JK Tire: వాణిజ్య వాహనాల కోసం కొత్త టైర్లు

మారుతున్న రవాణా రంగ అవసరాలకు అనుగుణంగా వాణిజ్య వాహనాల కోసం సరికొత్త టైర్ల శ్రేణిని జేకే టైర్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌ ఆవిష్కరించింది. శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో వీటిని సంస్థ ప్రెసిడెంట్‌ అనూజ్‌ కథారియా విపణిలోకి విడుదల చేశారు.

Published : 22 Jun 2024 02:38 IST

విపణిలోకి విడుదల చేసిన జేకే టైర్‌

ఈనాడు, హైదరాబాద్‌: మారుతున్న రవాణా రంగ అవసరాలకు అనుగుణంగా వాణిజ్య వాహనాల కోసం సరికొత్త టైర్ల శ్రేణిని జేకే టైర్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌ ఆవిష్కరించింది. శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో వీటిని సంస్థ ప్రెసిడెంట్‌ అనూజ్‌ కథారియా విపణిలోకి విడుదల చేశారు. ఇందులో జెట్‌వే జేయూఎం ఎక్స్‌ఎం, జెట్‌వే జేయూసీ ఎక్స్‌ఎం, జెట్‌స్టీల్‌ జేడీసీ ఎక్స్‌డీతోపాటు విద్యుత్‌ బస్సుల కోసం ప్రత్యేకంగా జెట్‌వే జేయూఎక్స్‌ఈ టైర్లు ఉన్నాయి.  దేశంలో వాణిజ్య వాహనాల టైర్లు ఏడాదికి దాదాపు 1.20 కోట్ల మేరకు అమ్ముడవుతున్నాయని, ఏటా 5% వృద్ధి లభిస్తోందన్నారు. ఇందులో తాము నాయకత్వ స్థానంలో ఉన్నామన్నారు. విస్తరణ ప్రణాళికల్లో భాగంగా రూ.1,400 కోట్ల మేరకు పెట్టుబడులు పెడుతున్నామని వివరించారు. మొత్తం 500 రకాల టైర్లను అందిస్తున్నామని, ఇందులో 12 అడుగుల ఎత్తువీ ఉన్నాయన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని