Hyundai Tucson: హ్యుందాయ్‌ టక్సన్‌ సరికొత్తగా.. ఎప్పుడంటే?

ఇటీవలే వెన్యూ 2022 వెర్షన్‌ను తీసుకొచ్చిన హ్యుందాయ్‌ త్వరలో టక్సన్‌ అప్‌డేటెడ్‌ వెర్షన్‌ను విడుదల చేయనుంది....

Published : 07 Jul 2022 17:53 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇటీవలే వెన్యూ 2022 వెర్షన్‌ను తీసుకొచ్చిన హ్యుందాయ్‌ త్వరలో టక్సన్‌ అప్‌డేటెడ్‌ వెర్షన్‌ విడుదలకు సన్నాహాలు చేస్తోంది. జులై 13న ఈ ఎస్‌యూవీ ఆవిష్కరణ కార్యక్రమం ఉంది. ఆగస్టులో ధరల్ని ప్రకటించి బుకింగ్‌లను స్వీకరించనున్నట్లు సమాచారం. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే టక్సన్‌ కొత్త వెర్షన్‌ను విడుదల చేశారు. మొత్తం రెండు వేరియంట్లలో ఇది అందుబాటులో ఉంది. భారత్‌లో 2,680 ఎంఎం వీల్‌బేస్‌ కలిగిన కారును విడుదల చేయనున్నట్లు ఇటీవల కంపెనీ విడుదల చేసిన వీడియోని బట్టి తెలుస్తోంది.

గత వెర్షన్ల తరహాలోనే ఈ కారులోనూ 5 సీట్లు ఉన్నాయి. అయితే రెండో వరుసలో ఎక్కువ స్థలం ఉన్నట్లు సమాచారం. రెండు ఇంజిన్‌ ఆప్షన్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఒకటి 2.0 లీటర్‌ పెట్రోల్‌ కాగా.. మరోకటి 2.0 లీటర్‌ డీజిల్‌. బ్లూలింక్‌ కనెక్టెడ్‌ కార్‌ టెక్‌, డిజిటల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌, పానరోమిక్‌ సన్‌రూఫ్‌, 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. తొలిసారి హ్యుందాయ్‌లో ‘అడ్వాన్స్‌డ్‌ డ్రైవర్‌ అసిస్టెన్స్‌ సిస్టమ్స్‌ (ADAS)’ను ఈ కారుతోనే ప్రవేశపెడుతున్నట్లు సమాచారం. ధర రూ.25 లక్షల వరకు ఉండొచ్చని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని