట్టరాదు​​​​​​....

Updated : 22 Dec 2020 15:07 IST

అందువలన ఆర్ధిక లక్ష్యాలను నిర్దేశించుకుని , తగిన రీతిలో మదుపు చేయాలి. దీనికి క్రమశిక్షణ, పట్టుదల ఉండాలి. స్వల్పకాలిక అవసరాలకోసం డబ్బు ఖర్చు పెట్టరాదు.

​​​​​​​కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన 2020-21 ఏడాదికి బడ్జెట్ లో ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు మరొక విధానాన్ని ప్రవేశ పెట్టారు. దీని ప్రకారం పాత విధానం లోలాగా కొత్త విధానంలో ఎటువంటి పన్ను మినహాయింపులు పొందకుండా , తక్కువ రేటుతో పన్ను చెల్లించవచ్చు. దీని వలన ప్రజలు తప్పనిసరిగా నిర్దేశించిన పథకాలలో మదుపు చేయాల్సిన అవసరం లేకుండా, తమ అవసరాల ప్రకారం ఖర్చు, మదుపు చేయొచ్చు. ప్రజలు ఖర్చు చేయడం వలన వినియోగ వస్తువుల కొనుగోలు పెరిగి ఆర్ధిక వ్యవస్థ మెరుపు పడుతుంది. ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయి. పన్ను మినహాయింపు కోసం చేసే పథకాలలో రాబడి నిర్దిష్టంగా ఉంటుంది కాబట్టి, దీర్ఘకాలంలో అధిక రాబడి నిచ్చే ఈక్విటీ లలో మదుపు చేయడం ద్వారా కంపెనీలకు మూలధనం సమకూరుతుంది. ప్రజలు తమ రిస్క్ సామర్ధ్యాన్ని ప్రకారం పధకాన్ని ఎంచుకుని మదుపు చేయొచ్చు.

ఈ మినహాయింపులు సాధారణంగా ఈ కిందివి ఉంటాయి.
సెక్షన్ 80సి - రూ.1.50 లక్షలు
( ప్రావిడెంట్ ఫండ్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్,సుకన్య సమృద్ధి యోజన, జీవిత బీమా పాలసీ ప్రీమియం, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్, 5 ఏళ్ల బ్యాంకు, పోస్ట్ ఆఫీస్ ఫిక్సెడ్ డిపాజిట్, నేషనల్ పెన్షన్ సిస్టం , ఈఎల్ఎస్ఎస్, యులిప్స్, పిల్లల ట్యూషన్ ఫీజు, గృహ రుణ అసలు చెల్లింపు వంటివి).
సెక్షన్ 80డి : ఆరోగ్య బీమా పాలసీ ప్రీమియం. రూ. 25 వేలు.
సెక్షన్ 80సీసీడీ (1బి): నేషనల్ పెన్షన్ సిస్టం లో అదనపు మదుపు - రూ. 50 వేలు .
సెక్షన్ 24బి గృహ రుణ వడ్డీ : రూ 2 లక్షలు (సొంతంగా నివసిస్తుంటే).

పాత, కొత్త విధానాలలో ఎందులో తక్కువ పన్ను వర్తిస్తుందో తెలుసుకుని , దానిని ఆచరించవచ్చు . పాత పద్ధతినే కొనసాగించదలిస్తే అవే పథకాలలో మదుపు చేయొచ్చు. ఒకవేళ కొత్త పద్ధతిలోకి మారదలచుకుంటే , పన్ను మినహాయింపులకోసం తప్పనిసరిగా మదుపు చేయాల్సిన అవసరం ఉండదు కాబట్టి, తమ ఆర్ధిక లక్ష్యాలు, అవసరాలు దృష్టిలో ఉంచుకుని మదుపు చేయోచ్చు. ఒకవేళ కొత్త పద్దతి ని ఎంచుకుని, పాత పథకాలలో కూడా మదుపు చేయదలిస్తే , ఏవి ఎంత వరకు చేయొచ్చో చూద్దాం :
ప్రావిడెంట్ ఫండ్ : - పన్ను మినహాయింపు పొందినా, పొందకపోయినా, ప్రతి ఉద్యోగికి తప్పనిసరిగా ఉంటుంది.

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ :- భద్రత, కచ్చితమైన రాబడి. జమ అయ్యే వడ్డీ, నగదు ఉపసంహరణలపై పన్ను మినహాయింపులు ఉంటాయి కాబట్టి, మధ్యకాలిక, దీర్ఘకాలిక లక్ష్యాల కోసం కొంత మొత్తం జమ చేయడం మంచిది.

సుకన్య సమృద్ధి యోజన :- భద్రత, కచ్చితమైన రాబడి. జమ అయ్యే వడ్డీ, నగదు ఉపసంహరణలపై పన్ను మినహాయింపులు ఉంటాయి కాబట్టి, ఆడపిల్లల ఫై చదువులకు , వారి వివాహానికి కొంత మొత్తం జమ చేయడం మంచిది.

జీవిత బీమా పాలసీ ప్రీమియం : - బీమా, పెట్టుబడి కలిపి ఉన్న పధకాలు -ఎండోమెంట్, హోల్ లైఫ్ , మనీ బ్యాక్, యూలిప్స్ లాంటివి, బీమా హామీ తక్కువ, రాబడి తక్కువ, ప్రీమియం ఎక్కువ . వీటిబదులు తక్కువ ప్రీమియం తో అధిక బీమా హామీ ఇచ్చే టర్మ్ పాలసీ ని తీసుకోవడం మంచిది.

నేషనల్ పెన్షన్ సిస్టం :- పదవీవిరమణ నిధి, పెన్షన్ పొందేందుకు మంచి పధకం. ప్రతి నెల కొంత మొత్తం జమ చేయడం మంచిది.
ఈఎల్ఎస్ఎస్:- 3 ఏళ్ల లాక్ ఇన్ ఉంటుంది. స్వల్పకాలంలో అధిక రాబడి ఆశించలేము. దీనిబదులు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లో ఇతర పథకాలైన లార్జ్ కాప్, మిడ్ కాప్, స్మాల్ కాప్, మల్టీ కాప్ పథకాలలో మదుపు చేయొచ్చు. దీర్ఘకాలంలో మంచి రాబడి పొందొచ్చు.
యులిప్స్:- బీమా హామీ తక్కువ, రాబడి తక్కువ, ప్రీమియం ఎక్కువ. దూరంగా ఉండటం మంచిది.

నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్, 5 ఏళ్ల బ్యాంకు, పోస్ట్ ఆఫీస్ ఫిక్సెడ్ డిపాజిట్ :-
పిల్లల ట్యూషన్ ఫీజు, గృహ రుణ అసలు చెల్లింపు :

ముగింపు:
కొత్త పద్ధతిలోకి మారితే, పన్ను మినహాయింపు కోసం తప్పనిసరిగా చేయాల్సిన పెట్టుబడులు ఉండవు. కాబట్టి , చేతిలో మిగులు సొమ్ము దుర్వినియోగం అయ్యే అవకాశం ఉండొచ్చు. అందువలన ఆర్ధిక లక్ష్యాలను నిర్దేశించుకుని , తగిన రీతిలో మదుపు చేయాలి. దీనికి క్రమశిక్షణ, పట్టుదల ఉండాలి. స్వల్పకాలిక అవసరాలకోసం డబ్బు ఖర్చు పెట్టరాదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని