Result: ఫీనిక్స్‌ మిల్స్‌ నికర లాభం రూ.292 కోట్లు

4వ త్రైమాసిక ఫలితాలను ప్రకటించిన ఫీనిక్స్‌ మిల్స్‌.

Published : 25 May 2023 23:49 IST

లార్జ్‌-క్యాప్‌ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ అయిన ఫీనిక్స్‌ మిల్స్‌ మార్చి 2023తో ముగిసిన త్రైమాసికంలో నికర అమ్మకాలు రూ.47.16% పెరిగి రూ.729.04 కోట్లకు చేరాయి. గతేడాది 2022, మార్చి త్రైమాసికంలో నికర అమ్మకాలు 495.39 కోట్లు. 2023, 4వ త్రైమాసికంలో ఫీనిక్స్‌ మిల్స్‌ నికర లాభం 140% పెరిగి రూ.292.30 కోట్లకు చేరుకుంది. 2022, 4వ త్రైమాసికంలో దీని నికర లాభం రూ.121.90 కోట్లు. 2023, 4వ త్రైమాసికంలో ఫీనిక్స్‌ మిల్స్‌ EBITDA క్రితం సంవత్సరం త్రైమాసికంతో పోలిస్తే రూ.241.10 కోట్ల నుంచి 79% వృద్ధితో రూ.430.79 కోట్లుగా ఉంది. దీని ఈపీఎస్‌ రూ.5.87 నుంచి రూ.14.22కు పెరిగింది. ఇది సంవత్సరానికి 142% వృద్ధిని నమోదు చేసింది. అర్హతగల వాటాదారులకు బోర్డు 250% డివిడెండ్‌ను ప్రకటించిందని ఫీనిక్స్‌ మిల్స్‌ స్టాక్‌ ఎక్స్చేంజ్‌ ఫైలింగ్‌లో తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు