Banking: ఐసీఐసీఐ బ్యాంక్‌ మ‌నీ 2 వ‌ర‌ల్డ్ (M2W) కొత్త స‌దుపాయాలు

ఈ స‌ర్వీసు కోసం అన్ని రోజుల్లో, ఏ స‌మ‌యంలో(24/7)నైనా రిజిస్ట‌ర్ చేసుకోవ‌చ్చు

Updated : 04 Jun 2022 11:48 IST

ఐసీఐసీఐ బ్యాంక్ త‌న బాహ్య చెల్లింపు వేదిక (అవుట్‌వర్డ్ రెమిటెన్స్ ప్లాట్‌ఫారమ్) ‘మనీ2వరల్డ్’ (M2W) ద్వారా మ‌రిన్ని కొత్త సేవ‌ల‌ను అందించనుంది. ఐసీఐసీఐ బ్యాంకులో ఖాతాలేని వినియోగ‌దారుల‌కు కూడా మెరుగైన సేవ‌ల‌ను అందించనున్నట్లు ప్ర‌క‌టించింది. ‘మనీ2వరల్డ్’ ద్వారా ఇత‌ర బ్యాంకు వినియోగ‌దారులు వీడియో కాన్ఫ‌రెన్సింగ్ ద్వారా కేవైసీ ప్ర‌క్రియ‌ను పూర్తి చేసుకోవ‌చ్చు. అలాగే వినియోగదారులు విద్య, దగ్గరి బంధువుల ఆర్థిక‌ నిర్వహణ, బహుమతి, ప్రయాణంతో సహా అనేక ప్రయోజనాల కోసం 21 కరెన్సీలకు నిధులను పంపవచ్చు. ఇంకా ఇత‌ర ప్ర‌యోజ‌నాలను పొంద‌వ‌చ్చు. 

మ‌నీ 2 వ‌ర‌ల్డ్ ఫ్లామ్‌ద్వారా ల‌భించే ముఖ్య‌మైన ప్ర‌యోజ‌నాలు..
వీడియో కేవైసీ స‌దుపాయం..
ఎమ్‌2డ‌బ్ల్యూ లో భాగం అయిన వినియోగ‌దారుల‌కు వీడియో కాల్ ద్వారా కేవైసీ పూర్తిచేసేందుకు బ్యాంకు అధికారులు స‌హాయ‌ప‌డ‌తారు. బ్యాంకులో ఖాతాలేని క‌స్ట‌మ‌ర్లు కూడా ఈ స‌దుపాయాన్ని వినియోగించుకొని కేవైసీ పూర్తిచేసుకోవ‌చ్చు. కేవైసీ వెరిఫికేష‌న్ కోసం బ్యాంకులకు వెళ్ల‌డం కోసం చాలా స‌మ‌యం వెచ్చించాల్సి వ‌స్తుంది. కానీ వీడియో కాల్ ద్వారా నిమిషాల వ్య‌వ‌ధిలోనే కేవైసీ పూర్తి చేసుకుని స‌మ‌యం ఆదా చేసుకోవ‌చ్చు.  

ఎల్ఆర్ఎస్ లిమిట్ పెంపు..
ఎమ్‌2డ‌బ్ల్యూ ద్వారా ఇత‌ర బ్యాంకు క‌స్ట‌మ‌ర్లు ఎల్ఆర్ఎస్ కింద 2,50,000 యూఎస్ డాల‌ర్ల వ‌ర‌కు చెల్లింపులు చేయ‌వ‌చ్చు. దీంతో వివిధ అవ‌స‌రాల నిమిత్తం విదేశాల‌కు పెద్ద‌ మొత్తంలో డ‌బ్బు సుల‌భంగా పంప‌వ‌చ్చు. 

‘ఐ మొబైల్ పే’ ద్వారా..
బ్యాంక్ కస్టమర్‌లు ‘iMobile Pay’ ద్వారా విదేశాల‌కు సుల‌భంగా డబ్బును పంపవచ్చు. యాప్‌లోకి లాగిన‌య్యి, ‘సెండ్ మనీ’ ఆప్షన్‌ని ఎంచుకుని, ‘ట్రాన్స్‌ఫర్ ఓవర్సీస్’ని ఎంచుకోవడం ద్వారా విదేశాలకు డబ్బు పంపవచ్చు.

రేట్ అల‌ర్ట్‌..
బ్యాంక్ ఎస్ఎమ్ఎస్‌/ఈ-మెయిల్ ద్వారా క‌స్ట‌మ‌ర్ల‌కు వ్య‌క్తిగ‌తంగా ఫారెక్స్ రేట్ అల‌ర్ట్స్‌ను అందిస్తుంది. దీంతో వినియోగ‌దారులు..వారు కోరుకున్న మార‌క‌పు ధ‌ర‌ల వ‌ద్ద స్వ‌యంచాల‌కంగా లావాదేవీలు చేసుకోవ‌చ్చు. ఈ స‌ర్వీసుల‌ను అందిస్తున్న మొట్ట‌మొద‌టి బ్యాంక్ ఇదే కావ‌డం విశేషం. 

నిర్ధిష్ట సూచ‌న‌లు..
క‌స్ట‌మ‌ర్ల సూచ‌న‌ల మేర‌కు షెడ్యూల్ చేయబడిన గడువు తేదీకి స్వ‌యంచాల‌కంగా చెల్లింపులు చేయ‌వ‌చ్చు. 

ఈ స‌ర్వీసు కోసం అన్ని రోజుల్లో ఏ స‌మ‌యంలో(24/7)నైనా రిజిస్ట‌ర్ చేసుకోవ‌చ్చు. ఆన్‌లైన్ ద్వారా సుల‌భంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవ‌చ్చు. విదేశాల‌కు డ‌బ్బు బ‌దిలీ చేసేందుకు ప్ర‌తీసారి బ్యాంకును సంప్ర‌దించాల్సిన అవ‌స‌రం ఉండ‌దు. ఐసీఐసీఐ బ్యాంక్ ఖాతాదారులు మ‌నీ2వ‌ర‌ల్డ్ కోసం ప్ర‌త్యేకంగా రిజిస్ట‌ర్ చేసుకోన‌వ‌రం లేదు. నెట్ బ్యాంకింగ్ ద్వారా లాగిన‌య్యి సేవ‌ల‌ను పొంద‌వ‌చ్చు. ఇత‌ర బ్యాంకు ఖాతాదారులు రిజిస్ట‌ర్ చేసుకోవాల్సి ఉంటుంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని