Neuralink: 6 నెలల్లో మనిషి మెదడులో చిప్.. మస్క్ కీలక ప్రకటన!
మనిషి మెదడులో చిప్‌ను ప్రవేశపెట్టే కీలక ప్రాజెక్టును చేపట్టిన న్యూరాలింక్ తాజాగా కీలక అప్‌డేట్‌ను అందించింది. వచ్చే ఆరు నెలల్లో దీనికి సంబంధించిన మానన ప్రయోగాలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్లు తెలిపింది.
కాలిఫోర్నియా: మనిషి మెదడులో ఎలక్ట్రానిక్ చిప్‌ను అమర్చే సాంకేతికతకు సంబంధించి న్యూరాలింక్ (Neuralink) అధినేత ఎలాన్ మస్క్ కీలక ప్రకటన చేశారు. ‘బ్రెయిన్-కంప్యూటర్ ఇంటర్‌ఫేస్’ (బీసీఐ) సాంకేతికతను మరో ఆరు నెలల్లో మానవులపై ప్రయోగించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు. కాలిఫోర్నియాలోని ఫ్రెమోంట్‌లో ఉన్న న్యూరాలింక్ (Neuralink) ప్రధాన కార్యాలయంలో బుధవారం సాయంత్రం జరిగిన సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో తమ ప్రాజెక్టుకు సంబంధించిన తాజా వివరాలను మస్క్ సహా ఆయన న్యూరాలింక్ (Neuralink) బృందం వివరించింది. మనిషి మెదడులో పెట్టబోయే చిప్‌తో పాటు దాన్ని పుర్రెలో అమర్చగలిగే రోబోను కూడా పరిచయం చేశారు. మనుషులపై ప్రయోగాలు జరిపేందుకు అవసరమైన అనుమతుల కోసం అమెరికా ‘ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (FDA)’కు సమర్పించాల్సిన పత్రాలను సిద్ధం చేస్తున్నట్లు మస్క్ తెలిపారు. అలాగే ఇప్పటి వరకు ఎఫ్‌డీఏతో జరిపిన చర్చలు సానుకూలంగా సాగాయని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: ఏమిటీ న్యూరాలింక్ ప్రాజెక్టు? ఎలా పనిచేస్తుంది? ప్రయోజనాలేంటి?
మెదడుతో పాటు ఇతర శరీర భాగాల్లో కూడా చిప్‌లను అమర్చడంపైనా న్యూరాలింక్ (Neuralink) పరిశోధనలు చేస్తోంది. ఈ క్రమంలో మరో రెండు బీసీఐలను కూడా మస్క్ తాజా సమావేశంలో పరిచయం చేశారు. పక్షవాతం వచ్చినవారిలో దెబ్బతిన్న అవయవాలను కదలించగలిగేలా చేసేందుకు వెన్నుపూసలో అమర్చేందుకు ఓ చిప్‌ను రూపొందిస్తున్నట్లు మస్క్ తెలిపారు. అలాగే చూపు కోల్పోయిన వారికి సైతం సాయపడేలా మరో పరికరాన్ని సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ రెండింటిలో తాము కచ్చితంగా విజయం సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ప్రయోగాల్లో భాగంగా మెదడులో చిప్ అమర్చిన ఓ వానరం ఎలా వ్యవహరిస్తుందో ఈ సమావేశంలో న్యూరాలింక్ ప్రదర్శించింది. ఎలాంటి పరికరం లేకుండా ఓ కోతి వీడియో గేమ్ ఆడుతున్నట్లు వీడియోలో చూపించారు. మెదడులో అమర్చిన చిప్ ద్వారా అది కంప్యూటర్‌కు ఆదేశాలు ఇవ్వగలుగుతోందని తెలిపారు.
ఎలాన్ మస్క్‌కు కృత్రిమ మేధ (ఏఐ)పై తీవ్ర వ్యతిరేకత ఉంది. అది మానవుల కన్నా తెలివైందని, భవిష్యత్‌లో మానవాళిపై ఆధిపత్యం సాధిస్తుందని తరచూ చెబుతున్నారు. దాన్ని ఎదుర్కోవడానికే న్యూరాలింక్ ప్రాజెక్టుకు ఆయన శ్రీకారం చుట్టారు. ఏఐని అధిగమించేలా మానవ మేధస్సును, సామర్థ్యాలను పెంచడానికి ఈ ప్రాజెక్టు దోహదపడుతుందని ఆయన పేర్కొంటున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Social Look: పల్లెటూరి అమ్మాయిగా దివి పోజు.. శ్రీముఖి ‘పింక్’ పిక్స్!
-
World News
Mexico-US Border: శరణార్థి శిబిరంలో ఘోర అగ్నిప్రమాదం.. 39 మంది మృతి..!
-
Sports News
Cricket: నాన్‌స్ట్రైకర్ రనౌట్.. బ్యాట్ విసిరి కొట్టిన బ్యాటర్
-
General News
Amaravati: రాజధాని అమరావతిపై రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనను తిరస్కరించిన సుప్రీంకోర్టు
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Politics News
Chandra Babu: పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో రూపొందించాలి: చంద్రబాబు