Tobacco Rules: పొగాకు హెచ్చరిక నిబంధనలపై OTTల అభ్యంతరం..!
OTTs on tobacco rules: ఓటీటీల్లో ప్రసారమయ్యే సినిమాలు, వెబ్‌సిరీస్‌ల్లో పొగాకు హెచ్చరికలు చూపించాలన్న నిబంధనపై ఆయా సంస్థల నుంచి అభ్యంతరం వ్యక్తమవుతోంది. దీనివల్ల వందలాది గంటల పాత కంటెంట్‌ను ఎడిట్ చేయాల్సి వస్తుందని పేర్కొంటున్నాయి.
దిల్లీ: థియేటర్ల తరహాలోనే ఓటీటీల్లోనూ (OTT) ఇకపై పొగాకు వ్యతిరేక హెచ్చరికలను (Tobacco rules) తప్పనిసరి చేయడంపై ఓటీటీ వేదికల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సినిమాలు, వెబ్ సిరీస్‌లు, ఇతర వినోద కార్యక్రమాల్లోనూ ఈ నిబంధనను పాటించాలని కేంద్రం సూచించడంపై ఆయా వేదికలు అభ్యంతరం వ్యక్తంచేస్తున్నాయి. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం సందర్భంగా తీసుకొచ్చిన నిబంధనను సవాల్ చేయాలని ఓటీటీ వేదికలు నిర్ణయించినట్లు తెలుస్తోంది.
‘పొగాకు వినియోగం క్యాన్సర్ కారకం, పొగాకు వినియోగం ప్రాణాంతకం’ అని సినిమా థియేటర్లు, టీవీల్లో ప్రదర్శించినట్లుగానే ఓటీటీల్లోనూ కార్యక్రమం ప్రారంభానికి ముందు, మధ్యలో కనీసం 30 సెకన్ల పాటు పొగాకు దుష్ప్రభావాన్ని వివరించేలా ప్రకటన ఉండాలని కేంద్రం ఇటీవల ఓటీటీలకు సూచించింది. దీంతో పాటు పొగాకు ఉత్పత్తులను, వాటి వినియోగాన్ని చూపే దృశ్యాలు వచ్చినప్పుడు డిస్‌క్లెయిమర్‌ను చూపించాలని పేర్కొంది. ఈ హెచ్చరికలు కూడా ఓటీటీ కంటెంట్ ప్రసారమయ్యే భాషలోనే ఉండాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
ఈ నిబంధన పట్ల ఓటీటీ కంపెనీలు అభ్యంతరం వ్యక్తంచేస్తున్నాయి. హెచ్చరికలను జోడించడం కోసం ఇప్పటికే ఉన్న లక్షలాది గంటల కంటెంట్‌ను ఎడిట్ చేయడమనేది తలకుమించిన భారంగా భావిస్తున్నాయి. ఈ మేరకు అమెజాన్, డిస్నీ, నెట్‌ఫ్లిక్స్‌తో పాటు జియో సినిమాకు చెందిన ప్రతినిధులు ఇటీవల సమావేశమైనట్లు తెలుస్తోంది. దీనిపై న్యాయపరంగా ఎలా ముందుకెళ్లాలన్నదానిపై ఈ సమావేశంలో చర్చించారని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ముఖ్యంగా ఐటీ, సమాచార, ప్రసారాల శాఖ కాకుండా ఆరోగ్యమంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో ఆ శాఖ అధికారాలను సవాల్ చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
పుంగనూరు కేసులో కుమారుడికి బెయిల్ రాలేదని.. తల్లి ఆత్మహత్యాయత్నం
-
Supreme Court: అరుదైన ఘట్టం.. సంజ్ఞల భాషలో సుప్రీంకోర్టులో వాదన
-
TS TET Results: రేపు టెట్ ఫలితాలు
-
ఏసీ వేసుకుని నిద్రపోయిన డాక్టర్.. చలికి ఇద్దరు నవజాత శిశువుల మృతి
-
Imran khan: త్వరలో సకల సౌకర్యాలున్నజైలుకు ఇమ్రాన్
-
Chandrababu: నేడు సుప్రీంకోర్టు ముందుకు చంద్రబాబు పిటిషన్