LIC Jeevan Azad: ఎల్ఐసీ నుంచి కొత్త ప్లాన్.. జీవన్ ఆజాద్ పూర్తి వివరాలివీ..
LIC unveils Jeevan Azad: జీవన్ ఆజాద్ పేరిట ఎల్ఐసీ కొత్త ప్లాన్‌ను తీసుకొచ్చింది. వ్యక్తిగత పొదుపు, జీవిత బీమాల కలయికతో ఈ పాలసీని వస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: దేశీయ దిగ్గజ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) కొత్త పాలసీని ప్రారంభించింది. జీవన్ ఆజాద్ (Jeevan azad) (ప్లాన్ నం. 868) పేరుతో కొత్త పాలసీని తీసుకొచ్చింది. వ్యక్తిగత పొదుపు, జీవిత బీమాల కలయికతో ఈ ప్లాన్ వస్తోంది. ఎల్ఐసీ జీవన్ ఆజాద్ (LIC Jeevan Azad).. లిమిటెడ్ పీరియడ్ పేమెంట్ ఎండోమెంట్ ప్లాన్. పాలసీదారుడు పాలసీ కాలవ్యవధిలో మరణిస్తే కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. మెచ్యూరిటీ వరకు జీవించి ఉంటే.. గ్యారెంటీ ఇచ్చిన మొత్తాన్ని ఏకమొత్తంగా చెల్లిస్తారు. ఈ పాలసీలో రుణం తీసుకునే సదుపాయం కూడా ఉంది.
హామీ మొత్తం..
ఎల్ఐసీ జీవన్ ఆజాద్ ప్లాన్.. కనీస ప్రాథమిక హామీ రూ.2 లక్షలు. గరిష్ఠ ప్రాథమిక హామీ రూ.5 లక్షలు. పాలసీ గరిష్ఠ కాలపరిమితి 20 ఏళ్లు.
ప్రీమియం వ్యవధి..
ప్రీమియం చెల్లింపు వ్యవధి పాలసీ కాలపరిమితిపై ఆధారపడి ఉంటుంది. పాలసీ కాలపరిమితి నుంచి 8 ఏళ్లు తీసివేస్తే వచ్చిన కాలవ్యవధి పాటు ప్రీమియం చెల్లింపులు చేయాలి. ఉదా: ఒకవేళ మీరు 20 సంవత్సరాల పాలసీ కాలవ్యవధిని ఎంచుకుంటే ప్రీమియం చెల్లింపు వ్యవధి 12 ఏళ్లు (20-8) ఉంటుంది.
డెత్ బెనిఫిట్..
రిస్క్ ప్రారంభమైన తేదీ తర్వాత గానీ, మెచ్యూరిటీ తేదీకి ముందు గానీ పాలసీ వ్యవధిలో పాలసీదారుడు మరణిస్తే డెత్ బెనిఫిట్ చెల్లిస్తారు. ఇది 'బేసిక్ సమ్ అష్యూర్డ్' లేదా వార్షిక ప్రీమియం కంటే 7 రెట్లు ఎక్కువగా ఉంటుంది. డెత్ బెనిఫిట్ అనేది మరణించిన తేదీ వరకు చెల్లించిన మొత్తం ప్రీమియంలో 105% కంటే తక్కువ కాకుండా ఉంటుంది.
గమనిక: సాధారణంగా సంప్రదాయ బీమా పాలసీలలో రాబడి కాస్త తక్కువగా ఉండొచ్చు. పాలసీ ఎంచుకునే ముందు పాలసీ డాక్యుమెంట్ చదివి దాని గురించి వివరంగా తెలుసుకోవడం మేలు. వీలయితే ఆర్థిక నిపుణుడి సలహా తీసుకోవడం మంచిది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Mutual Funds: స్మాల్ క్యాప్ ఫండ్లపై రాబడులివే
స్మాల్ క్యాప్ ఫండ్లలో రిస్క్ ఉన్నప్పటికీ, దీర్ఘకాలంలో గణనీయమైన రాబడిని అందించగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. ఈ ఫండ్లలో మంచి ఫలితాలను అందించిన కొన్నింటిని ఇక్కడ చూడొచ్చు. -
సెకండ్ హ్యాండ్ లగ్జరీ కారు కొనుగోలు ప్రయోజనమేనా?
నాన్ లగ్జరీ కారు కొనుగోలు కంటే కొద్దిగా ఎక్కువ ఖర్చు చేస్తే అధునాతన ఫీచర్లు గల సెకండ్ హ్యాండ్ లగ్జరీ కారు కొనుగోలు చేయొచ్చు. ఇలాంటి కార్ల కొనుగోలుతో ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా అనేది చూద్దాం. -
జీవిత బీమాలో క్లెయిం సెటిల్మెంట్ ఎలా?
జీవిత బీమా క్లెయిమ్స్ సెటిల్మెంట్ అనేది బీమా సంస్థకు సంబంధించిన ముఖ్యమైన సేవల్లో కీలకమైనది. క్లెయిం సెటిల్మెంట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. -
ఆరోగ్య బీమా కొనుగోలుకు వయో పరిమితి తొలగింపు
ఆరోగ్య బీమా కొనుగోలుకు ఉన్న వయో పరిమితిని ఐఆర్డీఏ తొలగించింది. దీంతో అన్ని వయసుల వారూ బీమా పాలసీని తీసుకునే అవకాశం లభించనుంది. -
ఆదాయపు పన్ను రిటర్నులు ఎప్పుడంటే...
ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు వీలుగా సంబంధిత ఐటీఆర్‌లను ఐటీ శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే పన్ను చెల్లింపుదారులకు 2023-24 ఆర్థిక సంవత్సరంలో (2024-25 మదింపు సంవత్సరం) మూలం వద్ద పన్ను కోత (టీడీఎస్)కు సంబంధించిన వివరాలను సంక్షిప్త సందేశాల రూపంలో పంపిస్తూ ఉంది -
ఆరోగ్య బీమా ప్రీమియం భారం కాకుండా
ఆర్థిక ప్రణాళికలో ఆరోగ్య బీమా పాలసీ ఎంతో కీలకంగా మారింది. ఊహించని వైద్య ఖర్చులను తట్టుకునేందుకు పూర్తి స్థాయి ఆరోగ్య బీమా పాలసీ అనివార్యం అవుతోంది. -
ఉన్నత చదువులకు భరోసానిద్దాం...
పిల్లల చదువుల ఖర్చులు ఏటా 7-10 శాతం పెరుగుతున్నాయి. మరోవైపు క్షీణిస్తున్న రూపాయి విలువ దీనికి అదనం. ఒకప్పటితో పోలిస్తే పిల్లల ఉన్నత చదువుల ప్రణాళిక ఇప్పుడు క్లిష్టంగా మారింది. -
వెండిలో పెట్టుబడి లాభమేనా?
బంగారం, వెండి.. ఈ రెండు లోహాలతో భారతీయులకు విడదీయలేని సంబంధం ఉంది. ఆభరణాలు, వస్తువుల రూపంలో వీటిని కొనుగోలు చేసేందుకు అందరూ ఆసక్తి చూపిస్తారు -
సరైన బీమా హామీ మొత్తాన్ని ఎలా ఎంచుకోవాలి?
ప్రస్తుత కాలంలో సంపాదించే ప్రతి వ్యక్తికి, ముఖ్యంగా తనపై ఆధారపడిన వారు ఉన్నప్పుడు తగిన జీవిత బీమా మొత్తం ఉండడం ఎంతో అవసరం. ఎంత బీమా ఉంటే కుటుంబ సభ్యులకు సరిపోవచ్చో ఇక్కడ చూడండి. -
ఆరోగ్య బీమా రూల్స్‌లో మార్పులు.. పాలసీదారులకు ప్రయోజనం
IRDAI : ఆరోగ్య బీమా పాలసీల నిబంధనల విషయంలో బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. వీటి ద్వారా బీమా కస్టమర్లకు మరింత ప్రయోజనం చేకూరనుంది. -
మిడ్ క్యాప్ ఫండ్లపై రాబడులు ఎంతెంత?
దేశీయంగా పెట్టుబడులకు వివిధ మ్యూచువల్ ఫండ్ల పథకాలు ఉన్నాయి. ఈ మ్యూచువల్ ఫండ్లలో మంచి ఫలితాలను అందించిన కొన్ని మిడ్ క్యాప్ ఫండ్లను ఇక్కడ చూడొచ్చు. -
కొత్త ఏడాదిలో పన్ను విధానం ఎంచుకుంటున్నారా? ఇవి తెలుసుకున్నాకే..!
Income tax: కొత్త ఆర్థిక సంవత్సరంలో వేతన జీవులు పన్ను విధానం యాజమాన్యానికి తెలియజేయాలి. టీడీఎస్ కోసం మీకు నప్పే పన్ను విధానం ఎంచుకోవడం మంచిది. -
పదవీ విరమణ తర్వాత రూ.1 కోటి నిధి సరిపోతుందా?
చాలా మంది పదవీ విరమణ నిధికి రూ.1 కోటి సరిపోతుందని అనుకుంటారు. ఎలాంటి విషయాలు పదవీ విరమణ నిధిని, రాబడిని ప్రభావితం చేస్తాయి. రూ.1 కోటి నిధి సరిపోతుందా? లేదా? ఇక్కడ తెలుసుకోండి.. -
జీవిత బీమా.. అనుబంధ పాలసీలు తీసుకున్నారా?
ఊహించని పరిస్థితుల నుంచి మీ కుటుంబ ఆర్థిక భవిష్యత్తుకు రక్షణ కల్పించేది జీవిత బీమా. సంపాదించే ప్రతి ఒక్కరూ తన ఆర్థిక ప్రణాళికల్లో దీనికి తగిన స్థానం ఇవ్వాల్సిందే. ఆయుర్దాయం పెరుగుతోంది. అదే సమయంలో జీవన శైలీ మారుతోంది. -
లక్ష్య సాధనకు సిప్ మార్గం
స్టాక్ మార్కెట్లో చిన్న మొత్తాలతోనూ మదుపు చేసేందుకు క్రమానుగత పెట్టుబడి విధానం (సిప్) తోడ్పడుతుంది. గతంతో పోలిస్తే ఇప్పుడు సిప్ ద్వారా మదుపు చేసే వారు పెరిగారు. యాంఫీ గణాంకాల ప్రకారం చూస్తే.. గత నెలలో దాదాపు 42.87 లక్షల కొత్త సిప్ ఖాతాలు ప్రారంభమయ్యాయి. -
విహార యాత్రలో ధీమాగా
వేసవి సెలవులు వచ్చేశాయి. ఈ కాలంలో చల్లని ప్రాంతాలకు వెళ్లేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తుంటారు. ఇందులో చాలామంది విదేశాలకు వెళ్లేవారూ ఉంటారు. ఈ నేపథ్యంలో విదేశీ ప్రయాణాల్లో అనుకోని అవాంతరాలు, అనారోగ్యం వచ్చినప్పుడు తోడుండేలా బీమా తీసుకోవడం మంచిది. -
టర్మ్ బీమా ప్రీమియంలు ఎంతెంత?
చిన్న వయసులోనే జీవిత బీమా తీసుకుంటే ప్రీమియం తక్కువగా ఉంటుంది. వివిధ బీమా సంస్థలు వసూలు చేసే ప్రీమియంలు ఎంతెంతున్నాయో ఇక్కడ చూడండి. -
రెగ్యులర్ Vs డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్.. ఏది బెటర్?
Mutual Funds: మ్యూచువల్ ఫండ్లలో మదుపర్లకు రెండు రకాల పథకాలు అందుబాటులో ఉంటాయి. వాటిలో ఏది ఎంచుకోవాలో చాలా మందికి అవగాహన ఉండదు. -
వివిధ లార్జ్ క్యాప్ ఫండ్లపై రాబడులు ఇలా ఉన్నాయి
3, 5, 10 సంవత్సరాల్లో అత్యుత్తమ పనితీరు కనబరిచిన లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ పథకాలు ఇక్కడ ఉన్నాయి. -
స్థిరాస్తుల్లో మదుపు చేద్దామా
పెట్టుబడులు పెట్టేందుకు అనేక మార్గాలు అందుబాటులో ఉన్నాయి. షేర్లు, బాండ్లు, ఫిక్స్డ్ డిపాజిట్లలాంటి పెట్టుబడి పథకాలు, బంగారం, స్థిరాస్తుల వరకూ ఎన్నో విస్తృత శ్రేణి ఎంపికలు ఉన్నాయి. -
ఓటీపీ ఆ అంకెలు జాగ్రత్త
ఒక్క క్లిక్‌తో కావాల్సినవన్నీ కొనేస్తున్నాం. బ్యాంకింగ్ లావాదేవీలన్నీ చేసేస్తున్నాం. వీటన్నింటికీ ఆరంకెల ఓటీపీ (వన్ టైమ్ పాస్వర్డ్) చాలు.. ఇంత సౌలభ్యంతోపాటు, కొన్ని ప్రమాదాలూ పొంచి ఉన్నాయి
తాజా వార్తలు (Latest News)
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్‌కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!