Car loan: కారు లోన్‌ కావాలా? తక్కువ వడ్డీకే రుణాలందించే బ్యాంకులివే..

చాలా బ్యాంకులు సాధార‌ణంగా కారు ఆన్‌-రోడ్ ధ‌ర‌లో 80%-90% వ‌ర‌కు మాత్ర‌మే రుణానికి స‌మ‌కూరుస్తున్నాయి.

Updated : 27 Nov 2021 15:21 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్ర‌స్తుత కాలంలో మ‌ధ్య‌త‌ర‌గ‌తి వారు కూడా ఇద్ద‌రు కంటే ఎక్కువ మంది ప్ర‌యాణించ‌డానికి కారునే అనువైన సాధ‌నంగా భావిస్తున్నారు. కారును కొనుగోలు చేయ‌డానికి చేతిలో త‌గినంత న‌గ‌దు లేకున్నా.. బ్యాంకు అందించే కారు రుణాలు తీసుకుంటున్నారు. బ్యాంకులు కూడా ఈ రుణాలను విరివిగా అంద‌జేస్తున్నాయి. అయితే కారు రుణం తీసుకునేట‌ప్పుడు వివిధ బ్యాంకులు అందించే వ‌డ్డీ రేట్లు, వివిధ ఆఫ‌ర్లు స‌రిపోల్చుకోవాలి. వ‌డ్డీ రేట్ల‌తో పాటు, బ్యాంకుల పాల‌సీల ప్ర‌కారం మారే ప్రాసెసింగ్ ఫీజులు, రీపేమెంట్ ఛార్జీలు మొద‌లైన ఇత‌ర ఛార్జీల గురించి కూడా త‌నిఖీ చేసుకోవాలి. కారు కొన‌డానికి త‌గినంత న‌గ‌దు లేన‌ప్పుడు వ్య‌క్తిగ‌త రుణం వంటి అసుర‌క్షిత రుణం కంటే త‌క్కువ వ‌డ్డీ రేటుతో ల‌భించే కారు రుణం తీసుకోవ‌డం మంచిది. చాలా బ్యాంకులు వినియోగ‌దారుల‌కు మెరుగైన సేవ‌లు అందించాల‌నే ఉద్దేశంతో కారు డీల‌ర్ల‌తో ప్ర‌త్యేక‌మైన టై-అప్‌ల‌ను క‌లిగి ఉంటున్నాయి. కారు డీల‌రు షోరూమ్‌లోనే బ్యాంకు ప్ర‌తినిధిని నియ‌మిస్తున్నారు. కారు రుణ ప్రాసెసింగ్ వేగ‌వంతం చేసి రాయితీ ధ‌ర‌ల‌కే కారును వినియోగ‌దారుల‌కు అందిస్తున్నాయి.

కొన్ని బ్యాంకులు, ఎంచుకున్న వినియోగ‌దారుల‌కు ప్రీ-అప్రూవ్డ్ కారు రుణాలు లేదా వారి ప్ర‌స్తుత గృహ రుణ గ్ర‌హీత‌ల‌కు ప్రిఫ‌రెన్షియల్ (ప్రత్యేక) రేట్ల‌ను కూడా అందిస్తున్నాయి. మెరుగైన రుణాన్ని పొంద‌డానికి మీరు వేర్వేరు బ్యాంకులు అందించే కారు రుణ ఆఫ‌ర్ల‌ను పోల్చి చూసుకోవాలి. కారు రుణాల‌పై వ‌ర్తించే వ‌డ్డీ రేట్లు మీ క్రెడిట్ స్కోర్‌, మీ వ్య‌క్తిగ‌త ఆదాయంపై ఆధారపడి ఉంటాయి. చాలా బ్యాంకులు త‌మ రుణ రేట్ల‌ను క్రెడిట్ స్కోర్లతో అనుసంధానించాయి. కాబ‌ట్టి 750 లేదా అంత‌కంటే ఎక్కువ క్రెడిట్ స్కోరు ఉన్న వారికి త‌క్కువ వ‌డ్డీ రేట్ల‌కు రుణం పొంద‌డానికి స‌హాయ‌ప‌డ‌తాయి. అందువల్ల కారు రుణానికి ముందే మీ క్రెడిట్ నివేదిక‌ల‌ను చెక్ చేసుకోవాలి.

చాలా బ్యాంకులు సాధార‌ణంగా కారు ఆన్‌-రోడ్ ధ‌ర‌లో 80-90 శాతం వ‌ర‌కు రుణాలు అందిస్తుంటాయి. కొన్ని బ్యాంకులు నిబంధ‌న‌లు, ష‌ర‌తుల‌కు లోబ‌డి కారు వాల్యుయేష‌న్ ఖ‌ర్చులో 100% నిధులు స‌మ‌కూర్చ‌వ‌చ్చు. బ్యాంకులు సాధార‌ణంగా గ‌రిష్ఠంగా 7 సంవ‌త్స‌రాల కాల వ్య‌వ‌ధికి రుణాల‌ను అందిస్తున్నాయి.

ప్ర‌స్తుతం దేశంలో అతి త‌క్కువ కారు రుణ వ‌డ్డీ రేట్ల‌ను అందిస్తున్న ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ రంగ బ్యాంకుల జాబితా దిగువ ప‌ట్టిక‌లో ఉంది. ఈ ప‌ట్టిక‌లో 5 సంవ‌త్స‌రాల కాల వ్య‌వ‌ధికి, రూ.5 ల‌క్ష‌ల కారు రుణానికి సంబంధించి ఈఎంఐ వివరాలను అందిస్తున్నాం.

గ‌మ‌నిక: బ్యాంకులు తెలిపిన అత్య‌ల్ప వ‌డ్డీ రేట్లు మాత్ర‌మే ఇక్కడ ఇచ్చాం. మీ లోన్ మొత్తం, క్రెడిట్ స్కోరు, చేసే వృత్తి, బ్యాంకు విధించే ఇత‌ర నిబంధ‌న‌లు, ష‌ర‌తులపై ఆధార‌ప‌డి మీకు వ‌ర్తించే వ‌డ్డీ రేటులో మార్పు ఉండొచ్చు. ప్రాసెసింగ్ ఫీజులు, ఇత‌ర ఛార్జీలను ఈఎంఐలో కలపలేదు.

Read latest Business News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని