New PAN rule: న‌గ‌దు డిపాజిట్‌, విత్‌డ్రాల‌పై నేటి నుంచి అమ‌లులోకి రానున్న‌ కొత్త రూల్స్ ఇవే!

వాణిజ్య బ్యాంకులు మాత్ర‌మే కాకుండా పోస్టాఫీస‌లు, స‌హ‌కార బ్యాంకులులో చేసిన డిపాజిట్‌/విత్‌డ్రాల‌ను కూడా ప‌రిగ‌ణ‌లోకి తీసుకొంటారు.

Updated : 17 Aug 2022 11:18 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఒక ఆర్థిక సంవ‌త్స‌రంలో చేసే రూ.20 లక్ష‌లు, అంత‌కంటే ఎక్కువ డిపాజిట్/విత్‌డ్రాలకు పాన్ లేదా ఆధార్‌ కార్డును అందించాలని కేంద్ర ప్ర‌త్యక్ష ప‌న్నుల బోర్డ్ కొత్త నియ‌మాల‌ను తీసుకొచ్చింది. ఈ కొత్త రూల్స్ నేటి (మే 26) నుంచి అమ‌లులోకి రానున్నాయి. సీబీడీటీ  నోటిఫికేష‌న్ ప్ర‌కారం అధిక మొత్తంలో బ్యాంకులు, పోస్టాఫీసుల వ‌ద్ద లావాదేవీలు చేసే వారు లేదా క‌రెంట్ లేదా క్యాష్ క్రెడిట్ ఖాతాను తెరిచేవారు పాన్ లేదా ఆధార్‌ల‌ను త‌ప్ప‌నిస‌రిగా వెల్ల‌డించాలి.

బ్యాంకులు, పోస్టాఫీసుల్లో న‌గ‌దు డిపాజిట్‌, విత్‌డ్రాల‌పై కొత్త నియమాలు..

* ఒక ఆర్థిక సంవ‌త్స‌రంలో ఒక‌టి కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలు లేదా పోస్టాపీసుల్లో రూ.20 లక్ష‌లు లేదా అంత‌కు మించి చేసే న‌గ‌దు డిపాజిట్‌/విత్‌డ్రాల‌కు పాన్ లేదా ఆధార్‌ను ఇవ్వాలి. అంటే ఒకేసారి రూ.20 ల‌క్ష‌లు డిపాజిట్‌/విత్‌డ్రా చేసినా లేదా విడివిడిగా డిపాజిట్‌/విత్‌డ్రా చేసిన మొత్తం రూ.20 ల‌క్ష‌ల‌కు మించితే పాన్ కార్డు ఇవ్వాల్సిందే.

* వాణిజ్య బ్యాంకులు మాత్ర‌మే కాకుండా పోస్టాఫీసులు, స‌హ‌కార బ్యాంకులులో చేసిన డిపాజిట్‌/విత్‌డ్రాల‌ను కూడా ప‌రిగ‌ణ‌నలోకి తీసుకొంటారు.

* పాన్ కార్డు లేని వారు ఆధార్ కార్డును కూడా ఇవ్వ‌చ్చు.  

* న‌గ‌దు లావాదేవీల‌కు సంబంధించి ఈ కొత్త రూల్స్‌ని అమలు చేసేందుకు ఆదాయపు పన్ను నిబంధనలు, 1962లో పలు సవరణలు చేసిన‌ట్లు సీబీడీటీ నోటిఫై చేసింది.

* ఈ విధ‌మైన లావాదేవీల్లో ఇచ్చే పాన్‌కార్డ్ లేదా ఆధార్ కార్డులోని డెమోగ్రఫిక్(జనాభా), బయోమెట్రిక్ సమాచారాన్ని సెక్ష‌న్ 139 ఏ ప్ర‌కారం ప్రిన్సిపాల్ డైరెక్టర్ ఆఫ్ ఇన్‌కమ్ ట్యాక్స్ (సిస్టమ్స్), డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇన్‌కమ్ ట్యాక్స్ (సిస్టమ్స్) వారి ద్వారా గానీ, స‌ద‌రు డిపార్ట్‌మెంట్ ద్వారా అధికారం పొందిన వ్య‌క్తిగానీ ధ్రువీకరించాలి.

* అధిక మొత్తంలో లావాదేవీలు చేసేందుకు ప్లాన్ చేస్తున్న‌వారు, లావాదేవీలు చేసే 7 రోజుల ముందు పాన్ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

* బ్యాంకులు, పోస్టాఫీస‌ల వ‌ద్ద క‌రెంట్ లేదా క్యాష్ క్రెడిట్ ఖాతాను తెరిచేవారు కూడా పాన్ లేదా ఆధార్‌ల‌ను త‌ప్ప‌నిస‌రిగా వెల్ల‌డించాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని