Published : 16 Aug 2022 15:55 IST

Stock market: లాభాల్లో ముగిసిన సూచీలు.. 17,800 ఎగువన నిఫ్టీ

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు లాభాల్లో ముగిశాయి. ముఖ్యంగా దేశీయంగా వెలువడిన గణాంకాలు మార్కెట్లను నడిపించాయి. రిటైల్‌, టోకు ధరల ద్రవ్యోల్బణాలు కాస్త తగ్గుముఖం పట్టడం సెంటిమెంట్‌ను బలపరిచింది. ఇదే ధోరణి కొనసాగితే వచ్చే నెల జరిగే పరపతి సమీక్ష విధానంలో రేట్ల పెంపు నిర్ణయాన్ని ఆర్‌బీఐ పక్కనపెట్టొచ్చన్న అంచనాలు నెలకొన్నాయి. దీనికి విదేశీ సంస్థాగత మదుపరుల కొనుగోళ్లూ తోడయ్యాయి. దీంతో సూచీలు రోజంతా లాభాల్లో కదలాడాయి. నిఫ్టీ 17,800 ఎగువన ముగిసింది. 

ఉదయం 59,675 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైన సెన్సెక్స్‌ రోజంతా అదే ఒరవడిని కొనసాగించింది. ఇంట్రాడేలో 59,923 వద్ద గరిష్ఠానికి చేరుకుంది. చివరికి 379.43 పాయింట్ల లాభంతో 59,842.21 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 127.10 పాయింట్లు లాభపడి 17,825.30 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్‌లో మహీంద్రా అండ్‌ మహీంద్రా, మారుతీ, ఏషియన్‌ పెయింట్స్‌, హిందుస్థాన్‌ యూనిలీవర్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌ కంపెనీలు లాభాల్లో ముగిశాయి. స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, భారతీ ఎయిర్‌టెల్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, టీసీఎస్‌, ఎన్టీపీసీ షేర్లు స్వల్పంగా నష్టాలు చవిచూశాయి. పీఎస్‌యూ బ్యాంక్‌ సూచీ మినహా అన్ని రంగాల సూచీలు లాభాల్లో ముగిశాయి.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని