Elon Musk: అలా చేస్తే మాంద్యం విస్తృతం.. ఫెడ్‌ రేట్ల పెంపుపై మస్క్‌

ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం (Recession) భయాలు కొనసాగుతున్న నేపథ్యంలో టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ (Elon musk) కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ (Fed) మరోసారి వడ్డీ రేట్లను (Rate hike) పెంచితే మాంద్యం మరింత విస్తృతం అవుతుందని ట్వీట్‌ చేశారు.

Published : 10 Dec 2022 15:04 IST

న్యూయార్క్‌: ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం (Recession) భయాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ (Elon musk) కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ (Fed) మరోసారి వడ్డీ రేట్లను (Rate hike) పెంచితే మాంద్యం మరింత విస్తృతం అవుతుందని ట్వీట్‌ చేశారు. గత నెలలోనూ మస్క్‌ ఇదే తరహా అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ మాంద్యం దిశగా పయనిస్తోందని, ఫెడ్‌ వడ్డీ రేట్లను పెంచడం ఆపాలని సూచించారు. తీవ్రమైన ఆర్థిక మాంద్యం తలెత్తకముందే వడ్డీ రేట్లు తగ్గించాలని ఇటీవల సైతం మరోసారి విన్నవించారు.

మాంద్యంపై మస్క్‌ చేసిన వ్యాఖ్యలపై పలువురు నెటిజన్లు స్పందించారు. ‘‘అవును నిజమే. కానీ, ద్రవ్యోల్బణం కట్టడికి ఫెడ్‌ వడ్డీ రేట్లు పెంచకపోయినా తీవ్ర ప్రభావం పడుతుంది. అప్పుడు సైతం రేట్లు పెరిగి తీవ్ర మాంద్యం సంభవిస్తుంది’’ అని ఓ నెటిజన్‌ పేర్కొన్నాడు. మరో నెటిజన్‌ మాత్రం ఇందుకు కాస్త భిన్నంగా స్పందించాడు. ‘‘మస్క్‌ వద్దే పెద్ద మొత్తంలో సంపద పోగుపడి ఉంది. దీన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇది మరింత ఆందోళనకరం’’ అని పేర్కొన్నాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు