WhatsApp: పోలింగ్‌లో ఒక్కసారే ఓటింగ్‌.. ఫొటో క్యాప్షన్‌.. వాట్సాప్‌ కొత్త అప్‌డేట్‌!

వాట్సాప్‌ (WhatsApp) కొత్తగా మూడు అప్‌డేట్‌లను తీసుకొచ్చింది. వాటిలో ఒకటి ప్రస్తుతం ఉన్న ఫీచర్‌కు అప్‌డేట్‌ కాగా.. మిగిలిన రెండు కొత్త ఫీచర్లు. మరి వీటితో యూజర్లకు ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో చూద్దాం. 

Published : 06 May 2023 00:05 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: మెసేజింగ్ యాప్‌ వాట్సాప్ ( WhastApp) కొత్తగా మూడు ఫీచర్లను యూజర్లకు పరిచయం చేసింది. ఈ మేరకు వాట్సాప్‌ బ్లాగ్‌లో మూడు ఫీచర్ల గురించి ప్రకటన చేసింది. ఇప్పటికేలో అందులోబాటులో ఉన్న పోల్స్‌ ఫీచర్‌ను అప్‌డేట్‌ చేయగా.. ఫార్వాడ్‌ చేసే ఫొటోలకు, షేర్‌ చేసే డాక్యుమెంట్‌లకు క్యాప్షన్‌ ఇవ్వొచ్చని తెలిపింది. 

పోల్స్‌ అప్‌డేట్‌..

ఏదైనా అంశంపై ఇతరుల అభిప్రాయం తెలుసుకునేందుకు వీలుగా వాట్సాప్‌ పోల్స్‌ (WhatsApp Polls) ఫీచర్‌ను పరిచయం చేసింది. కొత్తగా ఇందులో మూడు అప్‌డేట్‌లను తీసుకొచ్చింది. క్రియేట్ సింగిల్ ఓట్‌ పోల్‌ (Create Single-Vote Polls), సెర్చ్‌ ఫర్‌ పోల్స్‌ ఇన్ చాట్స్‌ (Search for Polls in Your Chats), పోల్‌ రిజల్ట్‌ అప్‌డేట్ (Stay Updated on Poll Results). 

  • ప్రస్తుతం వాట్సాప్‌ పోల్స్‌లో యూజర్లు ఒకటి కన్నా ఎక్కువసార్లు తమకు నచ్చిన ఆప్షన్‌కు ఓటు వేయవచ్చు. దీనివల్ల పోల్స్‌ ఫలితాల్లో సరైన పారదర్శక ఉండటంలేదని చాలా మంది యూజర్లు అభిప్రాయపడుతున్నారు. దీనికి పరిష్కారంగానే వాట్సాప్‌ క్రియేట్‌ సింగిల్‌ ఓట్‌ పోల్‌ ఆప్షన్‌ తీసుకొచ్చింది. దీంతో పోల్‌లో పాల్గొనేవారు ఒక్కసారి మాత్రమే ఓటు వేయగలరు. 
  • ఏదైనా గ్రూప్‌లో పోల్‌ నిర్వహించినప్పుడు తర్వాత ఓటు వేద్దామని మర్చిపోతాం. తర్వాత గ్రూప్‌లో వచ్చిన మెసేజ్‌లతో పోల్‌ ఎక్కడ ఉందనేది కనిపించదు. ఇలాంటి సందర్భంలో పోల్‌ను సులువుగా గుర్తించేందుకు చాట్‌ పేజీలో సెర్చ్‌ చేయొచ్చు. గ్రూప్‌ లేదా వ్యక్తిగత చాట్‌ పేజీలో సెర్చ్‌ ఆప్షన్‌లోకి వెళ్లి పోల్స్‌ అని టైప్‌ చేస్తే మొత్తం పోల్స్‌ జాబితా చూపిస్తుంది. 
  • పోల్‌ రిజల్ట్‌ అప్‌డేట్ ఫీచర్‌తో యూజర్లు తాము నిర్వహించే పోల్స్‌లో ఎవరైనా ఓటు వేసిన వెంటనే నోటిఫికేషన్‌ వస్తుంది. దీనివల్ల ఎప్పుడు? ఎవరెవరు ఓటు వేశారనేది సులువుగా తెలుసుకోవచ్చు. 

ఫొటో విత్‌ క్యాప్షన్‌ 

గతంలో ఇతరుల పంపిన లేదా గ్రూప్‌లో వచ్చిన ఫొటోలను మరొకరితో షేర్‌ చేసేటప్పుడు ఇమేజ్‌ మాత్రమే ఫార్వార్డ్ చేయగలిగేవాళ్లం. దాంతోపాటు ఉన్న టెక్స్ట్‌ను వేరేగా కాపీ చేసి పేస్ట్‌ చేయాల్సిందే. కానీ, ఫార్వాడింగ్‌ విత్‌ క్యాప్షన్స్ (Forwarding With Captions) ఫీచర్‌తో ఇతరుల పంపిన ఫొటోతోపాటు, దాని కింద ఉన్న క్యాప్షన్‌ కూడా ఫార్వార్డ్‌ అవుతుంది. 

డాక్యుమెంట్‌ విత్‌ క్యాప్షన్‌

షేరింగ్ డాక్యుమెంట్‌ విత్‌ క్యాప్షన్స్‌ (Sharing Documents With Captions)తో యూజర్లు ఏదైనా డాక్యుమెంట్‌ను ఇతరులతో షేర్‌ చేసేటప్పుడు దాని గురించిన సమాచారం క్లుప్తంగా పంపవచ్చు. అంటే ఫొటో విత్‌ క్యాప్షన్‌ తరహాలోనే యూజర్‌ అటాచ్‌ ఫైల్‌ ఆప్షన్‌ ద్వారా ఏదైనా డాక్యుమెంట్‌ పంపుతుంటే.. అందులోని సమాచారం గురించి వివరిస్తూ టెక్స్ట్‌ యాడ్‌ చేయొచ్చు. ఈ మూడు ఫీచర్లు యూజర్లకు అందుబాటులో ఉన్నాయి. ఒకవేళ ఎవరి ఫోన్‌లో అయినా అప్‌డేట్ కాకపోతే.. వాట్సాప్‌ యాప్‌ లేటెస్ట్ వెర్షన్‌కు అప్‌డేట్ చేసుకుని వీటిని ఉపయోగించుకోవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు