
New PAN rule: నగదు డిపాజిట్, విత్‌డ్రాలపై నేటి నుంచి అమలులోకి రానున్న కొత్త రూల్స్ ఇవే!
ఇంటర్నెట్‌డెస్క్: ఒక ఆర్థిక సంవత్సరంలో చేసే రూ.20 లక్షలు, అంతకంటే ఎక్కువ డిపాజిట్/విత్‌డ్రాలకు పాన్ లేదా ఆధార్ కార్డును అందించాలని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డ్ కొత్త నియమాలను తీసుకొచ్చింది. ఈ కొత్త రూల్స్ నేటి (మే 26) నుంచి అమలులోకి రానున్నాయి. సీబీడీటీ నోటిఫికేషన్ ప్రకారం అధిక మొత్తంలో బ్యాంకులు, పోస్టాఫీసుల వద్ద లావాదేవీలు చేసే వారు లేదా కరెంట్ లేదా క్యాష్ క్రెడిట్ ఖాతాను తెరిచేవారు పాన్ లేదా ఆధార్లను తప్పనిసరిగా వెల్లడించాలి.
బ్యాంకులు, పోస్టాఫీసుల్లో నగదు డిపాజిట్, విత్‌డ్రాలపై కొత్త నియమాలు..
* ఒక ఆర్థిక సంవత్సరంలో ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలు లేదా పోస్టాపీసుల్లో రూ.20 లక్షలు లేదా అంతకు మించి చేసే నగదు డిపాజిట్/విత్‌డ్రాలకు పాన్ లేదా ఆధార్‌ను ఇవ్వాలి. అంటే ఒకేసారి రూ.20 లక్షలు డిపాజిట్/విత్‌డ్రా చేసినా లేదా విడివిడిగా డిపాజిట్/విత్‌డ్రా చేసిన మొత్తం రూ.20 లక్షలకు మించితే పాన్ కార్డు ఇవ్వాల్సిందే.
* వాణిజ్య బ్యాంకులు మాత్రమే కాకుండా పోస్టాఫీసులు, సహకార బ్యాంకులులో చేసిన డిపాజిట్/విత్‌డ్రాలను కూడా పరిగణనలోకి తీసుకొంటారు.
* పాన్ కార్డు లేని వారు ఆధార్ కార్డును కూడా ఇవ్వచ్చు.
* నగదు లావాదేవీలకు సంబంధించి ఈ కొత్త రూల్స్‌ని అమలు చేసేందుకు ఆదాయపు పన్ను నిబంధనలు, 1962లో పలు సవరణలు చేసినట్లు సీబీడీటీ నోటిఫై చేసింది.
* ఈ విధమైన లావాదేవీల్లో ఇచ్చే పాన్‌కార్డ్ లేదా ఆధార్ కార్డులోని డెమోగ్రఫిక్(జనాభా), బయోమెట్రిక్ సమాచారాన్ని సెక్షన్ 139 ఏ ప్రకారం ప్రిన్సిపాల్ డైరెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ (సిస్టమ్స్), డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ (సిస్టమ్స్) వారి ద్వారా గానీ, సదరు డిపార్ట్మెంట్ ద్వారా అధికారం పొందిన వ్యక్తిగానీ ధ్రువీకరించాలి.
* అధిక మొత్తంలో లావాదేవీలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నవారు, లావాదేవీలు చేసే 7 రోజుల ముందు పాన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
* బ్యాంకులు, పోస్టాఫీసల వద్ద కరెంట్ లేదా క్యాష్ క్రెడిట్ ఖాతాను తెరిచేవారు కూడా పాన్ లేదా ఆధార్లను తప్పనిసరిగా వెల్లడించాలి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Business News
Amazon primeday sale: ప్రైమ్ యూజర్లూ అలర్ట్.. ప్రైమ్ డే సేల్ ఈ సారి ముందుగానే!
-
Politics News
Harish Rao: భాజపా నేతల మాటల్లో విషం తప్ప విషయం లేదు: హరీశ్‌రావు
-
Movies News
Sini Shetty: ఇప్పటి మిస్ ఇండియా ఒకప్పటి ఎయిర్టెల్ భామనే
-
Sports News
Bairstow: కోహ్లీతో గొడవ.. బెయిర్‌స్టో ఏమన్నాడంటే..?
-
Politics News
Maharashtra: రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం.. పవార్ సంచలన వ్యాఖ్యలు..!
-
Business News
windfall tax: విండ్‌ఫాల్ పన్ను తొలగింపు ఎప్పుడంటే..
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Cyber Crime: ఆన్లైన్ మోసానికి సాఫ్ట్వేర్ ఉద్యోగిని బలి!
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (04-07-2022)
- బిగించారు..ముగిస్తారా..?
- భార్యతో అసహజ శృంగారం.. రూ.కోటి ఇవ్వాలని డిమాండ్
- Raghurama: ఏపీ పోలీసులు ఫాలో అవుతున్నారని రైలు దిగిపోయిన ఎంపీ రఘురామ
- cook yadamma : ఔరౌర పెసర గారె.. అయ్యారె సకినాలు..!
- IND vs ENG: బుమ్రా స్టన్నింగ్ క్యాచ్.. బెన్‌స్టోక్స్‌ను ఎలా ఔట్ చేశాడో చూడండి
- ప్రేమ పెళ్లి చేసుకున్నాడని మట్టుబెట్టారు
- Hyderabad News: నన్ను లోనికి రానివ్వలేదనేది దుష్ప్రచారమే: యాదమ్మ
- Rishabh Pant: వికెట్ కీపర్లలో పంత్.. బ్రియాన్ లారా: పాక్ మాజీ కెప్టెన్