Twitter CEO: ట్విటర్ కొత్త సీఈఓ లిండా తొలి ట్వీట్ ఇదే..!
Twitter CEO: లిండా యాకరినో ట్విటర్‌కు కొత్త సీఈఓగా నియమితులయ్యారు. సీఈఓగా ఆమెను ఎలాన్ మస్క్ ప్రకటించిన తర్వాత శనివారం ఆమె తొలి ట్వీట్ చేశారు.
శాన్‌ఫ్రాన్సిస్కో: మరింత మెరుగైన భవిష్యత్‌ను సృష్టించాలనే ఎలాన్ మస్క్ విజన్ నుంచి తాను స్ఫూర్తి పొందానని ట్విటర్ కొత్త సీఈఓ లిండా యాకరినో అన్నారు. ఆ దిశగా సామాజిక మాధ్యమ దిగ్గజం ట్విటర్‌ను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానన్నారు. మస్క్ ఆమెను ట్విటర్ సీఈఓగా ప్రకటించిన తర్వాత లిండా చేసిన తొలి ట్వీట్ ఇదే.
తనకు కొత్త ఫాలోవర్లు పెరిగినట్లు లిండా తెలిపారు. తాను ఇంకా ఎలాన్ మస్క్ అంతటి విజయవంతమైన వ్యక్తిని కాలేదని చెప్పారు. కానీ, ట్విటర్‌ను అభివృద్ధి చేయడానికి మాత్రం ఆయనతో సమానంగా కట్టుబడి ఉన్నానని పేర్కొన్నారు. ఈ క్రమంలో యూజర్ల ఫీడ్‌బ్యాక్ చాలా ముఖ్యమని తెలిపారు.
ట్విటర్‌కు కొత్త సీఈఓగా లిండా యాకరినో నియమితులైన విషయం తెలిసిందే. సంస్థ అధినేత ఎలాన్ మస్క్ నుంచి ఆమె ఈ బాధ్యతలు తీసుకోనున్నారు. ప్రధానంగా ట్విటర్ వ్యాపార కార్యకలాపాలపైనే లిండా దృష్టి సారిస్తారని ట్విటర్ ద్వారా మస్క్ తెలియజేశారు. ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్, సీటీఓ హోదాలో ప్రొడక్ట్ డిజైన్, కొత్త సాంకేతికతల బాధ్యతలను తానే నిర్వహిస్తానని అందులో ఆయన పేర్కొన్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Mangalagiri: రెండేళ్ల చిన్నారిని నేలకేసి కొట్టి చంపిన తండ్రి
-
Ap-top-news News
ISRO: అక్కడే చదివి.. శాస్త్రవేత్తగా ఎదిగి..ఎన్వీఎస్-01 ప్రాజెక్టు డైరెక్టర్ స్ఫూర్తిగాథ
-
India News
Women safety device: మహిళల రక్షణకు ఎలక్ట్రిక్ చెప్పులు
-
Ts-top-news News
Raghunandan: ఎమ్మెల్యే రఘునందన్‌పై రూ.1000 కోట్లకు పరువునష్టం దావా
-
Sports News
Dhoni: రిటైర్మెంట్పై నిర్ణయానికి ఇది సరైన సమయమే కానీ.. ధోనీ ఆసక్తికర వ్యాఖ్యలు
-
India News
Bus Accident: లోయలో పడిన బస్సు.. ఏడుగురి మృతి